KTR | కాంగ్రెస్ బీజేపీ అపవిత్ర పొత్తు అధికారికమై నేటికి రెండేండ్లు: కేటీఆర్
KTR | రాష్ట్రంలో కాంగ్రెస్-బీజేపీ (Congress BJP) మధ్య అపవిత్ర పొత్తు అధికారికమై నేటికి సరిగ్గా రెండేండ్లు పూర్తయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. 2024, సెప్టెంబర్ 27న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి (Pongulet Srinivas Reddy) సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) 16 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.
KTR | త్రినేత్ర న్యూస్: రాష్ట్రంలో కాంగ్రెస్-బీజేపీ (Congress BJP) మధ్య అపవిత్ర పొత్తు అధికారికమై నేటికి సరిగ్గా రెండేండ్లు పూర్తయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. 2024, సెప్టెంబర్ 27న కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి (Pongulet Srinivas Reddy) సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) 16 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో ఆయన నివాసానికి పలు నగదు లెక్కింపు యంత్రాలను (Cash Counting Machines) తరలించినట్లు వచ్చిన వార్తలు అప్పట్లో ముఖ్యాంశాలుగా నిలిచాయి.
అయితే సోదాలు జరిగిన తర్వాత ఇప్పటివరకు ఈడీగానీ, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంగానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అక్కడ సోదాల్లో ఏం స్వాధీనం చేసుకున్నారో కూడా వెల్లడించలేదు. ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించే బీజేపీ ప్రభుత్వం.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మంత్రి (Congress Minister) విషయంలో మాత్రం ఎందుకు నిశ్శబ్దం పాటిస్తున్నది? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మంత్రికి బీజేపీ నుంచి ఇలాంటి మినహాయింపు ఎందుకు లభిస్తున్నదని నిలదీశారు. కాంగ్రెస్-బీజేపీ మధ్య సంబంధాన్ని ఉద్దేశిస్తూ ‘అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ’ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని (Rahul Gandhi) ట్యాగ్ చేశారు.
Exactly two years since the Congress-BJP unholy nexus became official in Telangana
The Enforcement Directorate conducted raids at 16 locations linked to Congress minister Pongulet Srinivas Reddy in connection with a money-laundering case on 27th Sept, 2024
Reports of several… pic.twitter.com/Ss2eIguoP6
— KTR (@KTRBRS) September 27, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Priyadarshi | కృతజ్ఞుడిని రామన్న.. నా సినిమాల పట్ల సూపెట్టిన ప్రేమకు హృదయపూర్వక: ప్రియదర్శి ధన్యవాదాలు
సెప్టెంబర్ 27, 2026

KTR | అస్థిత్వం కోసం ఆరాటం.. అణిచివేత పై పోరాటం.. నాని ‘ది ప్యారడైజ్’పై కేటీఆర్ రివ్యూ..
సెప్టెంబర్ 27, 2026

Night Traffic | ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో రాత్రిపూట వాహనాలకు నో ఎంట్రీ..!
సెప్టెంబర్ 26, 2026
తాజావార్తలు
- ●Priyadarshi | కృతజ్ఞుడిని రామన్న.. నా సినిమాల పట్ల సూపెట్టిన ప్రేమకు హృదయపూర్వక: ప్రియదర్శి ధన్యవాదాలు
- ●Karimnagar | చనిపోయాడనుకున్న వ్యక్తి లేచి కూర్చుకున్నాడు..
- ●Kavitha | జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంతుకమ్మ వేడుకలు: కవిత
- ●Short Circuit | పేలిన ప్రిజ్.. కాలి బూడిదైన రూ.20 లక్షల నగదు
- ●Border Trade | టిబెట్‌లో భారీగా హిమపాతం.. భారత్-చైనా సరిహద్దుల్లో నిలిచిన వాణిజ్యం
- ●Tyre Burst | హైవేపై కారు టైర్ పంచర్.. ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రాణాపాయం.. వీడియో

Priyadarshi | కృతజ్ఞుడిని రామన్న.. నా సినిమాల పట్ల సూపెట్టిన ప్రేమకు హృదయపూర్వక: ప్రియదర్శి ధన్యవాదాలు

Karimnagar | చనిపోయాడనుకున్న వ్యక్తి లేచి కూర్చుకున్నాడు..

Kavitha | జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంతుకమ్మ వేడుకలు: కవిత

Short Circuit | పేలిన ప్రిజ్.. కాలి బూడిదైన రూ.20 లక్షల నగదు



