త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tummala Nageswara Rao | వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో భారీ పెట్టుబడులే లక్ష్యం: మంత్రి తుమ్మల

Tummala Nageswara Rao | రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు (Tummala Nageswara Rao) పిలుపునిచ్చారు. వ‌చ్చె నెల‌లో ఫ్యూచ‌ర్‌సిటీ వేదిక‌గా జ‌రుగ‌నున్న గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొని తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలన్నారు.

G

Telangana | Published On Nov 25, 2026, 1.29 pm IST

Tummala Nageswara Rao | వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో భారీ పెట్టుబడులే లక్ష్యం: మంత్రి తుమ్మల
Advertisement

Tummala Nageswara Rao | త్రినేత్ర న్యూస్‌: రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు (Tummala Nageswara Rao) పిలుపునిచ్చారు. వ‌చ్చె నెల‌లో ఫ్యూచ‌ర్‌సిటీ వేదిక‌గా జ‌రుగ‌నున్న గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొని తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలన్నారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా స‌చ్చివాల‌యంలో గ్లోబ‌ల్ స‌మ్మిట్ స‌న్నాహ‌క స‌మావేశం నిర్వ‌హించారు. వ‌ర్చువ‌ల్‌గా జ‌రిగిన ఈ స‌మావేశంలో వివిధ కంపెనీల ప్ర‌తినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. తెలంగాణలో వ్యవసాయం, ఆహార శుద్ధి పరిశ్రమల రంగాల్లో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను, పెట్టుబడిదారులకు అందుబాటులో ఉన్న అవకాశాలను తెలియజేశారు.

వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు కల్పించడంతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా రైతులకు మెరుగైన ఆదాయం లభించడంతో పాటు యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు.

Advertisement
Advertisement