త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Earthquake | మంచిర్యాల‌లో భూకంపం.. ప‌రుగులు తీసిన జ‌నం

Earthquake | తెలంగాణ (Telangana)లో భూకంపం (Earthquake) సంభ‌వించింది. మంచిర్యాల (Manchiryal) జిల్లాలో గురువారం ఉద‌యం భూమి ఒక్క‌సారిగా కంపించింది.

D

Telangana | Published On Feb 26, 2026, 1.10 pm IST

Earthquake | మంచిర్యాల‌లో భూకంపం.. ప‌రుగులు తీసిన జ‌నం
Advertisement

Earthquake | తెలంగాణ (Telangana)లో భూకంపం (Earthquake) సంభ‌వించింది. మంచిర్యాల (Manchiryal) జిల్లాలో గురువారం ఉద‌యం భూమి ఒక్క‌సారిగా కంపించింది. కొన్ని సెకన్ల పాటూ భూమి కంపించింది. రిక్ట‌రు స్కేలుపై భూకంపం తీవ్ర‌త 3.9గా న‌మోదైంది. తెలంగాణ‌-మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దుల్లోనూ ప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి. ఈ ప్ర‌కంప‌న‌ల‌తో ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. అయితే, భూకంపం తీవ్ర‌త స్వ‌ల్ప స్థాయిలోనే ఉండ‌టంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌లేదు. వరుస భూ ప్రకంపనలతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Also Read..

వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు

జూబ్లీహిల్స్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. ఎగ‌సిప‌డుతున్న మంట‌లు

తెలంగాణ‌లో భారీగా ఐఏఎస్ అధికారుల బ‌దిలీలు.. జీఏడీ ముఖ్య కార్య‌ద‌ర్శిగా రాహుల్ బొజ్జా

Advertisement
Advertisement