Harish Rao | ఇదేనా ఒకటో తారీఖు జీతం ఇవ్వడం అంటే సీఎం గారూ..? : హరీశ్‌రావు
Harish Rao | ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రగల్భాలు పలికిన సంగతి తెలిసిందే. కానీ ఈ ప్రకటన ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రగల్భాలు పలికిన సంగతి తెలిసిందే. కానీ ఈ ప్రకటన ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. ఒకట్రెండు నెలలు మాత్రమే ఒకటో తారీఖున జీతాలు పడ్డాయి. అయితే గత మూడు నెలలుగా జీతాలు రాక సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీ కార్మికురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు.
ఇదేనా ఒకటో తారీఖు జీతం ఇవ్వడం అంటే ముఖ్యమంత్రి గారూ..? హరీశ్‌రావు నిలదీశారు. వైద్యారోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకోవడం శోచనీయమన్నారు. తక్షణమే మెడికల్ కాలేజీ కార్మికులకు జీతాలు చెల్లించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీ శానిటేషన్ వర్కర్‌గా పనిచేస్తున్న అనిత ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. మూడు నెలలుగా జీతాలు లేక కుటుంబ పోషణ భారం కావడంతో ఆలౌట్ (దోమల మందు) తాగింది. గమనించిన స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జీతాలు రాకపోవడంతో మెడికల్ కాలేజీలో 400 మంది కార్మికుల ఆందోళన చెందుతున్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాలోనే దారుణ పరిస్థితులు ఉంటే.. మిగతా జిల్లాల్లోని మెడికల్ కాలేజీల పరిస్థితి ఏంటని ప్రశ్నించుకుంటున్నారు.
తాజావార్తలు
- ●Stock Markets | సెన్సెక్స్ వరుసగా రెండో రోజు డౌన్.. మిడ్‌క్యాప్స్ దుమ్మురేపాయి..
- ●Balka Suman | బాల్క సుమన్‌తో బీఆర్ఎస్కు తిప్పలు
- ●Saumitra Khan | కమలంపార్టీలోకి 50 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు..? బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
- ●L-Carnitine | ఎల్-కార్నిటైన్ సప్లిమెంట్లు నిజంగానే బరువును తగ్గిస్తాయా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
- ●Chanagani Dayakar | సింగరేణి ఉద్యోగాలు అమ్ముకున్న చరిత్ర బాల్క సుమన్‌ది : చనగాని దయాకర్
- ●Assam UCC Bill | అస్సాంలో ఉమ్మడి పౌర స్మృతికి గ్రీన్ సిగ్నల్: లివ్-ఇన్ జంటలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. లేదంటే జైలే!

Stock Markets | సెన్సెక్స్ వరుసగా రెండో రోజు డౌన్.. మిడ్‌క్యాప్స్ దుమ్మురేపాయి..

Balka Suman | బాల్క సుమన్‌తో బీఆర్ఎస్కు తిప్పలు

Saumitra Khan | కమలంపార్టీలోకి 50 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు..? బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

L-Carnitine | ఎల్-కార్నిటైన్ సప్లిమెంట్లు నిజంగానే బరువును తగ్గిస్తాయా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?




