త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dussehra Holidays | బతుక‌మ్మ సంద‌డి షురూ.. రేప‌టి నుంచి స్కూళ్ల‌కు ద‌స‌రా సెల‌వులు..

Dussehra Holidays | రాష్ట్రంలో బతుక‌మ్మ, ద‌స‌రా పండుగ (Dasara Festival) సంద‌డి ప్రారంభ‌మైంది. పాఠ‌శాల‌లు, జూనియ‌ర్ కాలేజీల‌కు శ‌నివారం నుంచి సెల‌వులు (Dussehra Holidays) షురూ అవుతాయి. పాఠ‌శాల‌ల‌కు ద‌స‌రా సెల‌వులు అక్టోబర్ 10 నుంచి 22 వరకు, ఇంట‌ర్ కాలేజీల‌కు అక్టోబ‌ర్ 21 వ‌ర‌కు ఉన్నాయి.

G

Telangana | Published On Oct 9, 2026, 7.03 am IST

Dussehra Holidays | బతుక‌మ్మ సంద‌డి షురూ.. రేప‌టి నుంచి స్కూళ్ల‌కు ద‌స‌రా సెల‌వులు..
Advertisement

Dussehra Holidays | త్రినేత్ర న్యూస్‌: రాష్ట్రంలో బతుక‌మ్మ, ద‌స‌రా పండుగ (Dasara Festival) సంద‌డి ప్రారంభ‌మైంది. పాఠ‌శాల‌లు, జూనియ‌ర్ కాలేజీల‌కు శ‌నివారం నుంచి సెల‌వులు (Dussehra Holidays) షురూ అవుతాయి. పాఠ‌శాల‌ల‌కు ద‌స‌రా సెల‌వులు అక్టోబర్ 10 నుంచి 22 వరకు, ఇంట‌ర్ కాలేజీల‌కు అక్టోబ‌ర్ 21 వ‌ర‌కు ఉన్నాయి. దీంతో స్కూళ్లు ఈ నెల 23న మొత్తం 13 రోజులు, కాలేజీలు ఈ నెల 22న తిరిగి తెర‌చుకోనున్నాయి.

మరోవైపు శుక్ర‌వారంతో ఫార్మేటివ్ ప‌రీక్ష‌లు ముగియ‌నున్నాయి. శ‌నివారం నుంచి బతుక‌మ్మ (Bathukamma) ప్రారంభం కానుంది. దీంతో బ‌తుక‌మ్మ పండుగ‌ను విద్యార్థినిల‌తో క‌లిసి నిర్వ‌హించేందుకు పాఠ‌శాల‌లు సిద్ధ‌మ‌య్యాయి. పండుగ సెల‌వులు కావ‌డంతో త‌ల్లిదండ్రులతో క‌లిసి సొంతూళ్ల‌కు వెళ్లేందుకు విద్యార్థులు స‌మాయ‌త్త‌మ‌వుతున్నారు. సెల‌వుల ర‌ద్దీ నేప‌థ్యంలో ఆర్టీసీ ప్ర‌త్యేక స‌ర్వీసుల‌ను న‌డుపుతున్న‌ది.

కాగా, ద‌స‌రా సెల‌వుల స‌మ‌యంలో విద్యార్థుల‌కు ఎలాంటి స్పెష‌ల్ క్లాసులు, అద‌న‌పు బోధ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌కూడ‌ద‌ని అధికారులు ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు. అన్ని స్కూళ్లు, కాలేజీల యాజ‌మాన్యాలు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన సెల‌వుల షెడ్యూల్‌ను క‌చ్చితంగా పాటించాల‌ని సూచించారు.

Advertisement
Advertisement