త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG EAPCET | టీజీ ఎప్‌సెట్ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ప్రారంభం.. ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబ‌ర్ త‌ప్ప‌నిస‌రి..!

TG EAPCET 2026 | మీరు ఇంట‌ర్( Inter ) చ‌దువుతున్నారా..? అయితే త‌దుప‌రి ఇంజినీరింగ్( Engineering ) లేదా అగ్రిక‌ల్చ‌ర్( Agriculture ), ఫార్మ‌సీ కోర్సుల్లో చేర‌డ‌మే ఆల‌స్యం. ఈ కోర్సుల్లో చేరేందుకు ప్ర‌తిఏటా నిర్వ‌హించే టీజీ ఎప్‌సెట్( TG EAPCET ) ప్ర‌వేశ ప‌రీక్ష‌కు సంబంధించి ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ నేటి నుంచి ప్రారంభ‌మైంది. ద‌ర‌ఖాస్తు నింపే క్ర‌మంలో కావాల్సిన వివ‌రాలు ఏంటో తెలుసుకుందాం.

S

Telangana | Published On Feb 19, 2026, 2.31 pm IST

TG EAPCET | టీజీ ఎప్‌సెట్ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ప్రారంభం.. ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబ‌ర్ త‌ప్ప‌నిస‌రి..!
Advertisement

TG EAPCET | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రిక‌ల్చ‌ర్, ఫార్మ‌సీ కాలేజీల్లో ప్ర‌వేశాల నిమిత్తం నిర్వ‌హించే టీజీ ఎప్‌సెట్ -2026( TG EAPCET ) ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ ఆన్‌లైన్‌లో ప్రారంభ‌మైంది. గురువారం ఉద‌యం 11.30 గంట‌ల నుంచి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తున్నారు. ఈ ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ ఏప్రిల్ 4వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. అయితే ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసే స‌మ‌యంలో ఇంట‌ర్ హాల్ టికెట్ నంబ‌ర్‌తో పాటు ఆధార్ నంబ‌ర్, ఈమెయిల్ ఐడీ( Email ID ), మొబైల్ నంబ‌ర్( Mobile Number ) త‌ప్ప‌నిస‌రి అని టీజీ ఎప్‌సెట్ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుప‌రిచారు. ద‌ర‌ఖాస్తు నింపే స‌మ‌యంలో ఏయే వివ‌రాలు అడుగుతున్నారో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

స్టెప్ -1

  • స్టెప్ -1 లో భాగంగా మొద‌ట రిజిస్ట్రేష‌న్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
  • ఈ ఫీజు చెల్లించే స‌మ‌యంలో మ‌నం ఇంట‌ర్‌లో చ‌దివిన కోర్సును క్లిక్ చేయాల్సి ఉంటుంది.
  • ఆ త‌ర్వాత బోర్డు వివ‌రాలు న‌మోదు చేయాలి.
  • ఇంట‌ర్ హాల్ టికెట్ నంబ‌ర్ న‌మోదు చేయాల్సి ఉంటుంది.
  • అభ్య‌ర్థి పేరు, పుట్టిన తేదీ(ఎస్సెస్సీ మెమో ప్ర‌కారం), మొబైల్ నంబ‌ర్, అల్ట‌ర్‌నేట్ మొబైల్ నంబ‌ర్, ఈమెయిల్ ఐడీ, కేట‌గిరి, పీహెచ్ వంటి వివ‌రాల‌ను న‌మోదు చేయాలి.
  • అనంత‌రం ఏ కోర్సులో ప్ర‌వేశానికి ప‌రీక్ష రాస్తున్నామో ఆ వివ‌రాల‌ను కూడా ఇవ్వాలి.
  • పేమెంట్ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకునే వెసులుబాటు క‌ల్పించారు.
  • పేమెంట్ అయిపోగానే పేమెంట్ రిఫ‌రెన్స్‌ ఐడీ క్రియేట్ అవుతుంది. ఈ ఐడీని చాలా భ‌ద్రంగా దాచుకోవాలి. త‌దుప‌రి ద‌ర‌ఖాస్తు నింపేందుకు ఈ ఐడి త‌ప్ప‌నిస‌రి.

