త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Engineering Colleges Fees | ఇంజినీరింగ్ కోర్సులు.. ఫీజు రూ.ల‌క్ష దాటిన కాలేజీలు..

Engineering Colleges Fees | ప్ర‌స్తుత విద్యా సంవ‌త్స‌రం మ‌రికొన్ని రోజుల్లో ముగియ‌నుంది. ఇంట‌ర్ పూర్తి చేసిన విద్యార్థులు ఉన్న‌త విద్య‌వైపు అడుగులు వేయ‌నున్నారు. ప్ర‌ధానంగా ఇంజినీరింగ్ (B.E/B.Tech), మెడిక‌ల్, అగ్రిక‌ల్చ‌ర్‌, డిగ్రీ కోర్సుల‌నే అత్య‌ధికులు ఎంచుకుంటారు.

G

Telangana | Published On Apr 13, 2026, 6.12 am IST

Engineering Colleges Fees | ఇంజినీరింగ్ కోర్సులు.. ఫీజు రూ.ల‌క్ష దాటిన కాలేజీలు..
Advertisement

Engineering Colleges Fees | త్రినేత్ర‌.న్యూస్‌: ప్ర‌స్తుత విద్యా సంవ‌త్స‌రం మ‌రికొన్ని రోజుల్లో ముగియ‌నుంది. ఇంట‌ర్ పూర్తి చేసిన విద్యార్థులు ఉన్న‌త విద్య‌వైపు అడుగులు వేయ‌నున్నారు. ప్ర‌ధానంగా ఇంజినీరింగ్ (B.E/B.Tech), మెడిక‌ల్, అగ్రిక‌ల్చ‌ర్‌, డిగ్రీ కోర్సుల‌నే అత్య‌ధికులు ఎంచుకుంటారు. డిగ్రీ మిన‌హా మిగిలిన కోర్సుల‌కు ప్ర‌వేశాల కోసం ప్ర‌వేశ ప‌రీక్ష రాయాల్సిందే. వాటిలో వ‌చ్చే ర్యాంకు ఆధారంగా కాలేజీల‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆయా కాలేజీల్లో విద్యా బోధ‌న‌, ల్యాబ్‌, క్యాంప‌స్ ప్లేస్‌మెంట్స్ వంటివి ప్ర‌ధానం. వారు అందించే స‌దుపాయాల‌ను బ‌ట్టి ఫీజులు (tuition-fees) ఉంటాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్ కాలేజీల్లో ఈ ఫీజుల (Engineering Colleges Fees) విష‌యంలో చాలా వ్య‌త్యాసం ఉంటుంది. ఒక్కో కాలేజీలో ఒక్కోవిధంగా ట్యూష‌న్ ఫీజు ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఇటీవ‌ల 160 కాలేజీల‌కు కొత్త ట్యూష‌న్ ఫీజుల‌ను నిర్ధారించింది. వాటిలో 33 ఇంజినీరింగ్ కాలేజీల్లో రూ.లక్షకు పైగా.. 2 కళాశాలలకు రూ.లక్షగా ఫీజును నిర్ణయించారు. ఇవి 2025-28 బ్లాక్‌ పీరియడ్‌కు వర్తిస్తాయి. గత బ్లాక్‌ పీరియడ్‌లో ఫీజు రూ.లక్ష దాటిన కాలేజీల సంఖ్య‌లో ఎలాంటి మార్పూ లేన‌ప్ప‌టికీ, రూ.లక్ష ఉన్న కళాశాలల సంఖ్య అప్పట్లో 7 కాగా ఇప్పుడు అది 2కి తగ్గింది.

