Municipal Elections | 16న మేయర్, ఛైర్ పర్సన్ ఎన్నిక
Municipal Elections | తెలంగాణ (Telangana) మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదల కావడంతో కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీలకు ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్ ఎన్నికలను సోమవారం నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆయా పదవుల ఎన్నికకు సంబంధించి జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్ శనివారం జారీ చేశారు.
Municipal Elections | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు విడుదల కావడంతో కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాలిటీలకు ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్ ఎన్నికకు మార్గం సుగమమైంది. ఈ ఎన్నికలను సోమవారం నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆయా పదవుల ఎన్నికకు సంబంధించి జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్ శనివారం జారీ చేశారు. ఎన్నికలో పాల్గొనేందుకు ఎన్నికైన సభ్యులతో పాటు ఎక్స్అఫీషియో సభ్యులు, పార్టీల అధ్యక్షులకు సైతం సమాచారం అందించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికలను స్వేచ్ఛగా నిర్వహించేందుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని సూచించింది.
16నే ప్రమాణస్వీకారం..
ఎన్నికైన ప్రజాప్రతినిధులతో అధికారులు 16న ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి మున్సిపాలిటీలకు ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్, మున్సిపల్ కార్పొరేషన్‌లకు మేయర్, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకుంటారు. ఛైర్ పర్సన్, మేయర్ ఎన్నికలు పూర్తయిన అనంతరమే వైస్ ఛైర్ పర్సన్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఏవైనా కారణాల రీత్యా ఎన్నిక జరగకపోతే ఆ మరుసటి రోజు ఎన్నికను నిర్వహిస్తారు. చేతులెత్తే విధానంలో ఈ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే లాటరీ ద్వారా విజేతను ఎంపిక చేస్తారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



