Harish Rao | సింగరేణి మిగలదు గాక మిగలదు.. హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని పెనుప్రమాదంలో నెడుతుందని.. కార్మికులందరూ మేల్కోవాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. సింగరేణిని కాపాడుకోవడం కోసం కార్మికులందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చి.. పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్‌కో హఠావో.. సింగరేణికో బచావో అనే నినాదంతో ఈ రోజు వెళ్లకపోతే ఇక ఈ సింగరేణి మిగలదు గాక మిగలదు అని హరీశ్‌రావు అన్నారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని పెనుప్రమాదంలో నెడుతుందని.. కార్మికులందరూ మేల్కోవాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. సింగరేణిని కాపాడుకోవడం కోసం కార్మికులందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చి.. పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్‌కో హఠావో.. సింగరేణికో బచావో అనే నినాదంతో ఈ రోజు వెళ్లకపోతే ఇక ఈ సింగరేణి మిగలదు గాక మిగలదు అని హరీశ్‌రావు అన్నారు. సింగరేణి సమస్యలపై తెలంగాణ భవన్‌లో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు.
నైనీ కోల్ బ్లాక్ టెండర్లు జరిగాయి. సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టారు. దానికి కూడా భట్టి విక్రమార్క కవరింగ్ ఇచ్చారు. లేదు లేదు గతంలో ఉంది.. ఇంకెక్కడ్నో ఉందని. సైట్ విజిట్ సర్టిఫికెట్ ఎప్పుడూ కూడా ఓపెన్ కోల్ బ్లాక్‌లకు లేదు. ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత ఓబీ టెండర్లన్నీ కూడా ప్లస్ 6, ప్లస్ 7 పోతున్నాయని, సీఎం బామ్మర్ది సృజన్ రెడ్డికి ఎట్ల ఇచ్చారు..? అని ప్రశ్నించాం. లేదా ఇంకొక బ్లాక్ ఎట్లిచ్చారు..? ఎంత ఎక్సెస్ పోయిందో చెప్పాను. చెబుతూ ఇంకో విషయం బయటపెట్టాను. శ్రీరాంపూర్ ఓబీ టెండర్‌ను 7 సార్లు వాయిదా వేశారు. సింగరేణిలో ఎట్ల ఉంటదంటే.. ఒక్కరోజు కూడా వేస్ట్ చేయరు. వెంటవెంటనే టెండర్లు పిలిచి బొగ్గు ఉత్పత్తి చేస్తేనే సింగరేణి బతుకుతది. అప్పుడే సింగరేణి ప్రాఫిట్‌లోకి పోతుంది.. ఒక్క రోజు లేట్ అయితే సింగరేణి లాస్‌లోకి వెళ్లిపోతది. కానీ శ్రీరాంపూర్ టెండర్ విషయంలో ఆరు నెలలు సాగదీశారు. టెక్నికల్ బిడ్ ఓపెన్ చేశారు. ఫైనాన్షియల్ బిడ్‌కు వాయిదా.. దానికి సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టారు. బీఆర్ఎస్ దాన్ని బయటపెట్టి గట్టిగా అడిగితే.. దాన్ని ఓపెన్ చేస్తే అది మైనస్ 20 టెండర్ పోయింది. లేకుంటే ఎంత స్కాం.. మనం బయటపెట్టిన తర్వాత సైట్ విజిట్ సర్టిఫికెట్ బంద్ అయింది. కనీసం సింగరేణిలో కొంత అవినీతి ఆగింది అని హరీశ్‌రావు తెలిపారు.
సైట్ విజిట్ సర్టిఫికెట్‌తో టెండర్లలో గోల్ మాల్
సైట్ విజిట్ సర్టిఫికెట్‌తో టెండర్లలో గోల్ మాల్ అయితుందని కొందరు ప్రధాని, ముఖ్యమంత్రి, సింగరేణి సీఎండీకి ఫిర్యాదు చేస్తే ఇంత వరకు విచారణ లేదు. కిషన్ రెడ్డిని అదే అడుగుతున్నా.. మీరు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఎలాంటి సంబంధం లేకపోతే.. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు బొగ్గు బాయిల మీద నిల్వ ఉందని సింగరేణి అధికారిక వెబ్‌సైట్‌లో ఉంది. ఆ బొగ్గు ఎక్కడున్నదో తనిఖీ చేయించి, చర్యలు తీసుకోండి. నైనీ కోల్ బ్లాక్ విషయంలో సైట్ విజిట్ సర్టిఫికెట్ మనం బయటపెడితే.. దాని మీద కేంద్ర ప్రభుత్వ అధికారులు వచ్చి ఎంక్వైరీ చేశారు.. ఆ రిపోర్టు బయటపెట్టండని డిమాండ్ చేస్తున్నా అని హరీశ్‌రావు తెలిపారు.
