త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Megha Reddy | చిన్నారెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించండి… ఖర్గేకు మేఘారెడ్డి ఫిర్యాదు

MLA Megha Reddy | రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి వివాదం ఢిల్లీకి చేరింది. చిన్నారెడ్డిని పార్టీ నుంచి బ‌హింష్క‌రించాల‌ని కోరుతూ ఏఐసీసీ అధ్యక్షుడు మ‌ల్లిఖార్జున‌ ఖర్గేకు మేఘారెడ్డి శుక్ర‌వారం ఫిర్యాదు చేశారు.

S

Telangana | Published On Aug 21, 2026, 3.41 pm IST

MLA Megha Reddy | చిన్నారెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించండి… ఖర్గేకు మేఘారెడ్డి ఫిర్యాదు
Advertisement

MLA Megha Reddy | త్రినేత్ర‌.న్యూస్: రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి వివాదం ఢిల్లీకి చేరింది. చిన్నారెడ్డిని పార్టీ నుంచి బ‌హింష్క‌రించాల‌ని కోరుతూ ఏఐసీసీ అధ్యక్షుడు మ‌ల్లిఖార్జున‌ ఖర్గేకు మేఘారెడ్డి శుక్ర‌వారం ఫిర్యాదు చేశారు. రాజాజి మార్గ్‌లో ఉన్న ఖ‌ర్గే నివాసంలో ఆయ‌న్ను క‌లిసి ఇటీవ‌ల త‌నపై చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ను వివ‌రించారు. ఈమేర‌కు తన అనుచ‌రుల‌తో కలిసి మేఘారెడ్డి ఢిల్లీ వెళ్లారు. గ‌త కొన్ని రోజులుగా పార్టీ లైను దాటి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారి వ్యవహార శైలిని కూడా ఖర్గే దృష్టికి తీసుకు వెళ్లిన‌ట్లు స‌మాచారం.

ఇదిలా ఉండ‌గా చిన్నారెడ్డిపై గ‌త మంగ‌ళ‌వారం మేఘారెడ్డి గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను క‌లిసి ఫిర్యాదు చేసిన విష‌యం విదిత‌మే. త‌న‌ అనుచరులతో కలిసి గాంధీభవన్‌కు వచ్చిన మేఘారెడ్డి.. చిన్నారెడ్డికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. కల్వకుర్తిలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ మల్లు రవిని కలిసి స‌మ‌స్య‌ను విన్న‌వించారు.

గ‌త ఎన్నిక‌ల్లో త‌న‌కు టికెట్ రాక‌పోవ‌డానికి డ‌బ్బు కార‌ణమ‌ని చిన్నారెడ్డి ఆరోపించారు. సొంత పార్టీకే చెందిన ప్ర‌స్తుత వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి డబ్బులతో ఎమ్మెల్యే టికెట్‌ తెచ్చుకున్నాడ‌ని, నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను అవినీతి పార్టీగా మార్చార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తన పనులకు అడ్డుపడుతూ, తన కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు. తనకు ఓపిక నశిస్తే మరో జీవన్‌రెడ్డిలా (Jeevan Reddy) మారి తిరగబడతానని హెచ్చరించారు. వనపర్తి జిల్లా గోపాల్‌పేటలో కాంగ్రెస్‌ పార్టీ మండల కార్యాలయం ప్రారంభోత్సవ సంద‌ర్భంగా చిన్నారెడ్డి ఈ వ్యాఖ్య‌లు చేశారు.

Advertisement
Advertisement