ఇక అత్యధికంగా సీబీఐటీకి ఫీజు రూ.1.83 లక్షలుగా నిర్ణయించారు. వాసవి కళాశాల రూ.1.75 లక్ష, ఎంజీఐటీ రూ.1.67 లక్షలు, సీవీఆర్‌ రూ.1.63 లక్షలు, నారాయణమ్మ రూ.1.62 లక్షలు, గోకరాజు రూ.1,60,500 చొప్పున ఉన్నాయి. ఈ ఫీజులు ప్ర‌స్తుత విద్యా సంవ‌త్స‌రం నుంచే వ‌ర్తించ‌నున్నాయి. అంటే 2025-26, 2026-27, 2027-28 విద్యా సంవత్సరాల్లో బీటెక్‌ ఫస్టియర్‌లో చేరినవారు ఈ ఫీజులు చెల్లించ‌ల్సి ఉంటుంది. ఆ విద్యార్థులు నాలుగేండ్ల‌పాటు అంతే మొత్తంలో ఫీజులు క‌ట్టాలి. కాగా, ఫీజు రీయింబ‌ర్స్‌మెంటు బ‌కాయిల నేప‌థ్యంలో వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి విద్యార్థులే కాలేజీల‌కు ఫీజులు చెల్లించాల‌ని హైకోర్టులు ఇటీవ‌ల ఆదేశాలు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఆయా మొత్తాన్ని ప‌భ్రుత్వం చెల్లించ‌న త‌ర్వాత ఆ డ‌బ్బును కాలేజీలు విద్యార్థుల‌కు తిరిగి ఇచ్చేయాల‌ని స్ప‌ష్టం చేసింది.

ఏ కాలేజీలో ఎంత ఫీజు అంటే..

  • సీబీఐటీ- రూ.1.83 లక్షలు
  • వాసవి- రూ.1.75 లక్షలు
  • ఎంజీఐటీ- రూ.1.67 లక్షలు
  • సీవీఆర్‌- రూ.1.63 లక్షలు
  • నారాయణమ్మ- రూ.1.62 లక్షలు
  • గోకరాజు రంగరాజు ఇన్‌స్టిట్యూట్ (GRRR)- రూ.1,60,500
  • వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్ (VJEC)- రూ.1,59,600
  • బీవీ రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BVRI)- రూ.1,46,600
  • కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (KITS)- రూ.₹1,46,200
  • ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ- రూ.1,43,800
  • బీవీఆర్ఐటీ మహిళా ఇంజినీరింగ్ కాలేజీ (BVRIT)- రూ.1,43,500
  • శ్రీదేవి మహిళా ఇంజినీరింగ్ కాలేజీ (SDEW)- రూ.1,37,000
  • శ్రీనిధి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్‌ టెక్నాలజీ (SNIS)- రూ.1,33,000
  • కేశవ్ మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్ (KMIT)- రూ.1,29,200
  • గురు నానక్ ఇన్‌స్టిట్యూషన్స్ టెక్నికల్ క్యాంపస్ (GURU)- రూ.1,29,000
  • ముఫకం జా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (MJ)- రూ.1,25,000
  • విజ్ఞాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VGNT)- రూ.1,23,000
  • గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (GCTC)- రూ.1,21,000
  • శ్రీ ఇందు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్- రూ.1,15,000
  • ఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ (SRHP)- రూ.1,11,000
  • ఏస్ ఇంజనీరింగ్ కాలేజీ (ACEG)- రూ.1,10,000
  • జేబీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ (JBIT)- రూ.1,10,000
  • శ్రేయస్ ఇన్‌స్టిట్యూట్ (SRYS)- రూ.1,06,000
  • వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (VAGE)- రూ.1,05,000
  • విజ్ఞాన భారతి ఇన్‌స్టిట్యూట్ (VBIT): ₹1,03,200
  • టీకేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (TKRC)- రూ.1,02,900
  • శ్రీ దత్తా ఇన్‌స్టిట్యూట్ (SDES)- రూ.1,01,100
  • లార్డ్స్ ఇన్‌స్టిట్యూట్ (LRDS)- రూ.1,00,100
  • మాతృశ్రీ ఇంజినీరింగ్ కాలేజీ (MECS)- రూ.1,00,000
  • గేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (GATE)- రూ.1,00,000
Advertisement
Advertisement