త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sangareddy | ఇంద్రేశంలో భారీ అగ్నిప్ర‌మాదం..

Sangareddy | సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. స్థానికంగా ఉన్న ఓ ప్లాస్టిక్ గోదాంలో మంట‌లు చెల‌రేగాయి. క్ష‌ణాల్లోనే మంట‌లు గోదాం అంత‌టా వ్యాపించాయి.

S

Telangana | Published On Feb 11, 2026, 4.45 pm IST

Sangareddy | ఇంద్రేశంలో భారీ అగ్నిప్ర‌మాదం..
Advertisement

Sangareddy | త్రినేత్ర‌.న్యూస్ : సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. స్థానికంగా ఉన్న ఓ ప్లాస్టిక్ గోదాంలో మంట‌లు చెల‌రేగాయి. క్ష‌ణాల్లోనే మంట‌లు గోదాం అంత‌టా వ్యాపించాయి. దీంతో పెద్ద ఎత్తున మంట‌లు ఎగిసిప‌డి, ద‌ట్ట‌మైన పొగ‌లు క‌మ్ముకున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు.

స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది, పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. ఫైరింజ‌న్ల‌తో మంట‌ల‌ను అదుపు చేసేందుకు య‌త్నిస్తున్నారు. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. భారీగా ఆస్తి న‌ష్టం సంభ‌వించిన‌ప్ప‌టికీ, ప్రాణ న‌ష్టం గురించి ఎలాంటి వివ‌రాలు తెలియ‌రాలేదు.

Advertisement
Advertisement