CM Revanth Reddy | ప్రజాపాలనలో వైద్యానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy | సామాన్య జనానికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సనత్‌నగర్‌లో నిర్మించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (Dr MCR TIMS) అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ సనత్‌నగర్‌లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు.
CM Revanth Reddy | సామాన్య జనానికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సనత్‌నగర్‌లో నిర్మించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (Dr MCR TIMS) అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ సనత్‌నగర్‌లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. అనంతరం మంత్రులు, అధికారులతో కలిసి సీఎం ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించగా.. ఆయా పరికరాల పనితీరును వైద్యులు వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి టీజీ సేఫ్, ఆరోగ్య దీపిక పాలిక్లీనిక్‌లను ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ 'ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం, మహిళా సంక్షేమంతో పాటు విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రం దేశంలోని మిగతా రాష్ట్రాలతో కాకుండా ప్రపంచంలోనే గొప్ప అవకాశాలు పొందాలని.. అమ్మాయిలు నర్సులు, డాక్టర్లు అయ్యి ప్రపంచవ్యాప్తంగా సేవలు అందించాలి' అని పిలుపునిచ్చారు.
విదేశాల్లో ఉద్యోగాలు ఎదురుచూస్తున్నయ్
'ముఖ్యంగా జర్మనీ, జపాన్, సౌత్ కొరియాలాంటి దేశాలు మన నర్సింగ్ స్టాఫ్‌పై ఎంతో ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటి వరకు వరకు మన నర్సింగ్ గర్ల్స్ మిడిల్ ఈస్ట్ దేశాల్లోనే సేవలు అందించే ప్రయత్నిస్తున్నారు. భవిష్యత్‌లో జర్మనీ, జపనీస్, కొరియా భాషలు నేర్చుకోవాలి. ఆయా దేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మీకోసం ఎదురుచూస్తున్నాయి. అందుకే ఈరోజు నర్సింగ్ కాలేజీల్లో, పారామెడికల్ సిబ్బంది 16వేలమందికి నియామకపత్రాలు అందజేయడం జరిగింది. ఎప్పుడూ ఇంతపెద్ద ఎత్తున నియామకాలు చేపట్టలేదు. పేదల ఆరోగ్యం మా బాధ్యతగా భావిస్తున్నాం. విద్య, వైద్యంపె పెట్టుబడులను ఖర్చులు, పథకాల కింద చూడడం లేదు. భవిష్యత్‌పై పెట్టుబడి పెడుతున్నామని భావిస్తున్నాం. ఈ రోజు పేదవాడి కుటుంబంలో పిల్లల చదువులు, తల్లిదండ్రుల వైద్యమే ఖరీదుగా మారింది. పేదలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరితే ఆస్తులు అమ్మినా సరిపోని పరిస్థితి. చివరికి కిడ్నీలు అమ్ముకునే పరిస్థితి. రాష్ట్రంలో, దేశంలో ప్రైవేటు వైద్యం ఖరీదుగా మారింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ అవగాహనతో రాష్ట్రంలోని నాలుగు కోట్ల ప్రజలకు వైద్యాన్ని అందించాలని, ఉచితంగా ఉండాలి. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే గుండె, కిడ్నీలు బాగుండాలి. గుండె, కిడ్నీలకు సంబంధించి అవయవమార్పిడికి సంబంధించి సూపర్ స్పెషల్ హాస్పిటల్‌ను మర్రి చెన్నారెడ్డి పేరిట సనత్‌నగర్‌లో ప్రారంభించుకోవడం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనకరమైంది' అని సీఎం రేవంత్ తెలిపారు.
ప్రజాపాలనలో వైద్యానికే ఎక్కువ నిధులు
'ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు ప్రతి మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులు, దళితులు, ఆదివాసీలకు, నిరుపేదలందరికీ వైద్యసదుపాయాన్ని అందుబాటులోకి వచ్చాం. చాలామంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు. కొన్ని లెక్కలను మీ ముందు ప్రస్తావించదలచుకున్నాను. ఈ 32నెలల పరిపాలనలో ఆరోగ్యశ్రీ కోసమే రూ.2700కోట్లు ఖర్చుపెట్టడం జరిగింది. అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.2526కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఈ రెండు పథకాల్లోనే వైద్యారోగ్యశాఖ పర్యవేక్షణలో రూ.5,226కోట్లు దేశంలో పేదల కోసం ఈ స్థాయిలో ఏ ప్రభుత్వం నిధులు కేటాయించలేదు, ఖర్చు చేయలేదని గర్వంగా చెబుతున్నాం. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా ప్రతి సంవత్సరం వైద్యారోగ్యశాఖకు రూ.13వేలకోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తే.. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.21,800 కోట్లు ఖర్చు చేశాం. ఇది మేం బాధ్యతగా పెట్టుకున్నాం. ప్రజలు తమపై పెట్టుకున్న విశ్వాసానికి ప్రతీకగా నిరంతరం పరితపిస్తూ.. రూపాయి రూపాయి కూడబెట్టి ఈ రోజు పేదల వైద్యానికి నిధులు అందుబాటులోకి తీసుకువచ్చాం' అని సీఎం రేవంత్ వివరించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

