త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Congress Party | కేసీఆర్ రాజీనామా చేయాలి.. కాంగ్రెస్ నిర‌స‌న ర్యాలీ

Congress Party | వెయ్యి రోజులుగా మాజీ సీఎం కేసీఆర్ మొద్దు నిద్ర పోతూ ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉన్నార‌ని ఖైర‌తాబాద్ డీసీసీ అధ్య‌క్షుడు మోతా రోహిత్ ముదిరాజ్ విమ‌ర్శించారు.

S

Telangana | Published On Sep 4, 2026, 7.55 pm IST

Congress Party | కేసీఆర్ రాజీనామా చేయాలి.. కాంగ్రెస్ నిర‌స‌న ర్యాలీ
Advertisement

Congress Party | త్రినేత్ర‌.న్యూస్ : వెయ్యి రోజులుగా మాజీ సీఎం కేసీఆర్ మొద్దు నిద్ర పోతూ ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉన్నార‌ని ఖైర‌తాబాద్ డీసీసీ అధ్య‌క్షుడు మోతా రోహిత్ ముదిరాజ్ విమ‌ర్శించారు. కేసీఆర్ ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ.. శుక్ర‌వారం గాంధీ భ‌వ‌న్ నుంచి గ‌న్ పార్క్ వ‌ర‌కు భారీ ర్యాలీ నిర్వ‌హించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఫొటోతో కుంభకర్ణుడి భారీ కటౌట్‌ను ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు.

కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. “ప్రజలకు దూరంగా ఫామ్‌హౌస్‌కే పరిమితమైన కేసీఆర్ వెయ్యి రోజులుగా మొద్దు నిద్రలో ఉన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోని కేసీఆర్ ఇప్పటికైనా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి” అని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, మాజీ కార్పొరేటర్లు రమణ గౌడ్, సంతోష్ గుప్తా, సంగీత యాదవ్, సీనియర్ నాయకులు పండిట్ తివారీ, కనయ్య లాల్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు హరిదర్, రాహుల్, అలాగే యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ డివిజన్ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement