త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | రేవంత్ రెడ్డిపై అభ్యంత‌రక‌ర పోస్టు.. త‌ప్ప‌దోవ ప‌ట్టించేలా సీఎం ఫొటో.. వ్య‌క్తిపై ఎఫ్ఐఆర్‌

Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఫొటోను మార్ఫింగ్ చేసి సోష‌ల్ మీడియాలో అభ్యంత‌ర‌క‌రంగా పోస్టు చేసిన వ్య‌క్తిపై సైబ‌ర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదుచేశారు.

G

Telangana | Published On Sep 12, 2026, 11.16 am IST

Revanth Reddy | రేవంత్ రెడ్డిపై అభ్యంత‌రక‌ర పోస్టు.. త‌ప్ప‌దోవ ప‌ట్టించేలా సీఎం ఫొటో.. వ్య‌క్తిపై ఎఫ్ఐఆర్‌
Advertisement

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఫొటోను మార్ఫింగ్ చేసి సోష‌ల్ మీడియాలో అభ్యంత‌ర‌క‌రంగా పోస్టు చేసిన వ్య‌క్తిపై సైబ‌ర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదుచేశారు. వాస్తవాలను తప్పుదోవ పట్టించేలా ముఖ్య‌మంత్రి ఫొటోను దుర్వినియోగం చేయ‌డంపై యూత్ కాంగ్రెస్ (Youth Congress) ప్ర‌ధాన కార్య‌క‌ద‌ర్శి విదుర్ చౌలా సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. రంగమ‌ళ్ల శ్రీనివాస్ అనే వ్య‌క్తి సీఎం రేవంత్‌ను కించ‌ప‌రిచేలా ఆయ‌న చ‌నిపోయిన‌ట్లుగా (శ్రద్ధాంజ‌లి పోస్ట‌ర్‌లా) ఫొటోను ఎడిచేసి (Edited Photo) ఫేస్‌బుక్‌లో పోస్టు చేశార‌ని అందులో పేర్కొన్నారు. దానిని అప్‌లోడ్ చేసిన హ్యాండిల్‌పై, అలాగే ఆ మార్ఫింగ్ చేసిన ఫోటోను సోషల్ మీడియాలో (Social Media)షేర్ చేస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.

దీంతో ఫోటోను ఉద్దేశపూర్వకంగా ఎడిట్ చేసినట్లు గుర్తించిన పోలీసులు.. నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 352 (శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 353(1)(b) (ప్రజా శాంతికి భంగం కలిగించే ప్రకటనలు చేయడం) కింద కేసు నమోదు చేశారు. ఈ పోస్ట్‌ను సెప్టెంబర్ మొదటి వారంలో అప్‌లోడ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ సోషల్ మీడియా హ్యాండిల్ వెనుక ఉన్న వ్యక్తిని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.

Advertisement
Advertisement