Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. పెట్టుబడులకు సమయం ఇదేనా..?
Gold And Silver Prices Today | అమెరికా, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా గత వారం రోజులూ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర నష్టాల్లో కొనసాగాయి. అయితే చివరి ట్రేడింగ్ సెషన్‌లో మాత్రం భారీ ర్యాలీ కనిపించింది. కానీ ఇది షార్ట్ కవరింగ్ అయి ఉండే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందువల్ల పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Gold And Silver Prices Today | అమెరికా, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా గత వారం రోజులూ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర నష్టాల్లో కొనసాగాయి. అయితే చివరి ట్రేడింగ్ సెషన్‌లో మాత్రం భారీ ర్యాలీ కనిపించింది. కానీ ఇది షార్ట్ కవరింగ్ అయి ఉండే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందువల్ల పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక బులియన్ మార్కెట్లలో మాత్రం పాజిటివ్ సంకేతాలు వస్తున్నాయి. యుద్ధం సమయం కావడంతో ఈ సేఫ్ హావెన్ ఆస్తుల వైపు సహజంగానే పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. కానీ మార్కెట్లు అస్థిరతతో ఉన్నందున పెట్టుబడులు పెట్టే ముందు ఆచితూచి వ్యవహరించాలని సూచిస్తున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లలో క్రితం సెషన్ ముగింపులో బంగారం ధర ఔన్స్‌కు 0.73 శాతం పెరిగి 4,348 డాలర్ల వద్ద ముగిసింది. వెండి ధర 1.45 శాతం ఎగబాకి 64 డాలర్ల వద్ద స్థిరపడింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 443 పాయింట్లు పెరిగి 1,52,784 వద్ద స్థిరపడగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 875 పాయింట్లు పెరిగి 2,34,974 వద్ద ముగిసింది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరగ్గా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,458 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,23, 664 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,54,580 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,45,800 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.1,600 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,170 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,13,360గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,41,700 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,17,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.1500 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,594 ఉండగా, 8 గ్రాముల ధర రూ.92,752గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,15,940 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,59,400గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.1200 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,45,000 ఉండగా, తులం ధర రూ.2,450గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,50,000 ఉండగా, తులం ధర రూ.2,500 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | యుద్దం ఎఫెక్ట్.. ఒక్క రోజులోనే రూ.26వేలకు పైగా తగ్గిన పసిడి ధర..
సెప్టెంబర్ 11, 2026

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.12వేలు పెరిగిన బంగారం ధర.. మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి..
సెప్టెంబర్ 10, 2026

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.10వేలు తగ్గిన బంగారం ధర.. బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
సెప్టెంబర్ 9, 2026
తాజావార్తలు
- ●Anthropic | అతి పెద్ద ఐపీఓకు సిద్ధమవుతున్న ఆంథ్రోపిక్.. ఆఫర్ విలువ 100 బిలియన్ డాలర్లు..
- ●Brahmotsavalu 2026 | తిరుమలలో ఏడాదికి పది బ్రహ్మోత్సవాలు.. ఇప్పుడు ఒక్కసారే ఎందుకు?
- ●Harish Rawat | ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు షాక్.. పదవుల నుంచి తప్పుకున్న మాజీ సీఎం
- ●Ganesh Idol | గణపతి తొండం కుడివైపు ఉంటే ఏంటి? ఎడమవైపు ఉంటే ఏంటి? పూజలో ఈ తేడా ఎందుకు?
- ●Rain Alert | రెండు రోజులు విస్తారంగా వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
- ●Special Trains | వరుస సెలవులు.. నేడు, రేపు సికింద్రాబాద్-కాగజ్‌నగర్-హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు..

Anthropic | అతి పెద్ద ఐపీఓకు సిద్ధమవుతున్న ఆంథ్రోపిక్.. ఆఫర్ విలువ 100 బిలియన్ డాలర్లు..

Brahmotsavalu 2026 | తిరుమలలో ఏడాదికి పది బ్రహ్మోత్సవాలు.. ఇప్పుడు ఒక్కసారే ఎందుకు?

Harish Rawat | ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు షాక్.. పదవుల నుంచి తప్పుకున్న మాజీ సీఎం

Ganesh Idol | గణపతి తొండం కుడివైపు ఉంటే ఏంటి? ఎడమవైపు ఉంటే ఏంటి? పూజలో ఈ తేడా ఎందుకు?