కాంగ్రెస్‌కో హఠావో.. సింగరేణికో బచావో
మీరు యూనిటీగా లేకపోతే.. ఇది టీజీబీకేఎస్ భవిష్యత్తే కాదు.. మొత్తం సింగరేణి భవిష్యత్తే ప్రశ్నార్థకం అవుతుంది. మొత్తం తెలంగాణ రాష్ట్రానికే నష్టం జరిగేటటువంటి పెనుప్రమాదంలోకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన సింగరేణిని నెడుతుంది. అందువల్ల మీరు మేల్కోవాలి. ఇది మన సంఘం కోసమే కాదు.. యావత్ తెలంగాణ కోసం, సింగరేణిని కాపాడుకోవడం కోసం.. ఈ రోజు కార్మికులందరినీ ఒక్కతాటిపై తీసుకువచ్చి, పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్‌కో హఠావో.. సింగరేణికో బచావో అనే నినాదంతో ఈ రోజు వెళ్లకపోతే ఇక ఈ సింగరేణి మిగలదు గాక మిగలదు అనే విషయాన్ని చెబుతున్నాను. గంభీరంగా ఉంది పరిస్థితి. జీతాలు కూడా రానీ పరిస్థితి ఏర్పడుతది. 4 వేల కోట్ల ఓడీలోకి పోయింది.. మొత్తం తెలంగాణ ఓడీ కంటే సింగరేణి ఓడీ ఎక్కువ.. ఇది అలర్ట్ కావాల్సిన సమయం.. కార్మికుల్లో చైతన్యం కల్పించాలి. తెలంగాణకు గొప్ప వనరుగా ఉన్న సింగరేణిని కాపాడుకునే హక్కు కార్మికులుగా, ఉద్యమకారులుగా మనందరి మీద ఉంది అని హరీశ్‌రావు అన్నారు.
తాజావార్తలు
- ●Nitesh Rane Bakrid Remark | 'మటన్‌కు బదులు కాగితం తిని చూడు'.. వర్చువల్ బక్రీద్ వ్యాఖ్యలపై బీజేపీ మంత్రి నితేశ్ రాణేకు సొంత పార్టీ నేత షాక్
- ●Web Series | టైటాన్ వాచ్ చరిత్రపై వెబ్‌సిరీస్ - లీడ్ రోల్లో కుబేర విలన్ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
- ●Maheshkumar Goud | బాగా పని చేయండి.. బూత్ స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేద్దాం: మహేశ్‌కుమార్‌గౌడ్
- ●Siddaramaiah vs DK Shivakumar | కర్ణాటక కాంగ్రెస్‌లో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'.. కొత్త సీఎంగా డీకే శివకుమార్? హైకమాండ్ ప్లాన్ ఇదే
- ●Tripti Dimri | ప్రభాస్ స్పిరిట్ సెట్స్‌లో త్రిప్తి డిమ్రి.. వానిటీ వ్యాన్ ఫొటోలు పంచుకున్న హాట్ బ్యూటీ
- ●Koppula Eshwar | సింగరేణి కాంగ్రెస్‌కు ఏటీఎంలా అయిపోయింది: కొప్పుల ఈశ్వర్

Nitesh Rane Bakrid Remark | 'మటన్‌కు బదులు కాగితం తిని చూడు'.. వర్చువల్ బక్రీద్ వ్యాఖ్యలపై బీజేపీ మంత్రి నితేశ్ రాణేకు సొంత పార్టీ నేత షాక్

Web Series | టైటాన్ వాచ్ చరిత్రపై వెబ్‌సిరీస్ - లీడ్ రోల్లో కుబేర విలన్ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Maheshkumar Goud | బాగా పని చేయండి.. బూత్ స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేద్దాం: మహేశ్‌కుమార్‌గౌడ్

Siddaramaiah vs DK Shivakumar | కర్ణాటక కాంగ్రెస్‌లో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'.. కొత్త సీఎంగా డీకే శివకుమార్? హైకమాండ్ ప్లాన్ ఇదే





