Methuku Anand | ప్రాణహిత-చేవెళ్లతో వెయ్యేండ్లయినా వికారాబాద్‌కు నీళ్లు రావ్: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
Methuku Anand | వెయ్యి ఏండ్లయినా ప్రాణహిత, చేవెళ్ల ద్వారా వికారాబాద్ కు నీళ్లు రావని, పాలమూరు, రంగారెడ్డి పూర్తి అయితే ఒక్కో నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగు నీరు వస్తుందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు
- ఒక్క కొడంగల్ కే ముఖ్యమంత్రి లాగా రేవంత్ వ్యవహరిస్తున్నారు
- వికారాబాద్ నుంచే మరో ఉద్యమం స్టార్ట్ అవుతది
- వికారాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై స్పీకర్ స్పందించాలి
- సీఎం, స్పీకర్ ఉంటే మేలు జరుగుతదనుకున్నం
- రేవంత్ రెడ్డిని వరస్ట్ సీఎంగానే ప్రజలు గుర్తుంచుకుంటరు
- ఎమ్మెల్యేలను, సీఎంను తరిమికొట్టే రోజులు వస్తయ్
- మీడియా సమావేశంలో కాంగ్రెస్ సర్కార్‌పై మెతుకు ఆనంద్ ధ్వజం
Methuku Anand | త్రినేత్ర.న్యూస్: వెయ్యి ఏండ్లయినా ప్రాణహిత, చేవెళ్ల ద్వారా వికారాబాద్ కు నీళ్లు రావని, పాలమూరు, రంగారెడ్డి పూర్తి అయితే ఒక్కో నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగు నీరు వస్తుందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. సీఎం, స్పీకర్ మా జిల్లాలోనే ఉంటే మాకు మేలు జరుగుతుందని భావించామన్నారు. కానీ రేవంత్ రెడ్డి, అనుముల బ్రదర్స్ దృష్టి అంతా భూములపై ఉందని విమర్శించారు. కేసీఆర్ ను బెస్ట్ సీఎంగా ప్రజలు గుర్తుంచుకుంటే రేవంత్ రెడ్డి వరెస్ట్ సీఎంగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తన గురువు చంద్రబాబుకు సాయం చేస్తున్నారు..
వికారాబాద్ జిల్లాలో సీఎం, అసెంబ్లీ స్పీకర్ ఉన్నారు. మా జిల్లాకు మేలు జరుగుతుందని భావించాం. రెండున్నరేళ్లు గడిచిపోయాయి. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ గురువు చంద్రబాబుకు సహాయం చేస్తున్నారు. కొడంగల్ కు నారాయణపేట్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు తీసుకువస్తామని సీఎం చెప్పారు. జిల్లాలో మిగిలిన మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు నీళ్లు వద్దా?
వెయ్యి ఏండ్లు అయినా ప్రాణహిత, చేవెళ్ల ద్వారా వికారాబాద్ కు నీళ్లు రావు అని ఆనంద్ వ్యాఖ్యానించారు.
ధాన్యం కొనుగోళ్లపై స్పీకర్ మాట్లాడాలి..
ఒక్క కొడంగల్ కు ముఖ్యమంత్రి లాగా సీఎం వ్యవహరిస్తున్నారు. వికారాబాద్ నుంచే మరో ఉద్యమం స్టార్ట్ అవుతుంది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. వికారాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై స్పీకర్ స్పందించాలి. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పాదయాత్ర చేస్తుందంటేనే సీఎం ఎమ్మెల్యేలతో రివ్యూ చేశారు. వికారాబాద్ రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి బీఆర్ఎస్ హయాంలో సాంక్షన్ అయింది. దాన్ని వెంటనే పూర్తి చేయాలి.
ఎన్ని రోడ్లు వేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి..
రేవంత్ రెడ్డి, అనుముల బ్రదర్స్ దృష్టి అంతా భూములపై ఉంది. వికారాబాద్ లో కాంగ్రెస్ నేతలు భూములు కొల్లగొడుతున్నారు. వికారాబాద్ లో తాగు నీటి సమస్య ఉంది. పక్క దేశాల్లో పాలకులను తరిమికొట్టినట్లు తెలంగాణలోను అదే పరిస్థితి వచ్చేటట్లు ఉంది. తెలంగాణలో ఎమ్మెల్యేలను, సీఎంను ప్రజలు తరిమికొట్టే రోజు వస్తుంది. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యం దారుణంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాఫ్ ముఖ్యమంత్రిగా నిలుస్తారు. కేసీఆర్ ను బెస్ట్ సీఎంగా ప్రజలు గుర్తు ఉంచుకుంటారు. రేవంత్ రెడ్డిని వరెస్ట్ సీఎంగా ప్రజలు గుర్తు ఉంచుకుంటారు. వికారాబాద్ లో ఎన్ని రోడ్లు వేశారో స్పీకర్ శ్వేతపత్రం రిలీజ్ చేయాలి అని మెతుకు ఆనంద్ డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






