Murder | కష్టపడి జీవించమన్నందుకు కన్న తండ్రిని చంపిన కొడుకు
Murder | మద్యానికి బానిసై జూలాయిగా తిరుగుతున్న కొడుకును చూసి తల్లడిల్లిన తండ్రి.. అతని జీవితం బాగుపడాలని ఆశపడ్డాడు. తాగొద్దని, కష్టపడి జీవించాలని చెప్పాడు.
Murder | త్రినేత్ర న్యూస్: మద్యానికి బానిసై జూలాయిగా తిరుగుతున్న కొడుకును చూసి తల్లడిల్లిన తండ్రి.. అతని జీవితం బాగుపడాలని ఆశపడ్డాడు. తాగొద్దని, కష్టపడి జీవించాలని చెప్పాడు. అదే అతనికి పాపమైంది. తండ్రిపై కోపం పెంచుకున్న ఆ కొడుకు.. రాయితో కొట్టి తండ్రిని చంపేశాడు (Murder). ఈ ఘటన మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా నవాబ్‌పేట మండలం దేపల్లిలో జరిగింది.
దేపల్లి గ్రామానికి చెందిన రాపోలు రాములు (55), మంగమ్మ దంపతులు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు శ్రీకాంత్ షాద్‌నగర్‌లో ఓ టైల్స్ షోరూంలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. చిన్న కొడుకు సురేందర్(22) గ్రామంలోనే ఉంటున్నాడు. అప్పుడప్పుడు కూలీ పనికి వెళ్తూ వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా పని మానేసి మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగుతూ ఊర్లో జులాయిగా తిరుగుతున్నాడు. ఖాళీగా తిరుగుతూ ఉంటే బతకడం ఎలా అని సురేందర్‌ను తండ్రి నిలదీశారు. దీంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతడు ఆవేశంతో తండ్రి (Son Killed Father ) తలపై రాయితో బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన రాములు.. అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనపై పెద్ద కుమారుడు శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- ●CEC Gyanesh Kumar | వందకు కోటి పర్సెంట్ జ్ఞానేశ్వర్ కుమార్ పదవీచ్యుతుడవుతాడు.. బల్ల గుద్ది చెప్పిన వేణు స్వామి..!
- ●SIR | సైమన్ గో బ్యాక్‌లా.. సర్ గో బ్యాక్ అనేందుకు సమయం ఆసన్నమైంది: రేవంత్‌రెడ్డి
- ●Tollywood Singer | మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిన గేమ్ ఛేంజర్ సింగర్
- ●KTR | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ గెలుస్తాం: కేటీఆర్
- ●Tollywood | కులం అనే ఇరుకు గదిలో.. ఊపిరాడక మగ్గుతున్న తెలుగు సినిమా
- ●CM Revanth Reddy | రాజకీయాల్లోకి అలా వచ్చా.. కాంగ్రెస్‌లోకి ఇలా చేరా.. రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..!

CEC Gyanesh Kumar | వందకు కోటి పర్సెంట్ జ్ఞానేశ్వర్ కుమార్ పదవీచ్యుతుడవుతాడు.. బల్ల గుద్ది చెప్పిన వేణు స్వామి..!

SIR | సైమన్ గో బ్యాక్‌లా.. సర్ గో బ్యాక్ అనేందుకు సమయం ఆసన్నమైంది: రేవంత్‌రెడ్డి

Tollywood Singer | మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిన గేమ్ ఛేంజర్ సింగర్

KTR | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ గెలుస్తాం: కేటీఆర్






