త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Murder | గోదావ‌రిఖ‌నిలో క‌త్తుల‌తో దాడి.. యువ‌కుడి హ‌త్య‌

Murder | పెద్ద‌ప‌ల్లి జిల్లాలోని గోదావ‌రిఖ‌నిలో ఆదివారం రాత్రి ఘోరం జ‌రిగింది. ఓ యువ‌కుడిని క‌త్తుల‌తో పొడిచి చంపారు. ఈ ఘ‌ట‌న‌తో సింగ‌రేణి ప్రాంత‌మంతా ఉలిక్కిప‌డింది.

S

Telangana | Published On Nov 23, 2026, 7.30 am IST

Murder | గోదావ‌రిఖ‌నిలో క‌త్తుల‌తో దాడి.. యువ‌కుడి హ‌త్య‌
Advertisement

Murder | త్రినేత్ర న్యూస్ : పెద్ద‌ప‌ల్లి జిల్లాలోని గోదావ‌రిఖ‌నిలో ఆదివారం రాత్రి ఘోరం జ‌రిగింది. ఓ యువ‌కుడిని క‌త్తుల‌తో పొడిచి చంపారు. ఈ ఘ‌ట‌న‌తో సింగ‌రేణి ప్రాంత‌మంతా ఉలిక్కిప‌డింది.

అట్ల రాజ‌శేఖ‌ర్ అనే యువ‌కుడిని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు క‌త్తుల‌తో పొడిచి చంపారు.ఈ హ‌త్యా ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన‌ట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించి.. ఆధారాలను సేకరించారు. మృతుడు సింగరేణి సంస్థలో పనిచేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మృతుడి పూర్తి వివరాలు, హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు. కాగా.. ఈ ఘటన స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది.

Advertisement
Advertisement