Harish Rao | పీఎంయూ టెండర్లను తక్షణమే రద్దు చేయాలి
Harish Rao | గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో సరుకుల సరఫరా కోసం తెచ్చిన, అవినీతిమయమైన కేంద్రీకృత పీఎంయూ టెండర్లను రేవంత్ ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలి అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
రేవంత్ సర్కార్‌కు డిమాండ్ చేసిన హరీశ్‌రావు
Harish Rao | త్రినేత్ర న్యూస్ : గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో సరుకుల సరఫరా కోసం తెచ్చిన, అవినీతిమయమైన కేంద్రీకృత పీఎంయూ టెండర్లను రేవంత్ ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలి అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు డిమాండ్ చేశారు. గతంలో లాగా డిస్ట్రిక్ట్ పర్చేస్ కమిటీ ద్వారా పాఠశాలనే ఒక యూనిట్‌గా పరిగణించి స్థానిక వెండర్లకే నిత్యావసర సరుకుల సరఫరా బాధ్యతలు అప్పగించాలన్నారు. దీనివల్ల ఉపాధి కోల్పోతున్న వేలమంది చిరు వ్యాపార కుటుంబాల భవిష్యత్తు నిలబడటంతో పాటు పేద విద్యార్థులకు నాణ్యమైన తాజా సరుకులు అందుతాయని హరీశ్‌రావు పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారు?
ప్రభుత్వ పెద్దల కమీషన్ల కక్కుర్తి కోసం గతంలో తెలంగాణ సివిల్ సప్లైస్ లో డిపాజిట్ జప్తునకు గురై బ్లాక్‌లిస్టులో పడ్డ సంస్థకు రూ. 800 కోట్ల టెండర్‌ను ఎలా కట్టబెడతారు? నిబంధనలకు విరుద్ధంగా తెరవెనుక సబ్ కాంట్రాక్టులు ఇస్తూ జిల్లాకు రూ. 2 కోట్ల చొప్పున రూ. 66 కోట్ల గుడ్‌విల్, ప్రతినెల బిల్లుల్లో 20 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆధారాలతో సహా బయటపడింది. అమీర్‌పేటలోని ప్రైవేట్ కార్యాలయం కేంద్రంగా ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి చక్రం తిప్పుతుంటే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అని మాజీ మంత్రి నిలదీశారు.

ఎవరి జేబులు నింపడానికి బలవంతంగా రుద్దుతున్నారు?
ఇదే తరహా కేంద్రీకృత విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయాలని చూస్తే మూడు నెలల్లోనే అట్టర్‌ఫ్లాప్ అయి అక్కడి ప్రభుత్వం రద్దు చేసి పాత పద్ధతినే పునరుద్ధరించింది. అలాంటి విఫలమైన విధానాన్ని ఇక్కడ ఎవరి జేబులు నింపడానికి బలవంతంగా రుద్దుతున్నారు? స్థానిక వెండర్ల రేట్ల కంటే 35 నుంచి 45 శాతం అధిక ధరలకు కాంట్రాక్టు ఖరారు చేసినా నేటికీ సరుకులు ఇవ్వలేని చేతకానితనం కాంగ్రెస్ సర్కార్‌ది. రాష్ట్రంలో దాదాపు 4 వేల హాస్టళ్లు ఉంటే కేవలం 280 కేంద్రాలకే బ్రాండ్, బిల్లు, ఎక్స్‌పైరీ డేట్ లేని నాసిరకం సరుకులు పంపడం దుర్మార్గం అని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
స్థానిక వెండర్ల ద్వారా పాత విధానాన్ని పునరుద్ధరించాలి
గతంలో యూనిఫాంలు, నోట్‌బుక్కుల కొనుగోళ్లలో వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు.. ఇప్పుడు పేద విద్యార్థుల కడుపు నింపే నిత్యావసర సరుకులపైనా 20 శాతం కమీషన్ల దందాకు తెగబడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి వీడి పీఎంయూ టెండర్లను రద్దు చేసి, స్థానిక వెండర్ల ద్వారా పాత విధానాన్ని పునరుద్ధరించాలి. లేదంటే రోడ్డున పడ్డ వేలమంది కుటుంబాలు, విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది అని హరీశ్‌రావు హెచ్చరించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Rukmini Vasanth | వరుసగా ఎనిమిది ఫ్లాప్‌లు - అయినా ఛాన్స్‌లు - హీరో నాని ప్రేమకథలో రుక్మిణి వసంత్
- ●Manchireddy Kishan Reddy | రేవంత్! రైతులను ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తవ్?
- ●ICC Player of the Month September 2026 | ఐసీసీ అవార్డుల్లో భారత స్టార్ల క్లీన్‌స్వీప్: రికార్డు స్థాయిలో 5వ సారి శుభ్‌మన్‌కు కిరీటం.. అదరగొట్టిన షఫాలీ వర్మ
- ●South Korea Stock Market | దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్లో భారీ పతనం.. భారత్‌కు లాభమా?
- ●Palle Rvikumar | రాహుల్ గాంధీ డిశ్చార్జ్ పిటిషన్ వేసుకుంటే తప్పులేదు..కానీ కేటీఆర్ వేసుకుంటే తప్పైతదా?
- ●Telangana | తెలంగాణలో గ్రానైట్ రాయల్టీ ఫీజులపై ప్రభుత్వం కీలక నిర్ణయం

Rukmini Vasanth | వరుసగా ఎనిమిది ఫ్లాప్‌లు - అయినా ఛాన్స్‌లు - హీరో నాని ప్రేమకథలో రుక్మిణి వసంత్

Manchireddy Kishan Reddy | రేవంత్! రైతులను ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తవ్?

ICC Player of the Month September 2026 | ఐసీసీ అవార్డుల్లో భారత స్టార్ల క్లీన్‌స్వీప్: రికార్డు స్థాయిలో 5వ సారి శుభ్‌మన్‌కు కిరీటం.. అదరగొట్టిన షఫాలీ వర్మ

South Korea Stock Market | దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్లో భారీ పతనం.. భారత్‌కు లాభమా?




