త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Sathaiah Awards | కుటుంబ స‌భ్యులంద‌రి ఆప్యాయ‌తల‌తోనే అవార్డులు ఇస్తున్నాం

Ponnam Sathaiah Awards | కుటుంబం ఐక్యంగా, ఆద‌ర్శంగా ఉండాల‌నే ల‌క్ష్యంతో పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారాల కార్య‌క్ర‌మం ఏటా నిర్వ‌హిస్తున్న‌ట్లు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తెలిపారు. కుటుంబ సభ్యులందరి ప్రేమ, ఆప్యాయతలతోనే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామ‌న్నారు.

S

Telangana | Published On Sep 13, 2026, 5.03 pm IST

Ponnam Sathaiah Awards | కుటుంబ స‌భ్యులంద‌రి ఆప్యాయ‌తల‌తోనే అవార్డులు ఇస్తున్నాం
Advertisement
  • ఈసారి వ్య‌వ‌సాయం రంగంలో ఇచ్చాం
  • ఐక్యంగా, ఆద‌ర్శంగా ఉండాల‌నేదే మా ల‌క్ష్యం
  • పొన్నం స‌త్త‌య్య అవార్డుల ప్ర‌దానోత్స‌వంలో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌గౌడ్‌

Ponnam Sathaiah Awards | త్రినేత్ర‌.న్యూస్‌: కుటుంబం ఐక్యంగా, ఆద‌ర్శంగా ఉండాల‌నే ల‌క్ష్యంతో పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారాల కార్య‌క్ర‌మం ఏటా నిర్వ‌హిస్తున్న‌ట్లు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తెలిపారు. త‌మ‌ తల్లిదండ్రులు చదువుకోకపోయినా వ్యవసాయ రైతు కుటుంబంలో పుట్టి విద్యతో పాటు క్రమశిక్షణ, విలువలు, సమాజం పట్ల బాధ్యతను నేర్పించారని గుర్తు చేశారు. కుటుంబ సభ్యులందరి ప్రేమ, ఆప్యాయతలతోనే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామ‌న్నారు. ఆదివారం హైద‌రాబాద్ ర‌వీంద్ర‌భార‌తిలో నిర్వ‌హించిన అవార్డుల ఉత్స‌వం సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌సంగించారు.

వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకున్న కుటుంబం కావడంతో రైతు కష్టం, వ్యవసాయం విలువ మాకు బాగా తెలుసు. పొన్నం సత్తయ్య ఛారిటబుల్ ట్రస్టు కరీంనగర్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పొన్నం సత్తయ్య గౌడ్ 16 వ వర్ధంతి సందర్భంగా ఆయ‌న పేరు మీద‌ జీవన సాఫల్య పురస్కారం - 2026 కార్యక్రమం నిర్వ‌హిస్తున్నాం. వ్యవసాయం- ఎం.కోదండరెడ్డి, సాహిత్యం- వెలిచాల కొండల్ రావు, కళలు - గొట్టే కనకవ్వకు పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం అందించాం.

నాతో పాటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ,మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకట్ స్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చేతుల మీదుగా పురస్కార గ్రహీతలకు మెమెంటోతో పాటు 50 వేల రూపాయల నగదు పురస్కారం అందించాం. ఇప్పటి వరకు సాహిత్యం, కళలకు మాత్రమే ఇచ్చేది. గత సంవత్సరం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనల మేరకు ఈ సంవత్సరం నుంచి వ్యవసాయంలో కూడా ఇస్తున్నాం.

గత నాలుగు సంవత్సరాలుగా విద్య, సామాజిక, కళలు తదితర రంగాల్లో సేవలందించిన ప్రముఖులను పురస్కారాలతో సత్కరిస్తున్నాం. కోదండరెడ్డి రైతుల సమస్యల కోసం ఎన్నో సంవత్సరాలుగా పోరాడారు. రైతుల హక్కులు, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. రైతులు, పంటలు, వ్యవసాయం పట్ల ఆయనకు ఉన్న ప్రేమ, అనుబంధాన్ని గుర్తిస్తూ ఈ ఏడాది వ్యవసాయ రంగ పురస్కారం అందజేస్తున్నాం. గత నాలుగు సంవత్సరాల్లో వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను పురస్కారాలతో సత్కరించాం.

ఈ అవార్డుల జ్యూరీ కమిటీ కన్వీనర్ డా. పొన్నం రవిచంద్ర సారథ్యంలో కేంద్ర సమాచార హక్కు చట్టం మాజీ కమిసనర్ మాడభూషి శ్రీధర్, ప్రముఖ పాత్రికేయులు దిలీప్ రెడ్డి, సివిల్ సప్లయస్ డైరెక్టర్ జి.వి. శ్యాంప్రసాద్ లాల్, బి. సి. స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, రచయిత్రి అయినంపుడి శ్రీలక్ష్మి పేర్ల‌ను ఎంపిక చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, ఫ్రొఫెసర్ హరగోపాల్, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ బాలమయాదేవి, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement