Prof Nageshwar | అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు : మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్
Prof Nageshwar | తాను ఎక్కడా కూడా కులం ప్రస్తావన తేలేదని, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు అని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ తేల్చిచెప్పారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడారు.
Prof Nageshwar | త్రినేత్ర.న్యూస్ : తాను ఎక్కడా కూడా కులం ప్రస్తావన తేలేదని, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు అని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ తేల్చిచెప్పారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడారు.
30 ఏళ్ల వయస్సులోనే భయపడలేదు.. 62 ఏళ్ల వయస్సులో అరెస్ట్‌లకు భయపడుతానా? భయపడే ప్రసక్తే లేదు. మీకు నిజాలు కూడా చెప్పాలి. కొంతమంది మీడియా వ్యక్తులు మిస్ లీడ్ చేసినట్టు ఉన్నారు. నన్ను అరెస్టు చేసేందుకు ఇప్పటి వరకు ఎవరూ రాలేదు. రారని నేను చెప్పను.. కానీ ఇప్పటి వరకు రాలేదు. హైదరాబాద్‌కు వచ్చారేమో కానీ మా ఇంటికి రాలేదు. ప్రొటెక్షన్ కోసం తెలంగాణ పోలీసులు వస్తే.. ఆంధ్రా పోలీసులని చెప్పి మీడియాలో రాశారు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి టోలీచౌకీ సీఐ అని నాగేశ్వర్ తెలిపారు.
ప్రభుత్వమే నేరుగా కేసులు పెట్టింది. కులం, ప్రాంతాల మధ్య చిచ్చు, గొడవలు రేపుతున్నానని నా మీద కేసులు పెట్టారు. కానీ నా మాటల్లో ఎక్కడా కూడా కులం ప్రస్తావన లేదు. వాళ్లే కులం, ప్రాంతం గురించి మాట్లాడారు తప్ప.. నా నుంచి ఆ మాటలే రాలేదు. తెలంగాణ వాడివి.. ఏపీ రాజకీయాల గురించి ఎట్ల మాట్లాడుతావు అని ఆ రెండు పార్టీలే అన్నాయి. ఇరాన్‌పై మాట్లాడుతున్నాను.. ఇరాన్ ఓటరునా నేను. ఇదెక్కడి సిద్ధాంతం. మీరయితే ఇక్కడ ఇండ్లు, ఆస్తులు కలిగి ఉంటారు. తెలంగాణలో పుట్టాను కనుక.. తెలంగాణ గురించి మాట్లాడొద్దు అంటే ఎట్ల..? కులం, ప్రాంతం తీసింది మీరు. మళ్లీ మమ్మల్ని కులం ప్రాంతం తీశారని అంటున్నారు. ఎంత ఆశ్చర్యమో చూడండి. కులం చిచ్చు పెట్టాడని కేసు పెట్టారు. నేను కులం ప్రస్తావనే తీయలేదు. అల్లర్లు రేపుతున్నానని కేసు పెట్టారు.. నా వల్ల రెండు ఈగలు కూడా గొడవపడలేదు అని ప్రొఫెసర్ నాగేశ్వర్ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Digitel Service | డిజిటల్ గవర్నెన్స్‌పై ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సీఎస్ చర్చ
ఆగస్టు 3, 2026

Telangana Urban Development | తెలంగాణ పట్టణ సంస్కరణలపై నేపాల్ ప్రతినిధుల అధ్యయనం
ఆగస్టు 3, 2026

SIR | ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి
ఆగస్టు 3, 2026
తాజావార్తలు
- ●Noida 15-year-old Girl Case | మోదీపై కామెంట్స్.. క్షమాపణ చెప్పినా ఆగని వేధింపులు: రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసిన తల్లీకూతుళ్లు
- ●Indian Passport Visa-Free Countries 2026 | భారత పాస్‌పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ వెళ్లగలిగే 27 దేశాలు ఇవే!
- ●BRAOU MBA Admission 2026 | అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో ఎంబీఏ చేయాలనుకుంటున్నారా? దరఖాస్తుకు మరో రెండు రోజులే గడువు!
- ●Digitel Service | డిజిటల్ గవర్నెన్స్‌పై ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సీఎస్ చర్చ
- ●Harish Rao | కాంగ్రెస్ నేతలు హరీశ్‌రావు లీగల్ నోటీసులు.. ఆలయానికి వెళ్తే క్షుద్రపూజలు చేశారని ఆగ్రహం..!
- ●Telangana Police Insurance | విధి నిర్వహణలో కానిస్టేబుల్ మృతి.. బాధిత కుటుంబానికి కోటి బీమా చెక్ అందజేసిన డీజీపీ

Noida 15-year-old Girl Case | మోదీపై కామెంట్స్.. క్షమాపణ చెప్పినా ఆగని వేధింపులు: రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసిన తల్లీకూతుళ్లు

Indian Passport Visa-Free Countries 2026 | భారత పాస్‌పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ వెళ్లగలిగే 27 దేశాలు ఇవే!

BRAOU MBA Admission 2026 | అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో ఎంబీఏ చేయాలనుకుంటున్నారా? దరఖాస్తుకు మరో రెండు రోజులే గడువు!

Digitel Service | డిజిటల్ గవర్నెన్స్‌పై ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సీఎస్ చర్చ



