Kavitha | కాన్షీరామ్‌కు భారతరత్న ఇవ్వాల్సిందే
Kavitha | అణగారిన వర్గాల కోసం తన జీవితాన్ని ధారపోసిన స్ఫూర్తి ప్రదాత, అంబేడ్కర్ ఆశయాలను ఆచరణలో చూపిన మహనీయులు మాన్యవర్ కాన్షీరామ్ (Kanshi Ram)కు భారత రత్న ఇవ్వాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
- అణగారిన వర్గాలను అసెంబ్లీలో కూర్చోబెడతాం
- ఆయన స్ఫూర్తితో సామాజిక న్యాయ తెలంగాణ సాధిస్తాం
- కాన్షీరామ్ వర్ధంతి కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
Kavitha | త్రినేత్ర న్యూస్: అణగారిన వర్గాల కోసం తన జీవితాన్ని ధారపోసిన స్ఫూర్తి ప్రదాత, అంబేడ్కర్ ఆశయాలను ఆచరణలో చూపిన మహనీయులు మాన్యవర్ కాన్షీరామ్ (Kanshi Ram)కు భారత రత్న ఇవ్వాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాన్షీరాం స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాలను అసెంబ్లీలోకి తీసుకెళ్లి చూపిస్తామన్నారు. సామాజిక న్యాయ సంకల్పానికి టీఆర్ఎస్ (TRS) సైనికులు కంకణబద్ధులై ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. శుక్రవారం కాన్షీరామ్‌కు వర్ధంతిని పురస్కరించుకొని బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటం వద్ద ఘన నివాళులర్పించారు.
అణగారిన వర్గాలకు అధికారం కావాలన్న అంబేడ్కర్ గారి ఆశయాలను ఆచరణాత్మకంగా చూపిన వ్యక్తి కాన్షీరాం. కాన్షీరామ్‌కు స్ఫూర్తితోనే సామాజిక న్యాయ సంకల్పం తీసుకున్నాం. అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వడం కోసం తెలంగాణ రక్షణ సేన పని చేస్తుంది. తెలంగాణ ప్రజలకు ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాం. అణగారిన వర్గాలను అసెంబ్లీలోకి తీసుకెళ్లి చూపిస్తాం. అసెంబ్లీ డోర్లు తాకి అందులో కూర్చోవడమే. ఇదే కాన్షీరాంకు ఘనమైన నివాళి అవుతుంది. సామాజిక న్యాయ సంకల్పానికి బద్ధులై ఉండాలని టీఆర్ఎస్ సైనికులను కోరుతున్నా అని కవిత పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Horoscope | అక్టోబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్
- ●Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!
- ●OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ

Horoscope | అక్టోబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!

Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?

CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి

KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్





