CM Revanth Reddy | ఎర్రగడ్డకు వెళ్లి టిమ్స్ కట్టానని చెప్పాడట!. కేటీఆర్‌పై రేవంత్ సెటైర్లు..!
CM Revanth Reddy | సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రి విషయంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. టిమ్స్ ఆసుపత్రులు తామే నిర్మించామని చెప్పుకుంటున్న కేటీఆర్.. పదేళ్లు అధికారంలో ఉన్నా వాటిని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. టిమ్స్‌లు పూర్తి కాకపోయినా ఫామ్‌హౌస్‌లు మాత్రం సమయానికి పూర్తయ్యాయంటూ బీఆర్‌ఎస్ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
CM Revanth Reddy | సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రి విషయంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. టిమ్స్ ఆసుపత్రులు తామే నిర్మించామని చెప్పుకుంటున్న కేటీఆర్.. పదేళ్లు అధికారంలో ఉన్నా వాటిని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. టిమ్స్‌లు పూర్తి కాకపోయినా ఫామ్‌హౌస్‌లు మాత్రం సమయానికి పూర్తయ్యాయంటూ బీఆర్‌ఎస్ నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ప్రస్తావనతో కేటీఆర్‌పై సీఎం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభోత్సవంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. 'నిన్న ఒకాయన ఇక్కడికి వచ్చిపోయిండు. సనత్‌నగర్ ఎమ్మెల్యే వాళ్ల పార్టీని నాయకుడిని వెంట పెట్టుకొని వచ్చాడు. మనం ఆసుపత్రిని పూర్తి చేస్తున్నామని, సీఎం ఆసుపత్రిని ప్రారంభిస్తున్నారని పత్రికలు, టీవీల్లో చూసి పగటి వేషగాళ్ల వేసుకొని ఇక్కడికి వస్తున్నరు. సనత్‌నగర్ ఎమ్మెల్యే కేటీఆర్‌ను తీసుకొని వచ్చి కలియతిరిగారు. ఇది మేమే కష్టపడి కట్టినం. రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తున్నడని ఆరోపణలు చేశాడు. నాకు అభ్యంతరం లేదు. కనీసం వాళ్లు ఆత్మపరిశీలన చేసుకునేందుకు ఈ పర్యటన పనికి వస్తది' అని సీఎం రేవంత్ అన్నారు.
బుర్ర తక్కువ కదా?
'సనత్‌నగర్ ఎమ్మెల్యే చెప్పిండు.. వెనుకాలే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఉంటది.. చూసిపోదమని చెప్పిండు. మనోనికి బుర్ర తక్కువ కదా? ఆలోచన ఉండదుకదా? దబదబ లోపలికి పోయిండు. అక్కడ ఎవరిపనులు వాళ్లు చేసుకుంటున్నరు. ఓ పెద్ద మనిషి కండ్లు మూసుకొని.. ధాన్యం చేస్తున్నట్లుగా.. గత జ్ఞాపకాలను, కుటుంబాన్ని గుర్తు చేసుకుంటుండగా.. డీప్ ట్రాన్‌లో ఉంటే సనత్‌నగర్ ఎమ్మెల్యే తాతా అంటూ లేపిండు. ఏం సంగతి బిడ్డా అంటే.. మా సార్‌ను గుర్తుపట్టినవా అని ఈయనను (కేటీఆర్) చూపిచ్చిండు. లేదు బిడ్డా నేను గుర్తుపట్టలేదు అన్నడు. ఆ సార్‌కు విపరీతమైన కోపం, ఉక్రోషం వచ్చింది. నన్ను గుర్తుపట్టవా? తెలంగాణలో ఉండి నన్ను గుర్తుపట్టవా? నా సంగతి, మా నాయన సంగతి నీకు తెల్వదా? నన్నెట్ల గుర్తుపట్టలేదని అన్నడు. లేదుబిడ్డా నిజంగా నేను గుర్తుపట్టలేదంటే.. ఇగో ఆ సనత్‌నగర్ టిమ్స్ నేనే.. అల్వాల్ టిమ్స్ కట్టింది నేనే.. ఎల్‌బీనగర్ టిమ్స్ కట్టింది నేనే. అయినా నన్ను గుర్తుపడ్త లేవా? అని అన్నడు. ముసలాయన ఊకుండు బిడ్డ.. నేను కూడా లోపలికి వచ్చినప్పుడు చార్మినార్, గోల్గొండ నేనే కట్టినా.. హైదరాబాద్ నగరాన్ని నేనే నిర్మించినా అని చెప్పెటోడిని. డాక్టర్లు గుర్తుపట్టారు నా పిచ్చికాస్త ఎర్రిగా మారిందని. కరెంటు వైర్లు పెట్టి షాక్ ఇయ్యంగానే జర సోయిలోకి వచ్చిన. తొందరలోనే ఇంటికిపోతున్న బిడ్డ. నువ్వుగూడ వారం ఉంటేనే సెట్ అవుతుంది. అతను ఎర్రిలేచి, తిక్కతోని ఎర్రగడ్డకు వచ్చిందని అనుకున్నడు. నీకు ఏం కాదు బిడ్డ. డాక్టర్లు మంచోళ్లు ఉన్నరు. కరెంటు వైర్లు పెడితే వారంలో నిజం అర్థమవుతుందని చెప్పిండు. గట్లనున్నది ఆయన కథ టిమ్స్ కట్టిన అన్నది' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు సీఎం.
