Gongidi Sunitha | ఇళ్లల్లో అక్కాచెల్లెళ్లు, అమ్మల ముందు బనియన్లు వేసుకోరా?
Gongidi Sunitha | ఎమ్మెల్యేలు బనియన్లతో ఉంటే మహిళా కానిస్టేబుళ్లకు వచ్చిన ఇబ్బందేంటని.. ఇళ్లల్లో అక్కాచెల్లెళ్లు, అమ్మల ముందు నాన్న, అన్నదమ్ములు బనియన్లు వేసుకోరా అని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత వ్యాఖ్యానించారు.
- మా ఎమ్మెల్యేలు బనియన్లతో ఉంటే మహిళా కానిస్టేబుళ్లకు వచ్చిన ఇబ్బంది ఏంది?
- తోపులాటలు జరిగితే లైంగిక వేధింపుల కేసు ఎలా పెడతారు?
- మీడియాతో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత వ్యాఖ్యలు
Gongidi Sunitha | త్రినేత్ర.న్యూస్: ఎమ్మెల్యేలు బనియన్లతో ఉంటే మహిళా కానిస్టేబుళ్లకు వచ్చిన ఇబ్బందేంటని.. ఇళ్లల్లో అక్కాచెల్లెళ్లు, అమ్మల ముందు నాన్న, అన్నదమ్ములు బనియన్లు వేసుకోరా అని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత వ్యాఖ్యానించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. తోపులాటలు జరిగితే లైంగిక వేధింపులంటారా? అని ఫైరయ్యారు. ఎమ్మెల్యేలపై కేసు పెట్టిన కానిస్టేబుల్‌ను స్పీకర్ సన్మానించడం కాంగ్రెస్ దురుద్దేశాన్ని సూచిస్తోందన్నారు.
శాసన సభ సమావేశాలు ప్రారంభం రోజున మా పార్టీ ఎమ్మెల్యేలు నల్ల టీ షర్టులు ధరించి వచ్చారు. మా ఎమ్మెల్యేలను గేటు నెంబర్ 3 దగ్గర మహిళా కానిస్టేబుళ్లు అడ్డుకున్నారు. మహిళా ఎమ్మెల్యేలను అడ్డుకునేందుకు మగ పోలీసులను పెట్టారు. ఇలాంటి పద్ధతి స్పీకర్ ఆదేశంతో జరిగిందా.. డీజీపీ ఆదేశంతో జరిగిందా? దుశ్శాసనుడు రేవంత్ ఆదేశంతో జరిగిందా? మహిళా ఎమ్మెల్యేలను రకరకాలుగా హింసించారు. మహాభారతంలో ద్రౌపదికి జరిగిన అవమానం అసెంబ్లీ ఆవరణలో మహిళా ఎమ్మెల్యేలకు జరిగింది.
నాడు కౌరవుల అంతం జరిగినట్టే కాంగ్రెస్ అంతం జరుగుతుంది. స్పీకర్ దళితుడు అనే విషయం 80 శాతం మందికి తెలియదు. కాంగ్రెస్ కావాలనే దళిత కార్డు వాడింది. కాంగ్రెస్ నేతలే తప్పు చేసి మా వాళ్ల మీద ఉల్టా కేసులు పెట్టారు. మహిళా కానిస్టేబుల్‌తో కావాలనే మా నేతలపై కేసులు పెట్టించారు. తోపులాటలు జరిగితే లైంగిక వేధింపులంటారా?
కేసు పెట్టిన కానిస్టేబుల్‌ను స్పీకర్ సన్మానించిండు..
మహిళా కానిస్టేబుళ్లు దారికి అడ్డంగా ఉండొద్దని మా ఎమ్మెల్యేలు పదే పదే విజ్ఞప్తి చేశారు. కేసు పెట్టిన కానిస్టేబుల్‌ను స్పీకర్ సన్మానించడం కాంగ్రెస్ దురుద్దేశాన్ని సూచిస్తోంది. కేసు పెట్టిన పద్మావతిని అనవసరంగా వేధిస్తున్నది కాంగ్రెస్ నేతలే. ఆమెతో అబద్దాలు చెప్పించారు. శిఖండి అనే పదం వాడితే తప్పేముంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన చర్యలు ఉంటాయని అనడం కూడా సర్వ సాధారణమే.
