త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Drunk And Drive | సైబరాబాద్ ప‌రిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్.. 205 మందిపై కేసులు న‌మోదు

Drunk And Drive | సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ (Cyberabad Police Commissionerate) పరిధిలో పోలీసులు వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk And Drive) నిర్వ‌హించారు. ఈ త‌నిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 205 మందిపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు.

D

Telangana | Published On Nov 1, 2026, 12.52 pm IST

Drunk And Drive | సైబరాబాద్ ప‌రిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్.. 205 మందిపై కేసులు న‌మోదు
Advertisement

Drunk And Drive | త్రినేత్ర న్యూస్ : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ (Cyberabad Police Commissionerate) పరిధిలో పోలీసులు వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk And Drive) నిర్వ‌హించారు. ఈ త‌నిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 205 మందిపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో 177 ద్విచక్ర వాహనదారులు కాగా, 8 ఆటోలు, 20 కార్లు ఉన్నాయి. ఈ విష‌యాన్ని సైబ‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎక్స్ వేదిక‌గా వెల్ల‌డించారు.

మొత్తంలో 11 మందికి బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ (BAC) స్థాయిలు 300 mg/100 ml కంటే ఎక్కువగా నమోదయ్యాయని చెప్పారు. 174 మంది 36 ఎం జీ/100 ఎంఎల్ నుంచి 200 ఎంజీ/100 ఎంఎల్ మధ్య, 20 మంది 201 ఎంజీ/100 ఎంఎల్ నుంచి 300 ఎంజీ/100 ఎంఎల్ మధ్య, 11 మంది 301 ఎంజీ/100 ఎంఎల్ నుంచి 550 ఎం జీ/100 ఎంఎల్ మధ్య ఆల్కహాల్‌ సేవించిన‌ట్లు తేలింద‌న్నారు.

మ‌ద్యం సేవించి డ్రైవింగ్ చేయ‌డం తీవ్ర‌మైన నేర‌మ‌ని సైబరాబాద్‌ పోలీసులు స్ప‌ష్టం చేశారు. మ‌ద్యం మ‌త్తులో వాహ‌నం న‌డిపి ప్ర‌మాదానికి కార‌ణ‌మైతే భారతీయ న్యాయ సంహిత (BNS) – 2023లోని సెక్షన్ 105 కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సెక్షన్ కింద గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా పడే అవకాశం ఉందని తెలిపారు. తాజాగా ప‌ట్టుబ‌డిన 205 మందిని చ‌ట్ట‌ప్ర‌కారం కోర్టులో హాజ‌రుప‌ర్చ‌నున్న‌ట్లు పోలీసులు తెలిపారు. గత వారంలో 289 డ్రంక్‌ డ్రైవింగ్‌ కేసులను కోర్టులు పరిష్కరించాయని వెల్ల‌డించారు. 26 మందికి జరిమానా, జైలు శిక్ష, ఇద్ద‌రికి జరిమానా, సోషల్‌ సర్వీస్, 261 మందికి జరిమానా విధించిన‌ట్లు ట్రాఫిక్‌ పోలీస్ అధికారులు వివ‌రించారు.

Also Read..

నీటి సంరక్షణను బాధ్య‌త‌గా స్వీక‌రించాలి : ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి

10 నిమిషాల్లో ఇరాన్ అణు స్థావ‌రాల‌ను నాశ‌నం చేస్తాం : ట్రంప్

ఢిల్లీలో రాజకీయ వేడి.. బీజేపీ, ఇండీ కూట‌మి పోటాపోటీ ర్యాలీలు.. రాజ‌ధానిలో 10 వేల మంది పోలీసులు మోహ‌రింపు

ట్యాగ్స్:

Cyberabad Police CommissionerateCyberabad Traffic PoliceDrunk And DriveTelangana NewsWeekend Special Drunk And Drive Checking
Advertisement
Advertisement