త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Srinivas Goud | యూనిక్ కోడ్ కేటాయించ‌క‌పోతే.. ఉద్య‌మం ఉధృతం చేస్తాం

Srinivas Goud | దేశవ్యాప్తంగా ఓబీసీ కులగణన చేయడానికి ప్రతి కులానికి ఒక యూనిక్ కోడ్‌ను కేటాయించిన తర్వాతనే జనగణన చేయాలి, సాధించే వరకు దేశవ్యాప్తంగా ఏకతాటిపై ఉండి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామ‌ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తేల్చిచెప్పారు.

S

Telangana | Published On Sep 5, 2026, 10.16 pm IST

Srinivas Goud | యూనిక్ కోడ్ కేటాయించ‌క‌పోతే.. ఉద్య‌మం ఉధృతం చేస్తాం
Advertisement
  • కుల గ‌ణ‌న స‌మ‌న్వ‌య క‌మిటీ కాన్ఫ‌రెన్స్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Srinivas Goud | త్రినేత్ర‌.న్యూస్ : దేశవ్యాప్తంగా ఓబీసీ కులగణన చేయడానికి ప్రతి కులానికి ఒక యూనిక్ కోడ్‌ను కేటాయించిన తర్వాతనే జనగణన చేయాలి, సాధించే వరకు దేశవ్యాప్తంగా ఏకతాటిపై ఉండి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామ‌ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తేల్చిచెప్పారు. దేశవ్యాప్తంగా కులగణన సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఓబీసీల సమగ్ర కులగణన చేపట్టే అంశంపై సమావేశంలో కూలంకుషంగా చర్చించడం జరిగింది. ప్రతి కులానికి ప్రత్యేకమైన యూనిక్ కోడ్ కేటాయించి, ఆ ప్రాతిపదికన సమగ్ర కులగణన నిర్వహించాల్సిన అవసరం ఉందని నిర్ణయించారు. కులాల వారీగా జనాభా, సామాజిక–ఆర్థిక పరిస్థితులపై స్పష్టమైన గణాంకాలు అందుబాటులోకి రావాలంటే దేశవ్యాప్తంగా ఒకే విధమైన విధానంతో కులగణన జరగాలని సమావేశం అభిప్రాయపడింది. అన్ని రాష్ట్రాలను, ఓబీసీ సంఘాలను, సామాజిక న్యాయ సంస్థలను సమన్వయం చేసుకుంటూ దేశవ్యాప్తంగా సమగ్ర ఓబీసీ కులగణన పూర్తయ్యే వరకు ఉద్యమ కార్యాచరణను రూపొందించి, ఓబీసీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఓబీసీల జనాభాకు అనుగుణంగా హక్కులు, వాటా, న్యాయం దక్కాలంటే సమగ్ర కులగణన తప్పనిసరి. ఓబీసీల హక్కుల సాధన కోసం దేశవ్యాప్తంగా ఐక్య ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని సమావేశం పిలుపునిచ్చింది అని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పి విల్సన్, ప్రొఫెసర్ సూరజ్ మండల్, మాజీ ఐఎస్ఐ అధికారి & తెలంగాణ ఇంటలెక్టువల్స్ ఫోరమ్ కన్వీనర్ చిరంజీవులు, ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్, అడ్వకేట్ డా అంజలి సాల్వే, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement