త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Drugs Party | మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్ర‌గ్స్ పార్టీ.. పోలీసుల‌పై కాల్పులు

Drugs Party | తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డికి (Pilot Rohith Reddy) చెందిన మొయినాబాద్ (Moinabad) ఫాంహౌస్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. గ‌తంలో దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారం ఈ ఫామ్‌హౌస్ కేంద్రంగానే జ‌రిగిన విష‌యం తెలిసిందే. తాజాగా డ్ర‌గ్స్ పార్టీ (Drugs Party), కాల్పులు కలకలం సృష్టించాయి.

G

Telangana | Published On Mar 15, 2026, 6.09 am IST

Drugs Party | మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్ర‌గ్స్ పార్టీ.. పోలీసుల‌పై కాల్పులు
Advertisement

Drugs Party | త్రినేత్ర‌.న్యూస్‌: తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డికి (Pilot Rohith Reddy) చెందిన మొయినాబాద్ (Moinabad) ఫాంహౌస్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. గ‌తంలో దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారం ఈ ఫామ్‌హౌస్ కేంద్రంగానే జ‌రిగిన విష‌యం తెలిసిందే. తాజాగా డ్ర‌గ్స్ పార్టీ (Drugs Party), కాల్పులు కలకలం సృష్టించాయి. మొయినాబాద్ మున్సిపాలిటీ ప‌రిధిలోని అజీజ్‌న‌గ‌ర్‌లో ఉన్న ఈ ఫామ్‌హౌస్‌లో డ్ర‌గ్స్ పార్టీ జ‌రుగుతుంద‌న్న స‌మాచారంతో శ‌నివారం రాత్రి ఈగ‌ల్ టీం, ఎస్ోటీ పోలీసులు మెరుపుదాడులు నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా పార్టీలో రోహిత్ రెడ్డి, అత‌ని సోద‌రుడు రితేశ్ రెడ్డి, ఏపీలోని ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మ‌హేశ్ కుమార్ యాద‌వ్‌, మొరగనేని రమేశ్‌, వి.శ్రావణ్‌ కుమార్‌, నల్లపనేని విజయ్‌ కృష్ణ, రాజ‌స్థాన్‌లోని జైపూర్‌ మాజీ ఎమ్మెల్యే నితీశ్ శ‌ర్మ, ఢిల్లీకి చెందిన రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి న‌మీద్ మిశ్రా, కాసిక్ ర‌వి, అర్జ‌న్ రెడ్డి, ఓ మ‌హిళ‌తో పాటు ప‌లువురు వీఐపీలు ఉన్న‌ట్లు గుర్తించారు. వీరంద‌రికి డ్ర‌గ్స్ టెస్టు నిర్వ‌హించ‌గా.. రోహిత్ రెడ్డి, అత‌ని సోద‌రుడితోపాటు మ‌రో ఆరుగురు కొకైన్ తీసుకున్న‌ట్లుగా తేలింది. మిగిలినవారిని ప‌రీక్ష‌ల నిమిత్తం ఎర్ర‌గ‌డ్డ ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. వీరికి డ్ర‌గ్స్ ఎక్క‌డి నుంచి స‌ర‌ఫ‌రా అయ్యింద‌నే వివ‌రాలు రాబ‌డుతున్నారు.

కాల్పుల క‌ల‌క‌లం..

డ్ర‌గ్స్‌ పార్టీ జరుగుతుంన్న‌దన్న ప‌క్కా సమాచారంతో ఈగల్ టీం ఫాంహౌస్‌లోకి వెళ్తుండ‌గా అక్క‌డ ఉన్న యువ‌కులు అడ్డుకున్నారు. ఈ క్ర‌మంలో తుపాకీతో గాలిలోకి నాలుగు రౌండ్లు కాల్పులు జ‌రిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్‌వోటీ) రంగంలోకి దిగింది. పోలీసుల సోదాల్లో 2 గ్రాముల కోకైన్‌, ఇతర మత్తు పదార్థాలతోపాటు రివాల్వర్‌ స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది మంది డ్రగ్స్‌ పార్టీ చేసుకుంటున్నట్లు తెలిసింది. వీరందరినీ అదుపులోకి తీసుకుని పరీక్షల్లో వ‌చ్చిన రిపోర్టుల ఆధారంగా అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డిని కూడా అరెస్టు చేసిన‌ట్లు తెలుస్తున్న‌ది. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు. కాగా, డ్ర‌గ్స్ పాజిటివ్ వ‌చ్చిన‌వాళ్లు వారం కింద సిమ్లా నుంచి వ‌చ్చాం, గోవా నుంచి వ‌చ్చాం. అక్క‌డ సేవించిన‌ట్లు చెబుతున్నార‌ని డీసీపీ వెల్ల‌డించారు. ర‌క్త న‌మూనాల‌ను ప‌రీక్ష కోసం ఎఫ్ఎస్ఎల్‌కు పంపిస్తామ‌న్నారు.

ఇవికూడా చ‌ద‌వండి..

మార్చి 15 రాశిఫ‌లాలు.. ఈ రాశివారు మానసికంగా గందరగోళంగా ఉంటారు!

సీఎం రాకముందే హెలిప్యాడ్‌లోకి దూసుకొచ్చిన ఎద్దు.. పరుగులు పెట్టిన పోలీసులు.. VIDEO

హార్ముజ్ జలసంధికి విదేశీ యుద్ధనౌకలు.. ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ మరో స్ట్రాంగ్ వార్నింగ్!

Advertisement
Advertisement