Ganesh Idol | గణపతి తొండం కుడివైపు ఉంటే ఏంటి? ఎడమవైపు ఉంటే ఏంటి? పూజలో ఈ తేడా ఎందుకు?
Ganesh Idol | వినాయకచవితి వచ్చిందంటే చాలు.. గణపతి విగ్రహాల కొనుగోళ్లతో మార్కెట్లు సందడిగా మారతాయి. ఇంట్లో ప్రతిష్ఠించుకునేందుకు తమకు నచ్చిన రూపంలో వినాయకుడిని తీసుకువచ్చి పూజలు చేస్తారు. అయితే గణపతి విగ్రహాన్ని ఎంచుకునే సమయంలో చాలామంది తొండం ఏ వైపు ఉందన్న విషయాన్ని కూడా గమనిస్తారు.
Devotional | Published On Sep 12, 2026, 9.56 am IST
Ganesh Idol | వినాయకచవితి వచ్చిందంటే చాలు.. గణపతి విగ్రహాల కొనుగోళ్లతో మార్కెట్లు సందడిగా మారతాయి. ఇంట్లో ప్రతిష్ఠించుకునేందుకు తమకు నచ్చిన రూపంలో వినాయకుడిని తీసుకువచ్చి పూజలు చేస్తారు. అయితే గణపతి విగ్రహాన్ని ఎంచుకునే సమయంలో చాలామంది తొండం ఏ వైపు ఉందన్న విషయాన్ని కూడా గమనిస్తారు. కొన్నింటిలో తొండం ఎడమవైపు వంగి ఉంటే.. మరికొన్ని విగ్రహాల్లో కుడివైపు తిరిగి ఉంటుంది. ఈ రెండు రూపాల మధ్య తేడా ఏంటి? ఇంటి పూజకు ఏ రూపాన్ని ఎంచుకుంటారు? కుడివైపు తొండం ఉన్న గణపతికి ప్రత్యేకత ఏంటి? అనే సందేహాలు చాలామందికి ఉంటాయి.
ఎడమ వైపు తొండం ఉన్న గణపతి..
గణపతి తొండం ఎడమవైపు తిరిగి ఉన్న విగ్రహాన్ని కొన్ని ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో వామముఖి గణపతిగా పేర్కొంటారు. ఇలాంటి రూపాన్ని చంద్రనాడికి ప్రతీకగా భావిస్తుంటారు. చంద్రుడిని చల్లదనం, ప్రశాంతతకు ప్రతీకగా భావించే నేపథ్యంలో.. ఎడమ తొండం ఉన్న గణపతిని సౌమ్య స్వరూపంగా చెబుతారు. ఇంట్లో సాధారణంగా పూజలు చేసుకునే కుటుంబాల్లో ఈ రూపానికి ఎక్కువ ప్రాధాన్యం కనిపిస్తుంది. వినాయకచవితి సందర్భంగా ఇంట్లో ప్రతిష్ఠించే విగ్రహాల్లోనూ ఎడమవైపు తొండం ఉన్న గణపతి రూపాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. గృహపూజకు ఈ రూపం అనుకూలంగా ఉంటుందని భావిస్తారు.
కుడివైపు తొండం ఉంటే?
తొండం కుడివైపు తిరిగి ఉన్న గణపతి రూపాన్ని దక్షిణవర్తి గణపతిగా పేర్కొనే సంప్రదాయం ఉంది. ఈ రూపాన్ని సూర్యనాడికి ప్రతీకగా చెబుతారు. సూర్యుడిని శక్తి, చైతన్యానికి ప్రతీకగా భావించే ఆధ్యాత్మిక విశ్వాసాల నేపథ్యంలో.. కుడివైపు తొండం ఉన్న గణపతి ఆరాధనకు ప్రత్యేకత ఉందని చెబుతారు. ఈ రూపాన్ని పూజించేటప్పుడు మరింత నియమ నిష్టలు పాటించాలని కొన్ని సంప్రదాయాలు పేర్కొంటున్నాయి. నిర్దిష్ట పూజా విధానాలను అనుసరించే ఆచారం కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతోంది.
కుడివైపు తొండం ఉన్న గణపతిని ఇంట్లో పెట్టకూడదా?
కుడివైపు తొండం ఉన్న గణపతిని ఇంట్లో ప్రతిష్ఠించకూడదనే మాట కొన్నిచోట్ల వినిపిస్తుంటుంది. అయితే, ఈ రూపాన్ని పూర్తిగా నిషేధించినట్లు కాకుండా.. ప్రత్యేక పూజా విధానాలతో ఆరాధించే గణపతి రూపంగా పేర్కొనే సంప్రదాయం ఉన్నది. అందుకే సాధారణ గృహపూజల్లో ఎడమ తొండం ఉన్న గణపతికి ప్రాధాన్యం ఇవ్వడం ఎక్కువగా కనిపిస్తుంది. కుడి తొండం ఉన్న గణపతి విగ్రహాలను ప్రత్యేక పూజా విధానాలు పాటించే సంప్రదాయాల్లో ఆరాధిస్తారు.
