త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Suryapet | సూర్యాపేట జిల్లాలో ఢీకొట్టుకున్న రెండు ప్రైవేట్‌ బస్సులు!

Suryapet | సూర్యాపేట జిల్లా మునగాల మండలం పరిధిలో రెండు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో రెండు బస్సుల్లో కలిపి 63 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

P

Telangana | Published On Aug 16, 2026, 8.23 am IST

Suryapet | సూర్యాపేట జిల్లాలో ఢీకొట్టుకున్న రెండు ప్రైవేట్‌ బస్సులు!
Advertisement

Suryapet | సూర్యాపేట జిల్లా మునగాల మండలం పరిధిలో రెండు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో రెండు బస్సుల్లో కలిపి 63 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. రెండు బస్సులు ఢీకొనడంతో వాహనాల ముందు భాగాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో ఓ బస్సు డ్రైవర్‌ వాహనంలో ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న డ్రైవర్‌ను బయటకు తీసుకొచ్చారు.

కేవ‌లం ముగ్గురు మాత్ర‌మే గాయ‌ప‌డ‌గా.. మిగ‌తా వారంతా ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం కారణంగా కొంతసేపు అక్కడ భ‌యాన‌క వాతావ‌ర‌ణ నెల‌కొన్న‌ది. ఇదిలా ఉండ‌గా.. బస్సు ప్రమాదంపై పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్లు నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి ప్రధాన కారణమై ఉండొచ్చని గుర్తించారు. రాత్రి వేళల్లో సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల డ్రైవర్లు తగిన విశ్రాంతి తీసుకోకుండా వాహనాలు నడపడం ప్రమాదాలకు దారితీస్తోందని పోలీసులు పేర్కొంటున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, బస్సుల వేగం, డ్రైవర్ల పరిస్థితిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.

Advertisement
Advertisement