త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Koyyala Ruth John Paul | ఎమ‌ర్జెన్సీ మెడిసిన్‌లో ఎండీ పూర్తి చేసిన మొద‌టి ట్రాన్స్ మ‌హిళ‌

Koyyala Ruth John Paul | ఎమర్జెన్సీ మెడిసిన్‌లో ఎండీ పూర్తిచేసి, దేశంలోనే ఈ ఘనత సాధించిన మొట్టమొదటి ట్రాన్స్ మహిళగా నిలిచిన డాక్టర్ కొయ్యల రూత్ జాన్ పాల్‌( Koyyala Ruth John Paul ) సంకల్పాన్ని హైద‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్( CP Sajjanar ) అభినందించి స‌త్క‌రించారు.

S

Telangana | Published On Oct 28, 2026, 5.23 pm IST

Koyyala Ruth John Paul | ఎమ‌ర్జెన్సీ మెడిసిన్‌లో ఎండీ పూర్తి చేసిన మొద‌టి ట్రాన్స్ మ‌హిళ‌
Advertisement

Koyyala Ruth John Paul | త్రినేత్ర న్యూస్ : ఎమర్జెన్సీ మెడిసిన్‌లో ఎండీ పూర్తిచేసి, దేశంలోనే ఈ ఘనత సాధించిన మొట్టమొదటి ట్రాన్స్ మహిళగా నిలిచిన డాక్టర్ కొయ్యల రూత్ జాన్ పాల్‌(Koyyala Ruth John Paul ) సంకల్పాన్ని హైద‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్( CP Sajjanar ) అభినందించి స‌త్క‌రించారు. ఒకప్పుడు వ్యవసాయ కూలీగా పనిచేస్తూ ఎన్నో కష్టాలు, వివక్షను ఎదుర్కొన్నప్పటికీ... పట్టుదలతో చదువుకుని, న్యాయపోరాటం చేసి పీజీ పూర్తిచేసిన ఆమె జీవన ప్రయాణం ప్రశంసనీయమ‌ని పేర్కొన్నారు.

ప్రస్తుతం సనత్‌నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి అత్యవసర విభాగంలో సేవలందిస్తూ ఎందరో రోగుల ప్రాణాలు కాపాడుతున్నారు. అన్ని అవరోధాలనూ అధిగమించి నిలిచిన ఈ తొలి ట్రాన్స్ వైద్యురాలి అకుంఠిత దీక్ష సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకం. డాక్టర్ రూత్ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని, తన లక్ష్యాలను చేరుకోవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. ఈ ప్రయాణంలో డాక్టర్ రూత్‌కి వెన్నుదన్నుగా నిలిచి సహకరించిన ముకుంద మాలకి, వైజయంతి వసంతకి, రచన ముద్రబోయినకి నా ప్రత్యేక ధన్యవాదాలు అని స‌జ్జ‌నార్ తెలిపారు.

Advertisement
Advertisement