త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dev Ji | ఇంటర్‌లోనూ పాసైన మాజీ మావోయిస్ట్ దేవ్‌‌జీ.. తెలుగులో ఎన్ని మార్కులంటే..?

Dev Ji | ఐదేళ్ల లా కోర్సు ఫ‌లితాల్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్ర‌నేత తిప్పిరి తిరుప‌తి అలియాస్ దేవ్‌జీ ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాల్లోనూ ప్ర‌తిభ చాటారు.

S

Telangana | Published On Jun 11, 2026, 6.16 pm IST

Dev Ji | ఇంటర్‌లోనూ పాసైన మాజీ మావోయిస్ట్ దేవ్‌‌జీ.. తెలుగులో ఎన్ని మార్కులంటే..?
Advertisement

Dev Ji | త్రినేత్ర‌.న్యూస్ : ఐదేళ్ల లా కోర్సు ఫ‌లితాల్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్ర‌నేత తిప్పిరి తిరుప‌తి అలియాస్ దేవ్‌జీ ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాల్లోనూ ప్ర‌తిభ చాటారు. 43 ఏండ్ల విరామం తర్వాత ఇంట‌ర్ బోర్డు అధికారుల ప్ర‌త్యేక అనుమ‌తితో ఇంట‌ర్ సెకండియ‌ర్ తెలుగు ప‌రీక్ష‌ను మే 13న రాశారు దేవ్ జీ. గురువారం విడుద‌లైన ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షా ఫ‌లితాల్లో తెలుగు ప‌రీక్ష‌లో 72 మార్కుల‌తో దేవ్ జీ ఉత్తీర్ణ‌త సాధించారు. ఇంటర్‌లో మొత్తం 614 మార్కులు సాధించారు. ఇటీవల లాసెట్‌లోనూ ఆయన 349వ ర్యాంక్ సాధించడం విశేషం. 43 ఏండ్ల విరామం తర్వాత పరీక్ష హాలులో అడుగు పెట్టిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఇంటర్‌ పరీక్ష రాసేందుకు వచ్చినట్టు తెలిపారు.

Advertisement
Advertisement