త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sumitra Anand | ఎన్ని క‌థ‌లు చెప్పినా రేవంత్ రెడ్డికి సున్నా మార్కులే

Sumitra Anand | టీచ‌ర్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని కొండ‌గ‌ల్‌కు మార్చ‌డం ఉపాధ్యాయుల‌ను అవ‌మాన‌ప‌ర్చ‌డ‌మే అని టీజీపీఎస్సీ మాజీ స‌భ్యురాలు సుమిత్రానంద్ పేర్కొన్నారు. ఎన్ని క‌థ‌లు చెప్పినా రేవంత్ రెడ్డికి సున్నా మార్కులే అని ఆమె విమ‌ర్శించారు.

S

Telangana | Published On Sep 5, 2026, 5.49 pm IST

Sumitra Anand | ఎన్ని క‌థ‌లు చెప్పినా రేవంత్ రెడ్డికి సున్నా మార్కులే
Advertisement

Sumitra Anand | త్రినేత్ర‌.న్యూస్ : టీచ‌ర్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని కొండ‌గ‌ల్‌కు మార్చ‌డం ఉపాధ్యాయుల‌ను అవ‌మాన‌ప‌ర్చ‌డ‌మే అని టీజీపీఎస్సీ మాజీ స‌భ్యురాలు సుమిత్రానంద్ పేర్కొన్నారు. ఎన్ని క‌థ‌లు చెప్పినా రేవంత్ రెడ్డికి సున్నా మార్కులే అని ఆమె విమ‌ర్శించారు. ఉపాధ్యాయుల‌ను గౌర‌వించ‌లేని ప్ర‌భుత్వం ఈ రేవంత్ స‌ర్కార్ అని మండిప‌డ్డారు. తెలంగాణ భ‌వ‌న్‌లో సుమిత్రానంద్ శ‌నివారం మీడియాతో మాట్లాడారు.

ఉపాధ్యాయులను రేవంత్ రెడ్డి బాధ పెడుతున్నారు కాబట్టే వారు రోడ్డెక్కుతున్నారు. వెయ్యి రోజుల సమయం సరిపోదా... ఇంకా రెండేళ్ల సమయం కావాలని ఎలా అడుగుతారు? ప్రభుత్వ వైఫల్యానికి కేసీఆర్‌పై నెట్టడం సమంజసం కాదు. ప‌రిపాల‌న చేయ‌డం చేత‌గాక కేసీఆర్‌పై నిందలు వేస్తున్నారు అని ఆమె ధ్వ‌జ‌మెత్తారు.

అన్నింటికీ డబ్బులు ఉంటాయి కానీ, ఉపాధ్యాయులకు ఇచ్చేందుకు మాత్రం లేవా? అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి అదే పరంపర కొనసాగిస్తున్నారు. ఉపాధ్యాయులకు, విద్యా రంగానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిందేమిటి? ఇంజనీర్లను క్రిమినల్ వేస్ట్ అని వారికి విద్య నేర్పిన ఉపాధ్యాయులను అగౌరవపర్చారు. సందర్బం దొరికిన ప్రతిసారీ ఉపాధ్యాయులను రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారు. ఉపాధ్యాయులను కూడా మోసం చేయడం సమంజసం కాదు. పిల్లలకు పిడికెడు నాణ్యమైన భోజనం కూడా పెట్టలేరా? ఎన్ని కథలు చెప్పినా, ఏం చేసినా రేవంత్ రెడ్డికి సున్నా మార్కులే. రేవంత్ రెడ్డి తన పద్దతి మార్చుకొని ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి అని సుమిత్రానంద్ డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement