త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | శ్రీశ్రీ బ‌తికి ఉంటే.. కాంగ్రెస్ మోసాన్ని చూసి ఇట్ల రాసేవారేమో : హ‌రీశ్‌రావు

Harish Rao | బ‌డ్జెట్ ప‌ద్దుల‌పై చ‌ర్చ సంద‌ర్భంగా బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. నిరుద్యోగ అంశంపై ప్ర‌భుత్వాన్ని ఎండ‌గ‌ట్టారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో నిరుద్యోగులు మోస‌పోయార‌ని ధ్వ‌జ‌మెత్తారు.

S

Telangana | Published On Mar 23, 2026, 3.38 pm IST

Harish Rao | శ్రీశ్రీ బ‌తికి ఉంటే.. కాంగ్రెస్ మోసాన్ని చూసి ఇట్ల రాసేవారేమో : హ‌రీశ్‌రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : బ‌డ్జెట్ ప‌ద్దుల‌పై చ‌ర్చ సంద‌ర్భంగా బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. నిరుద్యోగ అంశంపై ప్ర‌భుత్వాన్ని ఎండ‌గ‌ట్టారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో నిరుద్యోగులు మోస‌పోయార‌ని ధ్వ‌జ‌మెత్తారు. అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో నిరుద్యోగ అభ్య‌ర్థుల‌కు కాంగ్రెస్ కండువాలు క‌ప్పి బ‌ల‌వంతంగా గ్రామాల్లో ప్ర‌చారం చేయించి ఓట్లు దండుకున్నారు. జాబ్ క్యాలెండ‌ర్ ఊసే లేదని ధ్వ‌జమెత్తారు. అశోక్ న‌గ‌ర్, చిక్క‌డ‌ప‌ల్లి సెంట్ర‌ల్ లైబ్ర‌రీకి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వెళ్లి ఏడాదికి 2 ల‌క్ష‌ల ఉద్యోగాలిస్తామ‌ని చెప్పి నిరుద్యోగుల‌ను మోసం చేశార‌ని హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు.

నిజంగా శ్రీశ్రీ గారు బతికి ఉంటే కాంగ్రెస్ మోసాన్ని చూసి ఇట్ల రాసేవారేమో అని హ‌రీశ్‌రావు ఓ క‌విత్వం చ‌దివి వినిపించారు.

రాహుల్ గాంధీ మాటనమ్మి, ప్రియాంక గాంధీ బాస నమ్మి
కాంగిరేసుకు ఓటు వేసిన నిరుద్యోగికి ఎంత కష్టం.. ఎంత కష్టం

ముఖ్యమంత్రి డిల్లీ వాయే
జాబు లేమో రాకపాయె
కడుపు మండీ ర్యాలి తీస్తే
లాఠీచార్జి చేసుడాయే
తలలు పగిలి నెత్తురాయే
అశోక్ నగరే చిత్తడాయే
కాంగిరేసుకు ఓటు వేసిన.. నిరుద్యోగికి ఎంత కష్టం ఎంత కష్టం

అని హ‌రీశ్‌రావు క‌విత్వం చెప్పారు.

Advertisement
Advertisement