త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | ట్ర‌క్ పార్కు వేలం ర‌ద్దు చేయాల్సిందే

Harish Rao | ట్రక్ పార్క్ వేలాది మంది ప్రజల జీవితాలు, జీవనోపాధితో ముడిపడి ఉన్న అంశం అని బీఆర్ఎస్ఎల్పీ నేత హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. ట్ర‌క్ పార్కు వేలం ర‌ద్దు చేయాల్సిందేన‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

S

Telangana | Published On Nov 25, 2026, 1.18 pm IST

Harish Rao | ట్ర‌క్ పార్కు వేలం ర‌ద్దు చేయాల్సిందే
Advertisement

ఆ పార్కుతో వేలాది మందికి జీవనోపాధి
అరెస్టు చేసిన నేత‌ల‌ను విడుద‌ల చేయాలి
బీఆర్ఎస్ఎల్పీ నేత హ‌రీశ్‌రావు డిమాండ్

Harish Rao | త్రినేత్ర న్యూస్ : ట్రక్ పార్క్ వేలాది మంది ప్రజల జీవితాలు, జీవనోపాధితో ముడిపడి ఉన్న అంశం అని బీఆర్ఎస్ఎల్పీ నేత హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. ట్ర‌క్ పార్కు వేలం ర‌ద్దు చేయాల్సిందేన‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడవద్దని ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం రద్దు చేయాలని కోరుతూ హెచ్‌ఎండీఏ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చిన అఖిలపక్ష నాయకులపై పోలీసులను ప్రయోగించి, అరెస్టులు చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని పేర్కొన్నారు. అరెస్టు చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సహా ఇతర అఖిలపక్ష నేతలను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజాప్రతినిధులు, నాయకులపై నిర్బంధాలు ప్రయోగించడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం. ప్రజా పాలన అంటూ, ఇందిరమ్మ రాజ్యం అంటూ నిరంకుశ పాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి తీరును యావత్ తెలంగాణ సమాజం గమనిస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రభుత్వ భూములను విక్రయించవద్దని జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ నీతులు చెబుతుంటే, రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకు పూర్తి విరుద్ధంగా భూముల వేలం నిర్వహించడం సిగ్గుచేటు. ఈ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ తక్షణమే జోక్యం చేసుకోవాలని, ఇష్టం ఉన్నట్లు ప్రభుత్వ భూములను అమ్ముతున్న రేవంత్ రెడ్డికి తగిన బుద్ది చెప్పాలని కోరుతున్నామ‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

అరెస్టు చేసిన అఖిల పక్షం నాయకులను వెంటనే విడుదల చేయాలని, ఈ నెల 27న జరగనున్న ట్రక్ పార్క్ భూముల వేలాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గేవరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హ‌రీశ్‌రావు హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement