త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bigg Boss 10 Telugu | బిగ్‌బాస్ 10 తెలుగు లాంఛ్ ఎపిసోడ్‌కు గెస్ట్ క‌న్ఫామ్ – షో టెలికాస్ట్ టైమ్ ఛేంజ్‌!

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 10 గ్రాండ్ లాంఛ్ కు రంగం సిద్ధ‌మైంది. లాంఛింగ్ ఎపిసోడ్‌కు గెస్ట్ ఎవ‌ర‌న్న‌ది క‌న్ఫామ్ అయ్యింది. షో టైమింగ్స్‌తో పాటు కంటెస్టెంట్స్ కూడా ఖ‌రార‌య్యారు. మొత్తం ఆరుగురు కామ‌న్ మ్యాన్స్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. వారు ఎవ‌రంటే?

N

Entertainment | Published On Sep 5, 2026, 8.11 pm IST

Bigg Boss 10 Telugu | బిగ్‌బాస్ 10 తెలుగు లాంఛ్ ఎపిసోడ్‌కు గెస్ట్ క‌న్ఫామ్ –  షో  టెలికాస్ట్ టైమ్ ఛేంజ్‌!
Advertisement

Bigg Boss 10 Telugu |  బిగ్‌బాస్ సంబురం మ‌ళ్లీ మొద‌ల‌వుతోంది. బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 10 ఆదివారం గ్రాండ్‌గా లాంఛ్ కాబోతుంది. ఈ సీజ‌న్‌లో కంటెస్టెంట్స్‌గా అడుగుపెట్టే సెలిబ్రిటీలు, కామ‌న్ మ్యాన్స్ ఎవ‌ర‌న్న‌ది క‌న్ఫామ్ అయ్యింది. ఈ సారి టాస్క్‌లు, ఆట‌తీరుతో పాటు షో  టెలికాస్ట్ టైమ్ను కూడా బిగ్‌బాస్ టీమ్ ఛేంజ్ చేశారు. గ‌త సీజ‌న్ల‌లో బిగ్‌బాస్ రాత్రి ప‌ది గంట‌ల‌కు టెలికాస్ట్ అయ్యింది. బిగ్‌బాస్ 10...రాత్రి తొమ్మిదిన్న‌ర గంట‌ల నుంచే స్టార్ మాలో  ప్రసారం కాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

గెస్ట్‌గా....

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 10 లాంఛింగ్ ఎపిసోడ్‌కు త‌మిళ హీరో కార్తి గెస్ట్‌గా రాబోతున్నాడు. ఫ‌స్ట్ ఎపిసోడ్ షూటింగ్ శ‌నివారం కంప్లీట్ అయ్యింది. స‌ర్ధార్ 2 ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా కార్తితో పాటు ఎస్‌జే సూర్య‌, మాళ‌వికా మోహ‌న‌న్‌, ఆషికా రంగ‌నాథ్ ఈ షోలో సంద‌డి చేశారు.

కామ‌న్ మ్యాన్స్‌

బిగ్‌బాస్ అగ్నిప‌రీక్ష నుంచి ఆరుగురు కామ‌న్ మ్యాన్స్ హౌజ్‌లోకి అడుగుపెట్ట‌బోతున్నారు. తొలి ఎంట్రీని సింగ‌ర్ ఝాన్సీ ద‌క్కించుకుంది. ఆమెతో పాటు రోహిత్‌నాయుడు, అమ‌న్ మ‌సూద్‌, శ్రిష్టి, షాలిని, ఆర్‌జే చ‌ర‌ణ్ బిగ్‌బాస్‌లో ఛాన్స్ ద‌క్కించుకున్నారు.

సెలిబ్రిటీలు...

సెలిబ్రిటీల నుండి సీరియ‌ల్ యాక్ట‌ర్స్ ముఖేష్ గౌడ‌, దేబ్జానీ మోదాక్‌, చైత్ర‌రాయ్‌, యాంక‌ర్ వ‌ర్షిణితో పాటు జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్లు ఆటో రామ్‌ప్ర‌సాద్‌, పొట్టి న‌రేష్ క‌న్ఫామ్ అయ్యారు. వారితో పాటు సినిమా యాక్ట‌ర్లు కృష్ణుడు, టెంప‌ర్ వంశీ, అదిత్ ఈశ్వ‌ర‌న్‌, కృష్ణ అల్లూరితో పాటు సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స‌ర్ సుధీర్ రెడ్డి కూడా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

 

 

Advertisement
Advertisement