త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Konda Murali | ఢిల్లీకి రామ్మ అంటే గూడా సురేఖ‌మ్మ పోత‌లేదు

Konda Murali | ఢిల్లీ నుంచి చాలా మంది ఫోన్ చేశార‌ని.. అయినా సురేఖ‌మ్మ వెళ్ల‌డం లేద‌ని సురేఖ భ‌ర్త‌, కాంగ్రెస్ నేత కొండా ముర‌ళి వ్యాఖ్యానించారు. ఒక మాట మీద క‌ట్టుబ‌డి ఉండి ప్ర‌జ‌ల‌కు సేవ చేద్దామ‌ని చెప్పింద‌ని పేర్కొన్నారు.

S

Telangana | Published On Sep 13, 2026, 4.26 pm IST

Konda Murali | ఢిల్లీకి రామ్మ అంటే గూడా సురేఖ‌మ్మ పోత‌లేదు
Advertisement
  • ఆమెకు ప‌ద‌వులు ఇచ్చేందుకు రెడీగా ఉన్న‌రు
  • ఒక మాట మీద క‌ట్టుబ‌డుందాం.. ప్ర‌జ‌ల‌కు సేవ చేద్దామ‌ని చెప్పింది
  • అక్క‌డ సుష్మిత చూసుకుంట‌ది.. ఇక్క‌డ మ‌నం చూసుకుందామ‌న్న‌ది
  • రాహుల్‌ను ప్ర‌ధానిని చేయ‌డ‌మే కొండా దంప‌తుల ల‌క్ష్యం
  • కాంగ్రెస్ నేత కొండా ముర‌ళీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Konda Murali | త్రినేత్ర‌.న్యూస్: ఢిల్లీ నుంచి చాలా మంది ఫోన్ చేశార‌ని.. అయినా సురేఖ‌మ్మ వెళ్ల‌డం లేద‌ని సురేఖ భ‌ర్త‌, కాంగ్రెస్ నేత కొండా ముర‌ళి వ్యాఖ్యానించారు. ఒక మాట మీద క‌ట్టుబ‌డి ఉండి ప్ర‌జ‌ల‌కు సేవ చేద్దామ‌ని చెప్పింద‌ని పేర్కొన్నారు. ప‌ర‌కాల‌లో సుష్మిత చూసుకుంట‌ది.. వ‌రంగ‌ల్‌లో మనం చూసుకుందామ‌న్న‌ద‌ని వివ‌రించారు. అధిష్టానం సురేఖ‌మ్మ‌ను సారీ అని పేప‌ర్ మీద రాయ‌మ‌న్నా రాయ‌లేద‌ని తెలిపారు. కృత‌జ్ఞ‌త అంటే కొండా ర‌క్తంలోనే ఉంద‌న్నారు. రాహుల్ గాంధీని ప్ర‌ధానిని చేయ‌డ‌మే కొండా దంప‌తుల ల‌క్ష్య‌మ‌న్నారు. ఈమేర‌కు ఆదివారం వరంగ‌ల్‌లో నిర్వ‌హించిన కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఈరోజు కూడా సురేఖ‌మ్మ‌కు ప‌ద‌వులు ఇవ్వాలంటే ఇచ్చేదందుకు వాళ్లు రెడీగా ఉన్న‌రు. చాలా మంది ఢిల్లీకి రామ్మ అంటే గూడా పోతలేదు. ఒక మాట మీద క‌ట్టుబ‌డి ఉందా. ప్ర‌జ‌ల‌కు సేవ చేద్దాం అని చెప్పింది. పదవి ఉంటే ఉంటుంది పోతే పోతది.. కానీ సారీ అని ఏ రోజు రాయాలే. బీసీ కోసం ముందుకు వచ్చే నాయకుడే లేడు.

నా కారు రంగు ముస్లింల‌కు చిహ్నం..

కొండా సురేఖను గెలిపించడంలో రాహుల్‌గాంధీ పాత్ర ఉంది. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే కొండా దంపతుల లక్ష్యం. మాటపై నిలుచోవాలి. పదవులు ఉంటాయి, పోతాయి. కృతజ్ఞత అంటే కొండా రక్తంలో ఉంది. నా కారు రంగు ఇండియాలో ఎవరికీ ఉండదు. అది ముస్లింలకు చిహ్నం. కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీని విడిచేది లేదు. పార్టీలోనే కొనసాగుతాం. నా శరీరంలో ఇంకా నాలుగు బుల్లెట్స్ ఉన్నాయి. మీ ఆశీస్సులు నన్ను బతికిస్తున్నాయి. పార్టీలో ఉండి పార్టీకి వెన్నుపోటు పోడవకండి.

కొండా ముర‌ళి మాటంటే మాటే..

కొండా సురేఖది.. నాది ఓకే మాట. నా బిడ్డ సుస్మితది వేరే మాట. వరంగల్ తూర్పులో 24 మంది కార్పోరేటర్ల‌ను గెలిపిస్తా. కొండా మురళీ కబ్జా చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి బయటకు వస్తా. రేవంత్ అన్నకు అన్ని తెలుసు. ఢిల్లీ రావాలని ఫోన్ వచ్చింది నిజం. వరంగల్ తూర్పు బాధ్యతలను నవిన్ రాజ్‌కు అప్పగిస్తున్నా. కష్టపడి పని చేసే‌వారికి, గెలిచే వ్యక్తికి కార్పోరేటర్ టిక్కెట్ దక్కుతుంది. నాకు నా బిడ్డ సుస్మితకు సంబంధం లేదు. నన్ను నమ్ముకొని చాలా మంది నాయకులు ఉన్నారు. కొండా మురళీ మాటంటే మాటే. అన్ని వర్గాలను కల్పుకొని ముందు పోతాం. కార్యకర్తల కోసం ఇంకో 10 ఎకరాలు అయినా అమ్ముతా. కార్యకర్తలే నా బలం. ఎన్ని రోజులు బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నది ముఖ్యం.

Advertisement
Advertisement