త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchandar Rao | ఎలాన్ మ‌స్క్ ట్వీట్‌తో మోదీపై ఉన్న ఆరోప‌ణ‌లు అబద్ద‌మ‌ని రుజువైంది: రాంచంద‌ర్‌రావు

Ramchandar Rao | ప్ర‌ధాని మోదీపై అమెరికా ఒత్తిడి ఉందంటూ చేసిన ఆరోప‌ణ‌లు అవాస్త‌వ‌మ‌ని నిన్న ఎలాన్ మ‌స్క్ (Elon Musk) చేసిన ట్వీట్‌తో రుజువైంద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాచందర్‌రావు వ్యాఖ్యానించారు.

S

Telangana | Published On Oct 9, 2026, 1.22 pm IST

Ramchandar Rao | ఎలాన్ మ‌స్క్ ట్వీట్‌తో మోదీపై ఉన్న ఆరోప‌ణ‌లు అబద్ద‌మ‌ని రుజువైంది: రాంచంద‌ర్‌రావు
Advertisement

Ramchandar Rao | త్రినేత్ర న్యూస్‌: ప్ర‌ధాని మోదీపై అమెరికా ఒత్తిడి ఉందంటూ చేసిన ఆరోప‌ణ‌లు అవాస్త‌వ‌మ‌ని నిన్న ఎలాన్ మ‌స్క్ (Elon Musk) చేసిన ట్వీట్‌తో రుజువైంద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాచందర్‌రావు వ్యాఖ్యానించారు. అదే స‌మ‌యంలో అమెరికా ఒత్తిడితోనే పాల‌న మార్పు ఉద్య‌మాన్ని రాహుల్ గాంధీ న‌డిపిస్తున్నార‌న్న విష‌యం స్ప‌ష్ట‌మైంద‌న్నారు. ఈమేర‌కు ఎక్స్ వేదిక‌గా శ‌క్ర‌వారం ఆయ‌న స్పందించారు.

ఈ దేశ ప్రజలు మూర్ఖులు కాదు. గతేడాది ఇదే కాంగ్రెస్ పార్టీ స్టార్‌లింక్‌ (Star Link) ను వ్యతిరేకిస్తూ ట్రంప్ ఒత్తిడికి మోదీ తలొగ్గారని ఆరోపణలు చేసింది. కానీ నేడు అదే స్టార్‌లింక్‌కు మద్దతుగా నిలుస్తోంది. నిన్న ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్‌తో మోదీపై అమెరికా ఒత్తిడి ఉందంటూ చేసిన ఆరోపణలు అవాస్తవమని స్పష్టమైంది అని రాంచంద‌ర్‌రావు పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా జైరాం ర‌మేశ్ ప్ర‌స్తావించిన విష‌యాల‌ను కూడా పోస్ట్ చేశారు.

అయితే స్టార్‌లింక్‌కు 165కు పైగా దేశాల్లో లైసెన్స్ ఉందని.. భారత ప్రభుత్వంలోని ప్రతి చట్టం, నిబంధనను పాటించేందుకు ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నామ‌ని.. అయినా ఇంకా లైసెన్స్ ఎందుకు ఇవ్వలేదు? అని ఎలాన్ మ‌స్క్ నిన్న పోస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. కాగా రాహుల్ గాంధీ సైతం మ‌స్క్ పోస్ట్‌ను త‌న ఎక్స్ ఖాతాలో ప్ర‌స్తావించారు.

Advertisement
Advertisement