త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

New Year Celebrations | ఓవైపు న్యూఇయర్‌ వేడుకలు.. మ‌రోవైపు జోరుగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు

G

Telangana | Published On Jan 1, 2026, 7.07 am IST

New Year Celebrations | ఓవైపు న్యూఇయర్‌ వేడుకలు.. మ‌రోవైపు జోరుగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు

సంక్షిప్త సారాంశం

New Year Celebrations | నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌ను యువ‌త ఫుల్ జోష్‌లో జ‌రుపుకున్నారు. స్నేహితులు, కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి కొత్త ఏడాదికి స్వాగ‌తం ప‌లికారు. హోరెత్తించే మ్యూజిక్‌, డ్యాన్సులు, పార్టీల‌తో న్యూ ఇయ‌ర్‌కు వెల్‌క‌మ్ చెప్పారు. మ‌రోవైపు మందుబాబుల‌ను పోలీసులు హ‌డ‌లెత్తించారు. విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌ టెస్టులు నిర్వ‌హించారు. తాగి వాహ‌నాలు న‌డిపిన వారిపై పెద్ద సంఖ్య‌లో కేసులు న‌మోదుచేశారు.

Advertisement

హైద‌రాబాద్‌: రాష్ట్ర‌వ్యాప్తంగా కొత్త ఏడాది వేడుక‌లు (New Year Celebrations) అంబ‌రాన్నంటాయి. ఆట పాట‌ల‌తో యువ‌త నూత‌న సంవ‌త్స‌రానికి (New Year) ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. మ‌హిళ‌లు, చిన్నారులు ఇండ్లు, కాల‌నీల్లో సంద‌డి చేశారు. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులతో న్యూఇయ‌ర్‌కు వెల్‌క‌మ్ చెప్పారు. హైద‌రాబాద్‌, హ‌నుమ‌కొండ‌, నిజామాబాద్‌, వ‌రంగ‌ల్‌లో కొత్త సంవ‌త్స‌రం వేడుక‌ల్లో ప్ర‌జ‌లు ఉత్సాహంగా పాల్గొన్నారు.

మ‌రోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీల‌తో (Drunk and Drive Tests) హైద‌రాబాద్ పోలీసులు మందుబాబుల‌ను హ‌డ‌లెత్తించారు. ఫుల్లుగా మందుకొట్టి రోడ్ల‌పైకి వ‌చ్చే వాహ‌దారుల‌ను విస్తృతంగా చెక్‌చేశారు. సికింద్రాబాద్‌, ప్యాట్నీ, ప్యార‌డైజ్‌, బేగంపేట‌, రాణిగంజ్‌, మారేడుప‌ల్లి, తార్నాక‌, హ‌బ్సిగూడ‌, నాచారం, మ‌ల్లాపూర్‌, మియాపూర్‌, చందాన‌గ‌ర్‌, నాంప‌ల్లి, కూక‌ట్‌ప‌ల్లి, ఎల్బీన‌గ‌ర్‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్, గ‌చ్చిబౌలి, రాయదుర్గం, ఐటీ కారిడార్‌ త‌దిత‌ర ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and Drive) ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. మాదాపూర్‌ పోలీసు స్టేషన్ పరిధిలో 15 చోట్ల, మియాపూర్ చందాన‌గ‌ర్‌లోని 4 ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో, నార్సింగి ఓఆర్ఆర్ టోల్‌గేట్‌ వద్ద, సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో మొత్తం 80 ప్రాంతాల్లో త‌నిఖీలు నిర్వ‌హించారు. తాగి వాహ‌నాలు న‌డిపిన‌వారిపై కేసులు న‌మోదుచేశారు. ప‌లు వాహ‌నాలను సీజ్ చేశారు.

న్యూఇయ‌ర్ వేడుక‌ల్లో సీఎం రేవంత్‌

నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాల్గొన్నారు. బేగంపేటలోని ఐఏఎస్‌ ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్‌లో నిర్వ‌మించిన వేడుల‌కు ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పలువురు సీనియర్ ఐఏఎస్‌ అధికారులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

కేక్ క‌ట్‌చేసిన హైద‌రాబాద్‌ సీపీ

చార్మినార్‌, సెక్ర‌టేరియ‌ట్‌, కేబీఆర్ పార్క్‌లో జ‌రిగిన న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్లో హైద‌రాబాద్ సీపీ సజ్జనార్ పాల్గొన్నారు. కేక్ క‌ట్‌చేసి కుటుంబ స‌భ్యులు, యువ‌త‌కు తినిపించారు. నగర వాసులందరికీ కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపారు. నేరాల నియంత్రణలో గతేడాది ప్రజల నుంచి మంచి సహకారం ఉందన్నారు. ఈ ఏడాది కూడా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజల కోసమే పోలీసులు పనిచేస్తున్నారని.. తాము ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని చెప్పారు. నూతన సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్యాలు ఉండాలని ఆకాంక్షించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement