Ethics Committee | కడియంపై వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు
Ethics Committee | హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి (Padi Kaushik Reddy) అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ (Ethics Committee) నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై (Kadiyam Srihari) చేసిన అనైతిక ప్రవర్తిన, అనుచిత వ్యాఖ్యలపై ఈ నెల 29న అసెంబ్లీ కమిటీ హాల్–1లో ఉదయం 11 గంటలకు ఎథిక్స్ కమిటీ విచారణ జరుపనుంది.
Ethics Committee | త్రినేత్ర.న్యూస్: హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి (Padi Kaushik Reddy) అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ (Ethics Committee) నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై (Kadiyam Srihari) చేసిన అనైతిక ప్రవర్తిన, అనుచిత వ్యాఖ్యలపై ఈ నెల 29న అసెంబ్లీ కమిటీ హాల్–1లో ఉదయం 11 గంటలకు ఎథిక్స్ కమిటీ విచారణ జరుపనుంది. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదుపై కమిటీ విచారించనున్నది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కౌశిక్ రెడ్డి.. సీనియర్ ఎమ్మెల్యే అయిన కడియం శ్రీహరిపై వ్యాఖ్యలు, ప్రవర్తించిన తీరుపై అధికారపక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఈ వ్యవహారాన్ని సమగ్ర విచారణ కోసం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎథిక్స్ కమిటీకి సమీక్షకు పంపారు. దీంతో శాసన సభ కార్యదర్శి రేండ్ల తిరుపతి ఎథిక్స్ కమిటీ సమావేశానికి సంబంధించి అధికారిక ప్రకటన జారీచేశారు.
కమిటీ చైర్మన్, సభ్యులందరూ తప్పనిసరిగా హాజరై, సభా మర్యాదలను కాపాడే దిశగా కీలక చర్చలు జరిపి చర్యలను ప్రతిపాదించాలని ఆ లేఖలో కోరారు. ఈ వివాదంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి, నిబంధనల ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాలో సిఫారసు చేయనుంది. దీంతో ఈ సమావేశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది.
కాగా, ఈ నోటీసులపై బీఆర్‌ఎస్ (BRS) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఎథిక్స్ కమిటీ పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని విమర్శించింది. కౌశిక్ రెడ్డిని రాజకీయంగా బలిచేసేందుకే ఈ కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు.
సంబంధిత వార్తలు

Vemula Prashanth Reddy | ఎథిక్స్ గురించి మాట్లాడే అర్హత సీఎంకు ఉందా..?
ఆగస్టు 26, 2026

Graduates’ MLC Elections | పట్టభద్రుల ఎమ్మెల్సీ బరి.. రాకేశ్‌రెడ్డి వర్సెస్ గడల శ్రీనివాస్, పీవీ శ్రీనివాస్‌రావు!
ఆగస్టు 25, 2026

Harish Rao | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ దుష్ప్రచారానికి NDSA, CWPRS నివేదికలు చెంపపెట్టు : హరీశ్ రావు
ఆగస్టు 25, 2026
తాజావార్తలు
- ●Tollywood | ఇండియన్ టాప్ 100 సెలిబ్రిటీస్ లిస్ట్‌లో అల్లు అర్జున్ , రామ్‌చరణ్ - టాలీవుడ్ నుంచి ఇద్దరికే చోటు!
- ●Chinas monster dam | నేపాల్ తరహాలో.. భారత్‌కు పొంచి ఉన్న చైనా "వాటర్ బాంబ్"
- ●ACB Raids | భూపాలపల్లి మైన్స్ ఏడీ ఇంట్లో ఏసీబీ రైడ్స్.. భారీగా ఆస్తులు..
- ●WhatsApp | వాట్సాప్ యూజర్లకు కొత్త సెక్యూరిటీ ఫీచర్లు.. ఇక అకౌంట్ మరింత సేఫ్..
- ●Ranabaali Movie | దసరా రేసులో విజయ్, రష్మిక ‘రణబాలి’ - రిలీజ్ డేట్ కన్ఫామ్
- ●Nepal Floods | నేపాల్‌లో వరద బీభత్సం... వీడియోలు

Tollywood | ఇండియన్ టాప్ 100 సెలిబ్రిటీస్ లిస్ట్‌లో అల్లు అర్జున్ , రామ్‌చరణ్ - టాలీవుడ్ నుంచి ఇద్దరికే చోటు!

Chinas monster dam | నేపాల్ తరహాలో.. భారత్‌కు పొంచి ఉన్న చైనా "వాటర్ బాంబ్"

ACB Raids | భూపాలపల్లి మైన్స్ ఏడీ ఇంట్లో ఏసీబీ రైడ్స్.. భారీగా ఆస్తులు..

WhatsApp | వాట్సాప్ యూజర్లకు కొత్త సెక్యూరిటీ ఫీచర్లు.. ఇక అకౌంట్ మరింత సేఫ్..



