Murder | ప్రియుడితో ఏకాంతంగా వివాహిత.. అది చూశాడని బాలుడి హత్య
Murder | ఓ వివాహిత తన ప్రియుడితో ఏకాంతంగా ఉన్న సమయంలో ఓ బాలుడు చూశాడు. విషయం బయటకు చెబుతానని ఆ బాలుడు హెచ్చరించడంతో.. అతన్ని చంపేశారు.
Murder | త్రినేత్ర న్యూస్ : ఓ వివాహిత తన ప్రియుడితో ఏకాంతంగా ఉన్న సమయంలో ఓ బాలుడు చూశాడు. విషయం బయటకు చెబుతానని ఆ బాలుడు హెచ్చరించడంతో.. అతన్ని చంపేశారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని కల్లూరు మండల పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. చిన్నకోరుకొండి గ్రామానికి చెందిన అపర్ణకు వివాహమైంది. కానీ ఆమె భర్తకు దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ఓ యువకుడు అజయ్‌తో అపర్ణ వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అయితే సత్తుపల్లి ఎస్సీ గురుకుల పాఠశాలలో చదువుతున్న జే రవి(15) అనే బాలుడు దసరా సెలవుల నిమిత్తం చిన్నకోరుకొండి గ్రామానికి వచ్చాడు. అయితే అపర్ణ, అజయ్ సన్నిహితంగా ఉండడాన్ని రవి చూశాడు. విషయం కుటుంబ సభ్యులకు చెబుతానని రవి హెచ్చరించాడు.
దీంతో తీవ్ర ఆందోళనకు గురైన అపర్ణ, అజయ్ కలిసి.. రవిని గత నెల అక్టోబర్ 24న రహస్య ప్రాంతానికి తీసుకెళ్లారు. కూల్ డ్రింక్‌లో విష పదార్థాలు కలిపి ఇచ్చారు. కూల్ డ్రింక్ తాగిన రవి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. వరంగల్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రవి ఆదివారం ప్రాణాలు కోల్పోయాడు. దీంతో సోమవారం అపర్ణ, అజయ్‌ను పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరచగా, జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.
తాజావార్తలు
- ●Cold Waves | వణికిస్తున్న చలి.. రానున్న మూడు రోజులు జర జాగ్రత్త..!
- ●TG TET | టీజీ టెట్ నిర్వహణ తేదీ మార్పు..! ఎందుకంటే..?
- ●Yadagirigutta | యాదగిరిగుట్టలో 20 నుంచి 22 వరకు కార్తీక ఉత్సవం
- ●Horoscope | నవంబర్ 11 రాశిఫలాలు.. ఈ రాశివారికి సోదరులతో అపార్థాలు, ఊహించని ఆటంకాలు..!
- ●Bhagini Hasta Bhojanam | భగినీ హస్త భోజనం అంటే ఏమిటి? సోదరి ఇంట్లోనే సోదరుడు ఎందుకు భోజనం చేయాలి?
- ●Telangana IVF Center Raids | అండాల సేకరణ అక్రమాలపై సర్కారు ఉక్కుపాదం.. 7 ఐవీఎఫ్ కేంద్రాలకు షోకాజ్ నోటీసులు

Cold Waves | వణికిస్తున్న చలి.. రానున్న మూడు రోజులు జర జాగ్రత్త..!

TG TET | టీజీ టెట్ నిర్వహణ తేదీ మార్పు..! ఎందుకంటే..?

Yadagirigutta | యాదగిరిగుట్టలో 20 నుంచి 22 వరకు కార్తీక ఉత్సవం

Horoscope | నవంబర్ 11 రాశిఫలాలు.. ఈ రాశివారికి సోదరులతో అపార్థాలు, ఊహించని ఆటంకాలు..!






