Bigala Ganesh Gupta | ఆర్యవైశ్య భవనానికి స్థలం కేటాయించింది కేసీఆరే
Bigala Ganesh Gupta | నేడు శంకుస్థాపన చేసుకున్న ఆర్య వైశ్య ఆత్మగౌరవ భవనానికి నాటి సీఎం కేసీఆర్ ఐదు ఎకరాల స్థలం కేటాయించారని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుర్తు చేశారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి నుంచి సహాయం కోరామని, సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.
ఆనాడు ఐదు ఎకరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించింది
సీఎం రేవంత్ కూడా మరింత సహకారం అందిస్తామన్నారు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా
Bigala Ganesh Gupta | త్రినేత్ర.న్యూస్ : నేడు శంకుస్థాపన చేసుకున్న ఆర్య వైశ్య ఆత్మగౌరవ భవనానికి నాటి సీఎం కేసీఆర్ ఐదు ఎకరాల స్థలం కేటాయించారని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుర్తు చేశారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి నుంచి సహాయం కోరామని, సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన సందర్భంగా గణేశ్ గుప్తా ప్రసంగించారు.
పేద ఆర్యవైశ్యుల అభ్యున్నతి కోసం భవన నిర్మాణానికి శంకుస్థాపన కోసం రావాలని 15 రోజుల క్రితం సీఎం వద్దకు వెళ్తే సమయం ఇచ్చారు. వైశ్యులకు ఎవరైనా సహకారం చేస్తే వారికి ధన్యవాదాలు చెప్పడం, కీర్తించడం మనకున్న అలవాటు. ఈ ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించిన ఆనాటి సీఎం కేసీఆర్‌కు కూడా ధన్యవాదాలు. వాస్తవానికి మనకు ముందుగా కేటాయించిన ఐదు ఎకరాల భూమి.. మూసీ శుద్ధి కోసం ఏర్పాటు చేసిన ఎస్టీపీల వద్ద ఉండే. ఆ విషయం ప్రభుత్వ పెద్దలకు తెలియదు. మేం ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తే.. ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. దాంతో ఈ ఐదు ఎకరాల బిట్‌ను కేటాయించారు. స్థల మార్పిడి జరిగింది. కార్యక్రమం ముందుకు పోతన్నందుకు సంతోషంగా ఉంది. వైశ్యులు అనగానే అందరికీ ధనవంతులు అని ఫీలింగ్ ఉంటది.. కానీ పేదలు కూడా ఉంటారు. మరి నాటి ప్రభుత్వం 5 ఎకరాలు ఇచ్చింది.. మీరు ఇచ్చే స్థితిలో ఉన్నారు.. మీ నుంచి కూడా సహాయం కావాలంటే సానుకూలంగా స్పందించారు. తప్పకుండా పేద ఆర్య వైశ్యుల కోసం సహాయ సహకరాలు అందించాలని కోరుతున్నాం అని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Ponnam Sathaiah Awards | ఉమ్మడి కుటుంబ విలువలు కాపాడడం గొప్ప విషయం
- ●Gaddar Awards | వచ్చే ఏడాది కేటీఆర్, హరీశ్‌రావుకు గద్దర్ అవార్డులు
- ●Sreeleela | బాలకృష్ణ తనయుడితో రొమాన్స్ - తెలుగులో శ్రీలీలకు క్రేజీ ఛాన్స్
- ●Ponnam Sathaiah Awards | కుటుంబ సభ్యులందరి ఆప్యాయతలతోనే అవార్డులు ఇస్తున్నాం
- ●Transgenders extortion Hyderabad BMW | లగ్జరీ కారు కొన్న పాపానికి రూ.2 లక్షలు ఇవ్వాలా? హైదరాబాద్‌లో BMW డెలివరీ వేళ ట్రాన్స్జెండర్ల బెదిరింపులు
- ●Konda Murali | ఢిల్లీకి రామ్మ అంటే గూడా సురేఖమ్మ పోతలేదు

Ponnam Sathaiah Awards | ఉమ్మడి కుటుంబ విలువలు కాపాడడం గొప్ప విషయం

Gaddar Awards | వచ్చే ఏడాది కేటీఆర్, హరీశ్‌రావుకు గద్దర్ అవార్డులు

Sreeleela | బాలకృష్ణ తనయుడితో రొమాన్స్ - తెలుగులో శ్రీలీలకు క్రేజీ ఛాన్స్

Ponnam Sathaiah Awards | కుటుంబ సభ్యులందరి ఆప్యాయతలతోనే అవార్డులు ఇస్తున్నాం






