Drugs Party | హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ పార్టీ.. మహిళ సహా ఆరుగురికి పాజిటివ్..
Drugs Party | హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ పార్టీ (Drugs Party) కలకలం రేపింది. గత నెలలో మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తూ పలువురు ప్రముఖులు పట్టుబడిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం కొండాపూర్‌లోని (Kondapur) క్వాక్ ఏరీనా పబ్‌లో (Quake Pub) 64 మందికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా, మరో 8 మంది మత్తుమందు తీసుకున్నట్లుగా తేలింది.
Drugs Party | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ పార్టీ (Drugs Party) కలకలం రేపింది. గత నెలలో మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తూ పలువురు ప్రముఖులు పట్టుబడిన విషయం తెలిసిందే. వారిలో 8 మందికి పాజిటివ్ వచ్చింది. రెండు రోజుల క్రితం కొండాపూర్‌లోని (Kondapur) క్వాక్ ఏరీనా పబ్‌లో (Quake Pub) 64 మందికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా, మరో 8 మంది మత్తుమందు తీసుకున్నట్లుగా తేలింది. తాజాగా ప్రముఖ పర్యాటక ప్రాంతం చారిత్రక గోల్కొండలోని తారామతి బారాదరి రిసార్టులో డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో ఈగల్ టీమ్ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్‌గా తేలింది.
శనివారం ‘మోర్ దెన్ ఫ్రెండ్స్’ పేరుతో తారామతి బారాదరి రిసార్టులో ఒక ప్రైవేట్ ఈవెంట్ నిర్వహించారు. పర్యాటక ప్రచారంలో భాగంగా ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు వేడుకకు చివరి నిమిషంలో పోలీసుల అనుమతి కోసం ప్రయత్నించారు. అయితే పోలీసులు పర్మిషన్ ఇవ్వకముందే ఈవెంట్‌ను ప్రారంభించారు. 200 మందికిపైగా హాజరైన వేడుకకు డ్రగ్స్ వినియోగదారుల అనుమానిత జాబాతాలో ఉన్న వారు వెళ్లినట్లు సమాచారం అందుకున్న ఈగల్ టీమ్.. స్థానిక గోల్కొండ ఠాణా పోలీసులతో కలిసి రాత్రి 10 గంటల సమయంలో ఆకస్మిక సోదాలు నిర్వహించారు.
అనుమానాస్పదంగా ఉన్న దాదాపు 36 మందిని డ్రగ్స్ కిట్లతో పరీక్షించగా ఓ మహిళ సహా ