త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ప్రజా సమస్యలపై గొంతెత్తిన వారిని పోలీసులతో అణచివేయాలని చూడటం సిగ్గుచేటు: కేటీఆర్‌

KTR | ప్రజా సమస్యలపై గొంతెత్తిన ప్రజాప్రతినిధులను పోలీసులతో అణచివేయాలని చూడటం సిగ్గుచేటని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. అరెస్టులతో ప్రజల గొంతును నొక్కలేర‌ని చెప్పారు.

G

Hyderabad | Published On Nov 25, 2026, 1.43 pm IST

KTR | ప్రజా సమస్యలపై గొంతెత్తిన వారిని పోలీసులతో అణచివేయాలని చూడటం సిగ్గుచేటు: కేటీఆర్‌
Advertisement

KTR | త్రినేత్ర న్యూస్‌: ప్రజా సమస్యలపై గొంతెత్తిన ప్రజాప్రతినిధులను పోలీసులతో అణచివేయాలని చూడటం సిగ్గుచేటని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. అరెస్టులతో ప్రజల గొంతును నొక్కలేర‌ని చెప్పారు. బీఆర్ఎస్ నేత‌లు స‌హా అరెస్టు చేసిన నాయ‌కులంద‌రినీ త‌క్ష‌ణమే విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. కూకట్‌పల్లి ట్రక్ పార్క్ (Kukatpally Truck Park) భూములు వేలాది మంది లారీ డ్రైవర్లు, రవాణా కార్మికులు, చిరు వ్యాపారుల జీవనోపాధితో ముడిపడి ఉన్న ప్రజా ఆస్తి అని చెప్పారు. ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని ఎక్స్ వేదిక‌గా డిమాండ్ చేశారు.

`‘కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపిన అఖిలపక్ష నాయకులను అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం. ప్రజా సమస్యలపై గొంతెత్తిన ప్రజాప్రతినిధులను పోలీసులతో అణచివేయాలని చూడటం సిగ్గుచేటు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సహా అరెస్ట్ చేసిన అఖిలపక్ష నాయకులందరినీ తక్షణమే బేషరతుగా విడుదల చేయాలి. కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూములు వేలాది మంది లారీ డ్రైవర్లు, రవాణా కార్మికులు, చిరు వ్యాపారుల జీవనోపాధితో ముడిపడి ఉన్న ప్రజా ఆస్తి. నగర అవసరాలకు ఉపయోగపడాల్సిన ఈ భూములను వేలం వేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నది.

ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తులు. వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే తప్ప, ఇష్టానుసారంగా అమ్మి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించడం కాదు. ఈ నెల 27న జరగనున్న ట్రక్ పార్క్ భూముల వేలాన్ని వెంటనే రద్దు చేయాలి. ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలి. అరెస్ట్‌లతో ప్రజల గొంతును నొక్కలేరు. ప్రజా ఆస్తుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ అఖిలపక్షాలతో కలిసి పోరాటం కొనసాగిస్తుంది. వేలం రద్దు చేసే వరకు వెనక్కి తగ్గేది లేదు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Advertisement
Advertisement