ఆలయాల్లో కుడివైపు తొండం ఉన్న విగ్రహాలు ఎందుకు?
కుడివైపు తొండం ఉన్న గణపతి విగ్రహాలు కొన్ని ఆలయాల్లో కనిపిస్తుంటాయి. ఇలాంటి రూపాలను ప్రత్యేక ఆరాధనా విధానాలతో పూజించే సంప్రదాయాలు ఉన్నాయి. ఆలయాల్లో నిత్యపూజలు, అభిషేకాలు, నైవేద్యాలు తదితర కార్యక్రమాలు నిర్ణీత పద్ధతుల్లో జరుగుతుంటాయి. మహారాష్ట్రలోని ముంబయి సిద్ధివినాయక ఆలయం కుడివైపు తొండం ఉన్న గణపతి రూపానికి ప్రసిద్ధి చెందిన క్షేత్రాల్లో ఒకటిగా చెబుతారు. ఇక్కడి గణపతి స్వరూపానికి ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా పూజలు నిర్వహిస్తారు.
తొండం ఏ వైపు ఉందో ఎలా గుర్తించాలి?
గణపతి తొండం ఎడమవైపా, కుడివైపా అని గుర్తించే విషయంలోనూ కొంత గందరగోళం ఉంటుంది. గణపతిని ఎదురుగా చూసినప్పుడు మన ఎడమ, కుడి వైపులను బట్టి లెక్కించడం సాధారణం. అయితే కొన్ని సంప్రదాయాల్లో గణపతి స్వరూపాన్ని ఆధారంగా చేసుకుని తొండం దిశను పరిగణిస్తారు. గణపతి విగ్రహం విషయంలో తొండం దిశతో పాటు.. విగ్రహం ఏ వైపు చూస్తోంది అన్న అంశానికీ కొన్ని సంప్రదాయాల్లో ప్రాధాన్యం ఉంది. అయితే తొండం ఎడమవైపు ఉండటం, గణపతి విగ్రహం తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండటం రెండూ ఒకే విషయం కాదు. తొండం దిశకు సంబంధించిన సంప్రదాయాలు ఒక అంశం కాగా.. విగ్రహ ప్రతిష్ఠ, దిశకు సంబంధించిన ఆచారాలు మరో అంశం. ప్రాంతీయ సంప్రదాయాలు, కుటుంబ ఆచారాలను బట్టి వీటికి సంబంధించిన పద్ధతుల్లో మార్పులు కనిపిస్తాయి.
ఎడమ-కుడి తొండం మధ్య తేడా ఇదే
సంప్రదాయాల ప్రకారం.. ఎడమవైపు తొం ఉన్న గణపతిని చంద్రనాడికి ప్రతీకగా భావిస్తూ సౌమ్య స్వరూపంగా పేర్కొంటారు. ఇంట్లో సాధారణ పూజలకు ఈ రూపాన్ని ఎక్కువగా ఉపయోగించే ఆచారం ఉంది. కుడివైపు తొండం ఉన్న గణపతిని సూర్యనాడికి ప్రతీకగా భావిస్తూ ప్రత్యేక ఆరాధనా విధానాలు, నియమ నిష్టలతో పూజించే రూపంగా పేర్కొంటారు. ఈ కారణంగానే ఇంటి పూజల్లో ఎడమ తొండం ఉన్న విగ్రహాలు ఎక్కువగా కనిపిస్తే.. కుడి తొండం ఉన్న గణపతి రూపాలను ప్రత్యేక ఆరాధనా విధానాల్లో, కొన్ని ఆలయాల్లో పూజించే ఆచారం కొనసాగుతోంది.
Read Also :
Venus Transit | నక్షత్రాన్ని మార్చుకోనున్న శుక్రుడు.. మూడురాశులవారు జాగ్రత్తగా ఉండాల్సిందే..!
Mercury Transit in Virgo | కన్యారాశిలో బుధుడి సంచారం.. భద్ర రాజయోగంతో ఈ మూడు రాశుల వారికి అదృష్టం!
Budhaditya Raja Yogam | త్వరలో బుధాదిత్య రాజయోగం.. ఈ నాలుగు రాశులకు కెరీర్, ఆర్థికంగా అన్ని అనుకూల ఫలితాలే..!
Hartalika Teej | ఒకే రోజు హర్తాళికా తీజ్ తీజ్–వినాయక చవితి.. ఈ నాలుగురాశుల వారికి అన్నీ శుభాలే..!
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Hartalika Teej | ఒకే రోజు హర్తాళికా తీజ్ తీజ్–వినాయక చవితి.. ఈ నాలుగురాశుల వారికి అన్నీ శుభాలే..!
సెప్టెంబర్ 12, 2026