రిబ్బన్ కట్ చేయడానికి సమయం దొరకలేదా?
'నువ్వు కడితే పదేళ్లు. టెంకాయ కొట్టడానికి, రిబ్బన్ కట్ చేయడానికి సమయం దొరకలేదా? నిజంగనే సనత్‌నగర్, అల్వాల్, ఎల్‌బీనగర్ టిమ్స్ కట్టినా, వరంగల్ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ కట్టినా.. పదేళ్లు చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. హరీశ్‌రావు వైద్యారోగ్యశాఖ మంత్రిగా ఉన్నట్టు ఉన్నడు. లేకపోతే ఇంకో ఆయన ఉన్నట్టు ఉన్నడు. మరి మీరు ఎందుకు రిబ్బన్ కట్ చేయలేదు. ఎందుకు పేదల కోసం సేవలు అందించాలనే ప్రయత్నం చేయలేదు. ఉస్మానియాను నిర్వీర్యం చేసి కూల్చాలని ప్రయత్నం చేస్తే కొత్త ఉస్మానియాను మేం కట్టినం. మీరు జీవోలు ఇచ్చి టెంకాయలు కొట్టి మీరు ఏం కట్టుకున్నరు. ఎర్రవెల్లిలో ఫామ్ హౌస్ కట్టుకున్నరు. జన్వాడలో వంద ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకున్నవ్ నువ్వు, వైట్‌హౌస్ కూడా పనికిరానంత గొప్ప ఫౌమ్‌హౌస్ కట్టుకున్నవ్. మీ చెల్లెలు శంకర్‌పల్లిలో ఫామ్‌హౌస్ కట్టుకున్నది. మీ మొయినాబాద్‌లో ఫామ్‌హౌస్ కట్టుకున్నడు ఎప్పుడన్న ఆగిందా? ఒకాయన వెయ్యి ఎకరాల్లో, ఇంకోకాయన వంద ఎకరాలు, మీ చెల్లెలు 50 ఎకరాలు, మీ బావ ఎకరాలల్లో విలాసవంతమైన భవనాలు, పెద్దపెద్ద గడీలు నిర్మించుకున్నరు. సరైన సమయంలో అవి పూర్తయినవి. మా పేదలకు అందించే ఒక్క హాస్పిటల్‌నైనా సమయానికి పూర్తి చేశారా? ప్రారంభించారా? పేదలకు వైద్యం అందించారా? ఇంకా ఆత్మ పరిశీలన లేకుండా.. ఏమాత్రం సమాజం గమనిస్తుందని.. సిగ్గులేకుండా నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పి బతకాలనుకుంటున్నరు' అంటూ విమర్శలు గుప్పించారు.