ప్రభుత్వ తీరు చూస్తుంటే దుర్యోధన, దుశ్శాసన పర్వంలో అని ఒక సినిమా పాట గుర్తొస్తుంది. ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా బీ ఆర్ ఎస్ పోరాటాన్ని ఆపదు. హోం మంత్రిగా రేవంత్ రెడ్డి పోక్సో కేసుల నిందితులకు రక్షణ కల్పిస్తారు. ఎమ్మెల్యేల మీద మాత్రం లైంగిక వేధింపుల కేసు పెడతారు. రేవంత్ తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారు.
మహిళా ఎమ్మెల్యేలు నల్ల టీ షర్టులు వేసుకోలేగా మరి? తుల ఉమ, జడ్పీ మాజీ చైర్‌పర్సన్
మా మహిళా ఎమ్మెల్యేలు నల్ల టీ షర్టులు వేసుకోలేదు కదా.. వారిని అసెంబ్లీ లోపలికి ఎందుకు అనుమతించలేదు? రేవంత్ రెడ్డి నల్ల షర్ట్ వేసుకుని ఎంపీగా పార్లమెంటు వెళ్లలేదా? నల్ల చీరలు కట్టుకుంటే మహిళలు అసెంబ్లీకి రావద్దా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గొంతెత్తుతారనే ఉద్దేశంతో రేవంత్ వారిని బయటకు పంపారు. ఓ పద్ధతి ప్రకారమే ఇదంతా చేశారు. మా ఎమ్మెల్యేలపై అడ్డమైన కేసులు పెట్టారు. కేసులకు భయపడం. కేసులు, అరెస్టులు మాకు కొత్త కాదు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాటిని తిప్పి కొడతాం. తెలంగాణ ఉద్యమంలో ఇంతకన్నా ఎక్కువే చూశాం.
ఆందోళనలు చేస్తే లైంగిక వేధింపులంటరా?: సుమిత్రానంద్, టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు
అసెంబ్లీకి ఎమ్మెల్యేలు పోకుండా మహిళా కానిస్టేబుళ్లు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన వారి సొంతానికి కాదు.. రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం. ఆందోళనలు చేస్తే లైంగిక వేధింపులు అంటారా? ఇంత కన్నా దుర్మార్గం ఉంటుందా? పది సెక్షన్లు పెడతారా? ప్రభుత్వం పరువు తీసుకుంటోంది. మహిళా ఎమ్మెల్యేలను కంటతడి పెట్టించారు. రేవంత్ అంత నీచరాజకీయాలు గతంలో ఎవ్వరూ చేయలేదు. ఆ స్థాయికి దిగజారడం సిగ్గుచేటు. పోక్సో నిందితులకు రక్షణ కల్పిస్తారు. బాధ్యత గల ఎమ్మెల్యేలపై కేసులు పెడతారా?
తాజావార్తలు
- ●Mercury Transit in Virgo | కన్యారాశిలో బుధుడి సంచారం.. భద్ర రాజయోగంతో ఈ మూడు రాశుల వారికి అదృష్టం!
- ●IRCTC | ఒక్కరోజే 20 లక్షల టికెట్లు.. IRCTC చరిత్రలోనే రికార్డు బుకింగ్స్
- ●UPI Charges | మళ్లీ తెరపైకి యూపీఐ ఛార్జీలు..? బ్యాంకులకే భారీ వాటా..?
- ●Ramachander Rao | మోదీ ప్రజా సేవ ప్రస్థానానికి 25 ఏళ్లు..
- ●Trump’s New H-1B Rule | ఉద్యోగం పోతే ఇంటికే.. ట్రంప్ సర్కార్ కొత్త ప్రతిపాదన.. ఆందోళనలో టెకీలు
- ●Bank Staff | బ్యాంకు సిబ్బంది కళ్లలో కారం చల్లి.. నగదుతో ఉడాయించిన వ్యక్తి

Mercury Transit in Virgo | కన్యారాశిలో బుధుడి సంచారం.. భద్ర రాజయోగంతో ఈ మూడు రాశుల వారికి అదృష్టం!

IRCTC | ఒక్కరోజే 20 లక్షల టికెట్లు.. IRCTC చరిత్రలోనే రికార్డు బుకింగ్స్

UPI Charges | మళ్లీ తెరపైకి యూపీఐ ఛార్జీలు..? బ్యాంకులకే భారీ వాటా..?

Ramachander Rao | మోదీ ప్రజా సేవ ప్రస్థానానికి 25 ఏళ్లు..






