త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Family Certificate | అందుబాటులోకి ‘ఫ్యామిలీ సర్టిఫికెట్’.. ఎక్క‌డ పొందాలో తెలుసా..?

Family Certificate | రాష్ట్రంలో ఉన్న పౌరులు, వారి కుటుంబ సభ్యుల వివరాలు ఏ సంస్థ, ఏ వ్యవస్థ అడిగినా అందివ్వటానికి ఉపయోగపడేవిధంగా ఇందిర‌మ్మ ప్రజాప్ర‌భుత్వం ఈ 'ఫ్యామిలీ సర్టిఫికెట్‌'( Family Certificate ) ని అందిస్తోంద‌ని డిప్యూటీ సీఎం భట్టి విక్ర‌మార్క స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Jul 31, 2026, 8.06 pm IST

Family Certificate | అందుబాటులోకి ‘ఫ్యామిలీ సర్టిఫికెట్’.. ఎక్క‌డ పొందాలో తెలుసా..?
Advertisement
  • తహశీల్దార్, మీ సేవా కేంద్రాల్లో పొందొచ్చు 
  • డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌

Family Certificate | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో ఉన్న పౌరులు, వారి కుటుంబ సభ్యుల వివరాలు ఏ సంస్థ, ఏ వ్యవస్థ అడిగినా అందివ్వటానికి ఉపయోగపడేవిధంగా ఇందిర‌మ్మ ప్రజాప్ర‌భుత్వం ఈ 'ఫ్యామిలీ సర్టిఫికెట్‌'( Family Certificate ) ని అందిస్తోంద‌ని డిప్యూటీ సీఎం భట్టి విక్ర‌మార్క స్ప‌ష్టం చేశారు. శుక్ర‌వారం మ‌హాత్మా జ్యోతిరావు ఫూలే ప్ర‌జాభ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన స‌ర్‌ అవ‌గాహ‌న స‌ద‌స్సులో ఆయ‌న మ‌ట్లాడారు. ఈ కార్య‌క్ర‌మంలో ర‌వాణా శాఖా మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌, తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ ఇనిస్టిట్యూష‌న్స్ సొసైటీ వైస్ ఛైర్మ‌న్ ఫ‌హీమ్ ఖురేషి త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా భ‌ట్టి విక్ర‌మార్క‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రేషన్ కార్డు పొందుతూ త‌ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసే సరుకులు, ఆరోగ్యశ్రీ, స‌న్న‌బియ్యం ఇతరత్రా పథకాలను రాష్ట్ర ప్ర‌జ‌లు పొందుతున్నారు. ఇలా ప్ర‌భుత్వ ప‌థ‌కాన‌లు పొందుతూ.. రాష్ట్ర కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి వివరాలకు సంబంధించిన సమాచారాన్ని తహశీల్దార్ కార్యాల‌యంలో రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచింది.

ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ కుటుంబమైనా వారికి సంబంధించిన సమాచారం, కుటుంబ సభ్యుల సమాచారం కావాలనుకుంటే తహశీల్దార్ ఆఫీస్, మీసేవ కేంద్రానికి వెళ్లి ఈ 'ఫ్యామిలీ సర్టిఫికెట్' పొందవచ్చని ఆయ‌న చెప్పారు. దీనివల్ల ఎవరైనా ఈ రాష్ట్రంలో ఏ వ్యవస్థలైనా, ఏ సంస్థలైనా మీ కుటుంబ వివరాలకు సంబంధించి ఎవరైనా అడిగితే ఆ వ్యవస్థలకు, ప్రభుత్వ సంస్థలకు, ఈ సమాచారం ఇవ్వటానికి ఉపయోగకరంగా ఉంటుందని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క చెప్పారు.

Advertisement
Advertisement