తపస్సు చేస్తే పాపాలు తగ్గుతయ్
'తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని తప్పులు చేసినా ప్రొఫెసర్ కోదండరామ్ మొఖం చూసి మేం ఊరుకున్నాం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. దయచేసి మీ ఆలోచనలు, బుద్ధి మారాలి. కరువు రావాలని అఘోర దీక్షలు, రాష్ట్రంలో రైతులు సచ్చిపోవాలని చేతబడులు చేయించడం మానాలని, మీ బుద్ధులు మారాలని ఆ నల్లమల అడవుల్లో రెండేళ్లు తపస్సు చేస్తే.. అడవుల్లో చెంచులకు సేవ చేస్తే.. ఆదిలాబాద్‌లో గోండులకు సేవలు అందిస్తే.. మీరు సంపాదించిన లక్ష కోట్లల్లో కనీసం నియోజకవర్గానికి రూ.10కోట్లో రూ.20కోట్లు ఖర్చు చేస్తే మీరు చేసిన పాపాలు కొన్నైనా తగ్గుతయ్. మీకు విముక్తి జరుగుతుంది. అంతే తప్ప అబద్ధాల ప్రచారాలతో, ఏఐ సోషల్ మీడియా ప్రచారాలు, బంట్రోతులు కట్టే ఫ్లెక్సీలతో మిమ్మల్ని ఎవరూ నమ్మరు. మేం అన్ని చేసినం అని చెబితేనే మిమ్మల్ని ఇంటికి పంపారు. పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారు. సర్పంచ్ ఎన్నికల్లో గోయ్యి తీసి పాతిపెట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో మీ అడ్రస్ లేదు. అయినా మీ బుద్ధి మారలేదు. నేనేం మీ బుద్ధి మారాలని కోరుకోవడం లేదు. మీరు ఇట్లనే 2034 వరకు ఉండాలని అనుకుంటున్న. మాలాంటోళ్లు ఉంటే నాకు అల్కటి పని. చంద్రశేఖర్‌రావు నాకు ఏం సాయం చేసినా చేయకపోయినా గట్లాంటి కొడుకును తెలంగాణకు ఇచ్చినందుకు నాకు మేలు జరిగింది. అట్లనే నీ కొడుకు ఉండాలి మారకూడదు. మారితే మేం ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. వాళ్లు అట్లనే అబద్ధాలు చెప్పాలి. అబద్ధాలు చెప్పడం మాననంత కాలం నిజాలు చెప్పడం కూడా మానను. ప్రతీదగ్గర ఐదు నిమిషాలు చెప్పడం మొదలుపెడుతా. ఇన్నిరోజులు మనకెందుకులే అని అనుకున్నా'నన్నారు సీఎం రేవంత్. అనంతరం నిమ్స్ వైద్యులను సీఎం, మంత్రులు సత్కరించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●CM Revanth Reddy | పేదల కోసం రేవంత్ అన్న ఉన్నడని భరోసా కల్పించాలి : సీఎం రేవంత్
- ●CM Revanth Reddy | ప్రజాపాలనలో వైద్యానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●BUS and Lorry Accident | కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బస్సు.. ఐదుగురి పరిస్థితి విషమం
- ●Khajaguda U Turn | ఖాజాగూడ రూట్లో వెళ్తున్నారా? ట్రాఫిక్ రూల్స్‌లో కీలక మార్పులు.. జాయింట్ సీపీ ఆకస్మిక తనిఖీలు
- ●Telangana CEO Sudharsan Reddy | SIR డ్రాఫ్ట్ రిలీజ్ చేయగానే అన్ని రాజకీయ పార్టీలను మీటింగ్‌కు పిలిచిన ఈసీ.. ఎందుకంటే?
- ●Ponguleti Srinivas Reddy | హక్కుదారులకు హామీ ఇస్తున్నా.. 22ఎ వల్ల గజం భూమిని కూడా పోనివ్వం

CM Revanth Reddy | పేదల కోసం రేవంత్ అన్న ఉన్నడని భరోసా కల్పించాలి : సీఎం రేవంత్

CM Revanth Reddy | ప్రజాపాలనలో వైద్యానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్‌రెడ్డి

BUS and Lorry Accident | కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బస్సు.. ఐదుగురి పరిస్థితి విషమం

Khajaguda U Turn | ఖాజాగూడ రూట్లో వెళ్తున్నారా? ట్రాఫిక్ రూల్స్‌లో కీలక మార్పులు.. జాయింట్ సీపీ ఆకస్మిక తనిఖీలు




