Palla Rajeshwar reddy | ఆ 29 ఎకరాల భూమి నాది అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
Palla Rajeshwar reddy | నీకు నీతి నిజాయితీ, చీము, నెత్తురు ఉంటే.. ఆ 29 ఎకరాల భూమి నాది అని రుజువు చేయ్.. ఒక వేళ నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. లేదంటే నువ్వు రాజీనామా చేస్తవా అని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓపెన్ చాలెంజ్ చేశారు.
రెవెన్యూ మంత్రి పొంగులేటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా సవాల్
Palla Rajeshwar reddy | త్రినేత్ర.న్యూస్ : నీకు నీతి నిజాయితీ, చీము, నెత్తురు ఉంటే.. ఆ 29 ఎకరాల భూమి నాది అని రుజువు చేయ్.. ఒక వేళ నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. లేదంటే నువ్వు రాజీనామా చేస్తవా అని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓపెన్ చాలెంజ్ చేశారు. తెలంగాణ భవన్‌లో పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
పొంగులేటి చాలా అహంకారంతో మాట్లాడారు. కేసీఆర్, హరీశ్ రావు మీద మాట్లాడటం అహంకారానికి పరాకాష్ట. తెలంగాణ ప్రజలు మీకు సరైన సమయంలో బుద్ది చెబుతారు. జనగామ శాసనసభ్యుడు వట్టినాగుపల్లిలో రూ. 3వేల కోట్ల విలువైన భూదాన్ భూమిని తీసుకున్నా అని చెప్పాడు. నేను తెలంగాణ రాకముందు ఒక ఎకరం 10 గుంటలకు అగ్రిమెంట్ అయినా, తెలంగాణ వచ్చిన మొదటి నెలలో రిజిస్ట్రేషన్ చేసుకున్నా. ఇది భూదాన్‌లో లేదు అని 2008లో కోర్టు కూడా చెప్పింది. నాదగ్గర భూమి ఉందని పొంగులేటి బినామి వచ్చి నన్ను అమ్మాలని కోరారు. నాకు ఉన్నదే ఎకరం పది గుంటలు, 33 ఎకరాల్లో మైనంపల్లి సోదరులు ప్లాట్లు కొన్నరు. 8, 10 ఎకరాలు మైనంపల్లి చంద్రశేఖర్ పేరు మీద ఉన్నది. నాకు సంబంధం లేదు అంటే 10, 15 రోజుల్లో నా భూమిని 22ఏలో చేర్చి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. కోర్టు కూడా నా భూమిలో ఇన్వాల్వ్ కావొద్దని చెప్పింది.రెవెన్యూ అధికారులే కాబోము అని చెప్పారని పల్లా రాజేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు.
హరీశ్ రావుని జనగాం తీసుకువెళ్లి నీ అక్రమాలు బయట పెట్టినం అని నా మీద కోపం పెంచుకున్నవు. 30 శాతం కమీషన్ పేరుతో నన్ను బెదిరించే ప్రయత్నం చేసినవు. ఈ రెండు కారణాలతో నా పేరు అబద్దంగా అసత్యంగా చెప్పినవు. నీకు నీతి నిజాయితీ, చీము, నెత్తురు ఉంటే, ఆ 29 ఎకరాల భూమి నాది అని రుజువు చేయ్. ఒక వేళ నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. లేదంటే నువ్వు రాజీనామా చేస్తవా. నీ డబ్బు మదానికి, నీ అహంకారానికి ప్రజలే బుద్ది చెబుతారు. పట్టా భూములు నిషేధిత జాబితాలో పెట్టి బ్లాక్ మెయిల్ చేసావు. మా కేసీఆర్, హరీశ్ రావు మీద అడ్డగోలుగా మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం అని పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
వట్టినాగులపల్లిలో 2014లో కొన్న భూమిని చూపించి పొంగులేటి అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు.
నాకు అక్కడ భూమి ఉందని తెలిసి పొంగులేటి బినామీ నా దగ్గరికి వచ్చి భూమి అమ్మమని అడిగాడు. నేను అమ్మనని చెప్పడంతో నా భూమిని 22Aలో పెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు.
అందరినీ… pic.twitter.com/kCMJqI45Fg
— BRS Party (@BRSparty) September 12, 2026
తాజావార్తలు
- ●Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు
- ●TGPSC | టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు
- ●TGSRTC | గణేశ్ ఉత్సవాలు.. ఖైరతాబాద్, బాలాపూర్‌కు ప్రత్యేక బస్సులు
- ●Telugu OTT | తెలుగులో ఓటీటీలో రిలీజైన రెండు మలయాళం సినిమాలు ఒకటి మర్డర్ మిస్టరీ - మరోటి యాక్షన్ థ్రిల్లర్
- ●Ashu Reddy | బోల్డ్ లుక్‌లో అషురెడ్డి - చీరలో అందాలు చూడతరమా!
- ●MP Chamala | వచ్చే రెండేళ్లు కూడా ఇలా నాటకాలు వేసుకుని బ్రతకాల్సిందే : ఎంపీ చామల

Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు

TGPSC | టీజీపీఎస్సీ కీలక ప్రకటన.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రరీయన్ పోస్టుల నోటిఫికేషన్ రద్దు

TGSRTC | గణేశ్ ఉత్సవాలు.. ఖైరతాబాద్, బాలాపూర్‌కు ప్రత్యేక బస్సులు

Telugu OTT | తెలుగులో ఓటీటీలో రిలీజైన రెండు మలయాళం సినిమాలు ఒకటి మర్డర్ మిస్టరీ - మరోటి యాక్షన్ థ్రిల్లర్





