Harish Rao | యూరియా దొరకడం లేదు.. హరీశ్‌రావు వద్ద ఓ రైతు ఆవేదన
Harish Rao | యూరియాను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో ఉండే రైతులకు యూరియా దొరకడం లేదని ఓ రైతు బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తమ వద్ద స్మార్ట్‌ఫోన్లు లేవు.. అధికారులేమో ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకుంటేనే యూరియా ఇస్తామని చెబుతున్నారని రైతులు వాపోయారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : యూరియాను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో ఉండే రైతులకు యూరియా దొరకడం లేదని ఓ రైతు బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తమ వద్ద స్మార్ట్‌ఫోన్లు లేవు.. అధికారులేమో ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకుంటేనే యూరియా ఇస్తామని చెబుతున్నారని రైతులు వాపోయారు.
హరీశ్‌రావు అచ్చంపేట వెళ్తూ.. మార్గమధ్యలో కడ్తాల్ వద్ద ఫెర్టిలైజర్ షాప్ దగ్గర ఆగి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎల్లయ్య అనే రైతుతో హరీశ్ రావు మాట్లాడగా, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు పడుతున్న గోస కళ్లకు కట్టినట్లు కనిపించింది. ఆన్‌లైన్ బుకింగ్ పేరుతో యూరియా దొరకక బ్లాక్‌లో కొంటున్నామని, కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక రేవంత్ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని హరీశ్ రావు ఎదుట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోళ్లలో తరుగు, ఆగిపోయిన పాల బిల్లులతో అరిగోస పడుతున్నామని.. కాంగ్రెస్‌కు ఓటేసి మోసపోయామని, మళ్లీ కేసీఆర్ వస్తేనే తమ రాత మారుతుందని ఎల్లయ్య స్పష్టం చేశారు.
యూరియా దొరికిందా అని హరీశ్ రావు అడగగా.. అసలు యూరియా దొరకడం లేదని ఎల్లయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. స్మార్ట్ ఫోన్లలో ఆన్లైన్ బుకింగ్ చేస్తేనే యూరియా ఇస్తామంటున్నారని, తమ దగ్గర ఉన్నవి కీప్యాడ్ చిన్న ఫోన్లు కావడంతో ఆన్లైన్ చేయడం రావడం లేదని అన్నాడు. తీరా షాపు దగ్గరికి వెళ్లేసరికి స్టాక్ అయిపోయిందని చెబుతున్నారని, చేసేదేం లేక బ్లాక్‌లో యూరియా బస్తాలు తెచ్చుకోవాల్సి వస్తోందని తెలిపాడు.
అంతేకాకుండా, యూరియా కావాలంటే తమకు ఏమాత్రం అవసరం లేని ఇతర మందుల ప్యాకెట్లను కూడా కచ్చితంగా కొనాలని షాపుల వాళ్ళు బలవంతపెడుతున్నారని రైతు వాపోయాడు. ఇక కరెంటు పరిస్థితి గురించి అడగగా.. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో అసలు అర్థమే కావడం లేదన్నాడు.
గత యాసంగిలో వడ్లు, మక్కలు అమ్మినప్పుడు కొనుగోలు కేంద్రాల్లో విపరీతంగా తరుగు తీసి నష్టపరిచారని ఎల్లయ్య చెప్పాడు. అలాగే, పాల బిల్లుల విషయంలోనూ ప్రభుత్వం రైతులను ఆగం చేస్తోందని వివరించాడు. గతంలో నెలకు రెండుసార్లు క్రమం తప్పకుండా వచ్చే పాల బిల్లులు ఇప్పుడు సక్రమంగా రావడం లేదని, ఒక బిల్లు వేసి మూడు బిల్లులు ఆపుతున్నారని, లీటరుకు ఇచ్చే ధర కూడా తగ్గించారని తెలిపాడు.
కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా సరిగ్గా ఇవ్వకపోగా, రైతుబంధు, బోనస్ లాంటివి కూడా ఎగ్గొట్టిందని హరీశ్ రావు గుర్తుచేయగా.. రైతులంతా ఇప్పుడు తీవ్రమైన పరేషాన్‌లో ఉన్నారని రైతులు వాపోయారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇకపై మక్కలు, జొన్నలు కొనమని చెబుతోందని, మరి తాము ఏం పంటలు వేసుకోవాలి, ఎలా బతకాలి అని ఆందోళన వ్యక్తం చేశారు రైతులు. ఏదేమైనా మళ్లీ కేసీఆర్ వస్తేనే రైతుల రాత మారుతుందని, ఆయన ఉన్నప్పుడే తాము సంతోషంగా ఉన్నామని ఎల్లయ్య అనే రైతు స్పష్టం చేశాడు. ప్రస్తుత పరిస్థితి చూసి కాంగ్రెస్‌కు ఓటేసినందుకు రైతులు, జనాలు ఇప్పుడు తీవ్రంగా బాధపడుతున్నారని తన మనసులోని మాటను పంచుకున్నాడు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Ukrainian Drones | రష్యాపై మరోసారి డ్రోన్ల దాడి
- ●India-America Defense | భారత్‌కు రక్షణ సహకారం.. రూ.4,500 కోట్ల సైనిక ప్యాకేజీకి అమెరికా ఆమోదం
- ●Ai Plus Nova | ఏఐ ప్లస్ నోవా 2 నియో, నోవా 2 ప్రో 5జీ ఫోన్లు లాంచ్.. ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ..
- ●Ramchandar Rao | బీజేపీలోకి మెగాస్టార్ చిరంజీవి?
- ●Train Ticket | రైళ్లలో ఇక టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తే రెట్టింపు జరిమానా.. జూలై 1 నుంచి కొత్త రూల్స్..
- ●Uttar Pradesh | పోర్న్ వీడియోలు చూసి.. 9 నెలల పసికందుపై అత్యాచారం

Ukrainian Drones | రష్యాపై మరోసారి డ్రోన్ల దాడి

India-America Defense | భారత్‌కు రక్షణ సహకారం.. రూ.4,500 కోట్ల సైనిక ప్యాకేజీకి అమెరికా ఆమోదం

Ai Plus Nova | ఏఐ ప్లస్ నోవా 2 నియో, నోవా 2 ప్రో 5జీ ఫోన్లు లాంచ్.. ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ..

Ramchandar Rao | బీజేపీలోకి మెగాస్టార్ చిరంజీవి?






