త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | రేపు మ‌. 3.30 గంట‌ల‌కు స్టే వెకేట్.. రేవంత్ రెడ్డి జైలుకే

Harish Rao | దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచార‌ణ ఈ నెల 22న విచార‌ణ‌కు రానుంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌తో పాటు ఏపీలోనూ స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. ఈ కేసు విచార‌ణ నేప‌థ్యంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

S

Telangana | Published On Apr 21, 2026, 5.28 pm IST

Harish Rao | రేపు మ‌. 3.30 గంట‌ల‌కు స్టే వెకేట్.. రేవంత్ రెడ్డి జైలుకే
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచార‌ణ ఈ నెల 22న విచార‌ణ‌కు రానుంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌తో పాటు ఏపీలోనూ స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. ఈ కేసు విచార‌ణ నేప‌థ్యంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బుధ‌వారం మ‌ధ్యాహ్నం స్టే వెకెట్ అయిందంటే.. రేవంత్ రెడ్డి జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని హ‌రీశ్‌రావు అన్నారు.

తెలంగాణ భ‌వ‌న్‌లో మంగ‌ళ‌వారం హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ ఉంది. పట్టపగలు బ్యాగులతో దొరికిపోయిన దొంగ రేవంత్ రెడ్డి. ఈరోజు హోంమంత్రిగా ఆయనే ఉన్నాడు కాబట్టి కంప్లైంట్ కూడా ఆయనే. ప్రభుత్వం తరఫున నామమాత్రపు లాయర్లను పెట్టి, వ్యక్తిగతంగా తన తరఫున ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ్ లూత్రా లాంటి ఖరీదైన లాయర్లను పెట్టుకున్నాడు అని హ‌రీశ్‌రావు తెలిపారు.

సీఎం సీటు ఊడ‌డం.. జైలుకెళ్ల‌డం ఖాయం..

ఈ ఓటుకు నోటు కేసులో బీఆర్ఎస్ పార్టీ తరఫున జగదీశ్ రెడ్డి, డాక్టర్ సంజయ్, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ గారు ఇంప్లీడ్ అయ్యారు. ఆనాడు సమాఖ్య వాదులతో చేతులు కలిపి మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేసింది రేవంత్ రెడ్డి కాదా? నాలుగున్నరేండ్ల నుంచి స్టేల మీద బతుకుతున్న రేవంత్ రెడ్డికి ఆ స్టే వెకేట్ అయిందంటే.. ముఖ్యమంత్రి సీటు ఊడటం, జైలుకు వెళ్లడం ఖాయం అని హ‌రీశ్‌రావు అన్నారు.

Advertisement
Advertisement