BUS and Lorry Accident | కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బస్సు.. ఐదుగురి పరిస్థితి విషమం
ఆగస్టు 17, 2026

Ponguleti Srinivas Reddy | హక్కుదారులకు హామీ ఇస్తున్నా.. 22ఎ వల్ల గజం భూమిని కూడా పోనివ్వం
ఆగస్టు 17, 2026

Harish Rao | రేవంత్.. నీకు దమ్ముంటే నా పేరెత్తి మాట్లాడు.. నాకు భయపడే ఇన్‌డైరెక్ట్‌గా ఆరోపణలు చేస్తున్నవ్
ఆగస్టు 17, 2026
తాజావార్తలు
- ●BUS and Lorry Accident | కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బస్సు.. ఐదుగురి పరిస్థితి విషమం
- ●Khajaguda U Turn | ఖాజాగూడ రూట్లో వెళ్తున్నారా? ట్రాఫిక్ రూల్స్‌లో కీలక మార్పులు.. జాయింట్ సీపీ ఆకస్మిక తనిఖీలు
- ●Telangana CEO Sudharsan Reddy | SIR డ్రాఫ్ట్ రిలీజ్ చేయగానే అన్ని రాజకీయ పార్టీలను మీటింగ్‌కు పిలిచిన ఈసీ.. ఎందుకంటే?
- ●Ponguleti Srinivas Reddy | హక్కుదారులకు హామీ ఇస్తున్నా.. 22ఎ వల్ల గజం భూమిని కూడా పోనివ్వం
- ●Telangana employees JAC | తెలంగాణ సర్కార్‌పై పోరుకు సిద్ధమవుతున్న ఉద్యోగులు.. పీఆర్సీ, డీఏల సాధన కోసం రేపే కీలక భేటీ
- ●Kalyana Lakshmi Scheme Stopped | 50 లక్షల లాయర్ నీకు ఓకే.. ఆడబిడ్డలకు వద్దా? సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్

BUS and Lorry Accident | కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బస్సు.. ఐదుగురి పరిస్థితి విషమం

Khajaguda U Turn | ఖాజాగూడ రూట్లో వెళ్తున్నారా? ట్రాఫిక్ రూల్స్‌లో కీలక మార్పులు.. జాయింట్ సీపీ ఆకస్మిక తనిఖీలు

Telangana CEO Sudharsan Reddy | SIR డ్రాఫ్ట్ రిలీజ్ చేయగానే అన్ని రాజకీయ పార్టీలను మీటింగ్‌కు పిలిచిన ఈసీ.. ఎందుకంటే?

Ponguleti Srinivas Reddy | హక్కుదారులకు హామీ ఇస్తున్నా.. 22ఎ వల్ల గజం భూమిని కూడా పోనివ్వం



