CM Revanth Reddy | రోశయ్య దూర దృష్టి వల్లే తెలంగాణకు మిగులు బడ్డెట్
CM Revanth Reddy | మాజీ ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలు గల్లాపెట్టె నిర్వహణ బాధ్యతను ఆర్యవైశ్యులకే ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. జూన్ 2, 2014న తెలంగాణ ఏర్పాటు సమయంలో రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో తెలంగాణ ఏర్పడిందంటే కారణం ఆనాటి ఆర్థిక మంత్రి రోశయ్యనే అని పేర్కొంటూ ఆయనపై సీఎం రేవంత్ ప్రశంసల వర్షం కురిపించారు.
హైదరాబాద్ నడిబొడ్డున రోశయ్య విగ్రహం ఏర్పాటు చేశాం
రాజకీయంగా నన్ను గుర్తించింది రోశయ్యనే
కలిసి ఉంటేనే మీకు బలం
రాజకీయంగా మీ వాటా మీరు తీసుకోవాలి
నేనేప్పుడూ ఆర్యవైశ్యుల శ్రేయోభిలాషినే
ఉప్పల్‌లో ఆర్యవైశ్య భవనానికి సీఎం రేవంత్ శంకుస్థాపన
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : మాజీ ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలు గల్లాపెట్టె నిర్వహణ బాధ్యతను ఆర్యవైశ్యులకే ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. జూన్ 2, 2014న తెలంగాణ ఏర్పాటు సమయంలో రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో తెలంగాణ ఏర్పడిందంటే కారణం ఆనాటి ఆర్థిక మంత్రి రోశయ్యనే అని పేర్కొంటూ ఆయనపై సీఎం రేవంత్ ప్రశంసల వర్షం కురిపించారు. రోశయ్య ఎవరినైనా విమర్శిస్తారు కానీ దూషించరని తెలిపారు. రాష్ట్రం విడిపోయినా రోశయ్య విగ్రహం.. హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేశాం. తాను సుదీర్ఘకాలం రాజకీయాల్లో రాణిస్తానని రోశయ్య గుర్తించారని చెప్పారు.
హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ భూమిపూజ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రి వివేక్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి టీజీ వెంకటేశ్, పలువురు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రపంచస్థాయి నాయకుడు ఒకే ఒక్కరూ మహాత్మా గాంధీ. ప్రపంచంలో ఏ దేశం పోయినా గాంధీ గొప్పతనం తెలియని వారు ఉండరు. భారతదేశం నుంచి ప్రపంచస్థాయి నాయకుడిగా ఎదిగిన ఆర్యవైశ్య బిడ్డ మహాత్మా గాంధీ. ప్రపంచస్థాయి నేతగా గుర్తింపు తెచ్చుకున్న గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావడం గర్వకారణం. అనేక మంది ఆర్యవైశ్య ప్రముఖులు కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషించారు. పొట్టి శ్రీరాములు పోరాటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. దేశ సమగ్రత కోసం గాంధీ ప్రాణాలిస్తే, పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించారు అని సీఎం తెలిపారు.
ఆర్యవైశ్యుల డీఎన్ఏలోనే ముందుచూపు
ఆర్యవైశ్యులకు రావాల్సిన గుర్తింపు రాలేదు. ఆర్యవైశ్యుల పట్ల మా ప్రభుత్వానికి సంపూర్ణ విశ్వాసం ఉంది. పేదల ఆర్యవైశ్య బిడ్డలకు ఆత్మగౌరవ భవనం సంపూర్ణంగా ఉపయోగపడాలి. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణం కోసం సహాయం అందిస్తుంది. నేను మాట ఇస్తే తప్పకుండా అమలు చేస్తా. కలిసి ఉంటేనే మీకు బలం.. సమైక్యంగా ఒక్కతాటిపై నడిస్తే అందరూ గౌరవిస్తారు. ఆర్యవైశ్యులకు ఒక కార్పొరేషన్ పదవి ఇచ్చాం. కొడంగల్‌లో ఒక మున్సిపాలిటీలో ఆర్యవైశ్య కులానికి చైర్మన్ పదవి ఇచ్చాం.. రాజకీయాల్లో మీ వాటా మీరు తీసుకోవాలి.. కలిసి కట్టుగా ఉన్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. ఆర్యవైశ్యులకు ముందు చూపు, జాగ్రత్త వాళ్ల డీఎన్‌ఏలోనే ఉంది.. నేనేప్పుడు ఆర్యవైశ్యుల శ్రేయోభిలాషినే’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●NIMS | చిన్నారులకు విజయవంతంగా గుండె శస్త్రచికిత్సలు
- ●RGV on Artificial Intelligence | జేబులో చిల్లిగవ్వ లేనప్పుడు ఎదురుగా నగదుతో నిండిన పెద్ద లాకర్ ఉంటే దాన్ని తెరవకుండా ఎంతసేపు ఉండగలరు?
- ●TG Weather | మరో మూడురోజులు తెలంగాణలో భారీ వర్షాలు.. ఐఎండీ వార్నింగ్..!
- ●Rashmika Mandanna | ఆనంద్ దేవరకొండ ఎపిక్‌కు రష్మిక మందన్న రివ్యూ - కన్నీళ్లు పెట్టుకున్నా విజయ్ దేవరకొండ
- ●iPhone 17 Pro Max | ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్.. రూ.రూ.74,990కే ఫోన్..!
- ●Pawan Kalyan Keralam Visit | 'థాంక్యూ కేరళం': ఆయుర్వేద చికిత్స ముగిశాక పవన్ కల్యాణ్ ఎమోషనల్ పోస్ట్.. కేరళ సీఎం ఏమన్నారంటే?

NIMS | చిన్నారులకు విజయవంతంగా గుండె శస్త్రచికిత్సలు

RGV on Artificial Intelligence | జేబులో చిల్లిగవ్వ లేనప్పుడు ఎదురుగా నగదుతో నిండిన పెద్ద లాకర్ ఉంటే దాన్ని తెరవకుండా ఎంతసేపు ఉండగలరు?

TG Weather | మరో మూడురోజులు తెలంగాణలో భారీ వర్షాలు.. ఐఎండీ వార్నింగ్..!

Rashmika Mandanna | ఆనంద్ దేవరకొండ ఎపిక్‌కు రష్మిక మందన్న రివ్యూ - కన్నీళ్లు పెట్టుకున్నా విజయ్ దేవరకొండ