Budhaditya Raja Yogam | త్వరలో బుధాదిత్య రాజయోగం.. ఈ నాలుగు రాశులకు కెరీర్, ఆర్థికంగా అన్ని అనుకూల ఫలితాలే..!
సెప్టెంబర్ 12, 2026

AI Retro Trend | వైరల్ రెట్రో ఏఐ ట్రెండ్‌తో జాగ్రత్త.. ప్రైవసీకి మాత్రం ముప్పు తప్పదు!
సెప్టెంబర్ 11, 2026
తాజావార్తలు
- ●Rain Alert | రెండు రోజులు విస్తారంగా వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
- ●Special Trains | వరుస సెలవులు.. నేడు, రేపు సికింద్రాబాద్-కాగజ్‌నగర్-హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు..
- ●Valigonda Narasimha | మేస్త్రీ పని చేస్తూనే ఓయూ డాక్టరేట్ సాధించాడు.. వలిగొండ నరసింహ సక్సెస్ స్టోరీ ఇదీ..
- ●NHRC | మంత్రి పొంగులేటికి ఎన్హెచ్ఆర్సీ షాక్.. మానస హిల్స్ అక్రమ మైనింగ్‌పై చర్యలకు ఆదేశం
- ●Hartalika Teej | ఒకే రోజు హర్తాళికా తీజ్ తీజ్–వినాయక చవితి.. ఈ నాలుగురాశుల వారికి అన్నీ శుభాలే..!
- ●Analog Paneer | పనీర్ లవర్స్‌కు బిగ్ షాక్.. రాష్ట్రంలో ఏడాదిపాటు నిషేధం.!

Rain Alert | రెండు రోజులు విస్తారంగా వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

Special Trains | వరుస సెలవులు.. నేడు, రేపు సికింద్రాబాద్-కాగజ్‌నగర్-హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు..

Valigonda Narasimha | మేస్త్రీ పని చేస్తూనే ఓయూ డాక్టరేట్ సాధించాడు.. వలిగొండ నరసింహ సక్సెస్ స్టోరీ ఇదీ..

NHRC | మంత్రి పొంగులేటికి ఎన్హెచ్ఆర్సీ షాక్.. మానస హిల్స్ అక్రమ మైనింగ్‌పై చర్యలకు ఆదేశం



