త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tirupati-Karimnagar Express | మారిన తిరుప‌తి-క‌రీంన‌గ‌ర్ ఎక్స్‌ప్రెస్ రైలు వేళ‌లు.. పెరిగిన ప్ర‌యాణ స‌మ‌యం!

Tirupati-Karimnagar Express | తిరుప‌తి-క‌రీంన‌గ‌ర్ రైలు ప్ర‌యాణికుల‌కు ముఖ్య‌గ‌మ‌నిక‌. ఇక‌పై మీరు వెళ్లే రైలు ముందుగానే స్టేష‌న్ నుంచి బ‌య‌ల్దేరుతుంది. అవును.. తిరుప‌తి నుంచి క‌రీంన‌గ‌ర్‌కు (12761) వ‌చ్చే సూప‌ర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (Tirupati-Karimnagar Express) స‌మ‌యాల్లో అధికారులు స్వ‌ల్ప‌ మార్పులు (Timings Changed) చేశారు.

G

Telangana | Published On Aug 8, 2026, 7.16 am IST

Tirupati-Karimnagar Express | మారిన తిరుప‌తి-క‌రీంన‌గ‌ర్ ఎక్స్‌ప్రెస్ రైలు వేళ‌లు.. పెరిగిన ప్ర‌యాణ స‌మ‌యం!
Advertisement

Tirupati-Karimnagar Express | త్రినేత్ర‌.న్యూస్‌: తిరుప‌తి-క‌రీంన‌గ‌ర్ రైలు ప్ర‌యాణికుల‌కు ముఖ్య‌గ‌మ‌నిక‌. ఇక‌పై మీరు వెళ్లే రైలు ముందుగానే స్టేష‌న్ నుంచి బ‌య‌ల్దేరుతుంది. అవును.. తిరుప‌తి నుంచి క‌రీంన‌గ‌ర్‌కు (12761) వ‌చ్చే సూప‌ర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (Tirupati-Karimnagar Express) స‌మ‌యాల్లో అధికారులు స్వ‌ల్ప‌ మార్పులు (Timings Changed) చేశారు. వారంలో రెండు రోజులు అంటే బుధ‌, శ‌నివారాల్లో న‌డిచే ఈ రైలు తిరుప‌తిలో ఇక‌పై రాత్రి 7.50 గంట‌ల‌కు బ‌య‌ల్దేరుతుంది. రేణిగుంట‌కు రాత్రి 8.15 గంట‌ల‌కు, శ్రీకాళ‌హ‌స్తికి రాత్రి 8.39 గంట‌ల‌కు చేరుతుంది. పాత‌ షెడ్యూల్ ప్ర‌కారం తిరుప‌తి స్టేష‌న్‌లో రాత్రి 8.05 గంట‌ల‌కు బ‌య‌ల్దేరేది. మిగిలిన స్టేష‌న్ల స‌మ‌యాల్లో ఎలాంటి మార్పులు లేవు. అక్టోబ‌ర్ 10 నుంచి మారిన స‌మ‌యాలు అమ‌ల్లోకి రానున్నాయి.

తిరుప‌తి-క‌రీంన‌గ‌ర్ మ‌ధ్య 712 కిలోమీట‌ర్ల దూరాన్ని ఈ రైలు క‌వ‌ర్ చేస్తుంది. మొత్తం ప్ర‌యాణ స‌మ‌యం దాదాపు 12.35 గంట‌లు. మార్గ‌మ‌ధ్యంలో 12 ప్ర‌ధాన స్టాపుల్లో ఇది ఆగుతుంది. వారంలో రెండు రోజులు న‌డిచే ఈ రైలు తిరుప‌తి నుంచి రేణిగుంట జంక్షన్, శ్రీకాళహస్తి, గూడూరు జంక్షన్, విజయవాడ జంక్షన్, మధిర, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, జమ్మికుంట, పెద్దపల్లి జంక్షన్ మీదుగా మ‌రుస‌టి రోజు ఉద‌యానికి క‌రీంన‌గ‌ర్ చేరుకుంటుంది.

ఇక కరీంనగర్ నుంచి తిరుపతి (నంబ‌ర్ 12762) రైలు ప్రతీ గురువారం, ఆదివారం అందుబాటులో ఉంటుంది. క‌రీంన‌గ‌ర్‌లో రాత్రి 7.15 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 8.05 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ జంక్షన్, గూడూరు జంక్షన్, శ్రీకాళహస్తి, రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు అధికారిక రైల్వే ఎంక్వైరీ మార్గాల ద్వారా తాజా రైలు సమయాలను తెలుసుకోవాలి.

Advertisement
Advertisement