స్టెప్ - 2

  • స్టెప్ -2 లో భాగంగా ద‌ర‌ఖాస్తును నింపాల్సి ఉంటుంది.
  • మొద‌ట‌గా పేమెంట్ రిఫ‌రెన్స్ ఐడీ, ఇంట‌ర్ హాల్ టికెట్ నంబ‌ర్, మొబైల్ నంబ‌ర్, పుట్టిన తేదీ న‌మోదు చేసి.. ప్రోసిడ్ ఫ‌ర్ అప్లికేష‌న్ అనే బ‌ట‌న్‌ను క్లిక్ చేయాల్సి ఉంటుంది.
  • అనంత‌రం ద‌ర‌ఖాస్తు న‌మోదు చేసుకునేందుకు వీలుంటుంది.
  • ఇక్క‌డ కొత్త‌గా ఆధార్ నంబ‌ర్, రేష‌న్ కార్డు నంబ‌ర్, తల్లిదండ్రుల పేర్లు న‌మోదు చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు జెండ‌ర్‌ను కూడా పేర్కొనాలి.
  • కేట‌గిరి డిటెయిల్స్ ఇవ్వ‌డంతో పాటు కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం నంబ‌ర్‌, ఆదాయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం నంబ‌ర్‌ను న‌మోదు చేయాలి.
  • అభ్య‌ర్థి యొక్క బ్యాంకు ఖాతా వివ‌రాలు కూడా న‌మోదు చేయాలి.
  • అభ్య‌ర్థి యొక్క అడ్ర‌స్‌ను నింపాలి.
  • క్వాలిఫైయింగ్ ఎగ్జామినేష‌న్ వివ‌రాల‌ను పొందుప‌ర‌చాలి. ఇందులో భాగంగా ప‌దో త‌ర‌గ‌తి విద్యార్హత‌ల‌తో పాటు ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి ఇంట‌ర్ వ‌ర‌కు ఎక్క‌డ చ‌దివార‌నే విష‌యాల‌ను కూడా న‌మోదు చేయాల్సి ఉంటుంది. లోకల్ ఏరియాను కూడా మెన్ష‌న్ చేయాలి.
  • ప్ర‌వేశ ప‌రీక్ష వివ‌రాల‌ను మ‌రోసారి ప‌రిశీలించుకోవాలి.
  • ప్ర‌వేశ ప‌రీక్ష ఎక్క‌డ రాయ‌ద‌లుచుకున్నామో ఆ కేంద్రాల‌ను ఎంపిక చేసుకోవాలి.
  • అనంత‌రం అభ్య‌ర్థి యొక్క ఫొటో, సంత‌కం అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • ఫైన‌ల్‌గా ద‌ర‌ఖాస్తును సేవ్ చేసుకోవాలి. నెక్ట్స్ అనే ఆప్ష‌న్‌ను క్లిక్ చేస్తే.. మాడిఫై, స‌బ్‌మిట్ అనే రెండు ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. ఒక వేళ ఏదైనా స‌వ‌ర‌ణ చేయాల‌నుకుంటే మాడిఫై అనే ఆప్ష‌న్‌ను క్లిక్ చేయాలి. లేదంటే స‌బ్‌మిట్ అనే ఆప్ష‌న్‌ను ఎంపిక చేసుకుని త‌మ ద‌ర‌ఖాస్తును స‌బ్‌మిట్ చేయొచ్చు.

స్టెప్ -3

  • స్టెప్ -3 లో ద‌ర‌ఖాస్తు స‌బ్‌మిట్ కాగానే ఫ్యూచ‌ర్ రిఫ‌రెన్స్ కోసం రిజిస్ట్రేష‌న్ నంబ‌ర్ జ‌న‌రేట్ అవుతుంది.
  • ఆ నంబ‌ర్‌ను నోట్ చేసుకుని, ద‌ర‌ఖాస్తును ప్రింట్ తీసుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం.. పైన చెప్పిన ప్ర‌కారం.. అన్ని వివ‌రాల‌ను ద‌గ్గ‌ర‌గా ఉంచుకొని మీ భ‌విష్య‌త్‌ను నిర్ణ‌యించే టీజీ ఎప్‌సెట్ ద‌ర‌ఖాస్తును జాగ్ర‌త్త‌గా నింపండి. ఆల్ ది బెస్ట్‌.

టీజీ ఎప్‌సెట్ ద‌ర‌ఖాస్తు కోసం ఈ వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.. https://eapcet.tgche.ac.in/Home.aspx

 

Advertisement

తాజావార్తలు

Advertisement