త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sreeleela | బాల‌కృష్ణ త‌న‌యుడితో రొమాన్స్ – తెలుగులో శ్రీలీల‌కు క్రేజీ ఛాన్స్‌

తెలుగులో శ్రీలీల ఓ క్రేజీ ఛాన్స్ ద‌క్కించుకుంది. నంద‌మూరి వార‌సుడితో జోడీక‌ట్ట‌బోతుంది. బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్ష‌జ్ఞ‌తేజ హీరోగా వ‌శిష్ట మ‌ల్లిడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సోషియా ఫాంట‌సీ మూవీ రాబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

N

Entertainment | Published On Sep 13, 2026, 5.14 pm IST

Sreeleela | బాల‌కృష్ణ త‌న‌యుడితో రొమాన్స్ – తెలుగులో శ్రీలీల‌కు క్రేజీ ఛాన్స్‌
Advertisement

Sreeleela | కెరీర్‌లో చెప్పుకోద‌గ్గ విజ‌యాలు లేక‌పోయినా అవ‌కాశాల విష‌యంలో శ్రీలీల‌కు అదృష్టం బాగా క‌లిసివ‌స్తోంది. తాజాగా ధ‌మాకా బ్యూటీ తెలుగులో మ‌రో క్రేజీ ఛాన్స్ అందుకున్న‌ట్లు స‌మాచారం. బాల‌కృష్ణ త‌న‌యుడితో జోడీక‌ట్ట‌బోతున్న‌ట్లు తెలిసింది.

నంద‌మూరి వార‌సుడు...

బాల‌కృష్ణ కొడుకు మోక్ష‌జ్ఞ‌తేజ త్వ‌ర‌లోనే హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. నంద‌మూరి వార‌సుడి డెబ్యూ మూవీకి బింబిసార‌, విశ్వంభ‌ర సినిమాల ఫేమ్ వ‌శిష్ట మ‌ల్లిడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. ఇటీవ‌ల అఫీషియ‌ల్‌గా ఈ మూవీని అనౌన్స్‌చేశారు. మోక్ష‌జ్ఞ సినిమా కోసం ఇప్ప‌టికే వ‌శిష్ట మ‌ల్లిడి సోషియో ఫాంట‌సీ జాన‌ర్‌లో ఓ క‌థ‌ను సిద్ధం చేసిన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే గ్రాండ్‌గా ఈ సినిమా లాంఛ్ కానుంది.

భ‌గ‌వంత్ కేస‌రి...

డెబ్యూ మూవీలో ధ‌మాకా బ్యూటీ శ్రీలీల‌తో మోక్ష‌జ్ఞ తేజ రొమాన్స్ చేయ‌బోతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. హీరోయిన్‌గా తెలుగుతో పాటు ప‌లువురు బాలీవుడ్ యంగ్ హీరోయిన్ల‌ను అనుకున్న మేక‌ర్స్ చివ‌ర‌కు శ్రీలీల‌ను ఫైన‌ల్ చేసిన‌ట్లు చెబుతున్నారు. భ‌గ‌వంత్ కేస‌రిలో బాల‌కృష్ణ కూతురిగా శ్రీలీల న‌టించింది. ఈ సినిమా స‌మ‌యంలో బాల‌కృష్ణ‌తో శ్రీలీల‌కు ఏర్ప‌డిన అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకొనే మోక్ష‌జ్ఞ సినిమాలో ఆమెకు హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చిన‌ట్లు చెబుతున్నారు.

అతిథిగా...

ఈ సోషియో ఫాంట‌సీ మూవీలో బాల‌కృష్ణ అతిథి పాత్ర‌లో న‌టించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. స‌ర్‌ప్రైజింగ్ క్యారెక్ట‌ర్‌లో ఆయ‌న క‌నిపిస్తార‌ని అంటున్నారు.

ధ‌నుష్ ఓం సినిమాలో

మ‌రోవైపు ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ఫ్లాపుల్లో డ‌బుల్ హ్యాట్రిక్ కొట్టిన శ్రీలీల టాలీవుడ్‌కు దూర‌మైంది. ప్ర‌స్తుతం బాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో సినిమాలు చేస్తోంది. ధ‌నుష్ ఓం సినిమాలో సాయిప‌ల్ల‌వితో పాటు మ‌రో హీరోయిన్‌గా శ్రీలీల క‌నిపించ‌బోతుంది. హిందీలో అనురాగ్ బ‌సు ద‌ర్శ‌క‌త్వంలో ఓ రొమాంటిక్ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది.

 

Advertisement
Advertisement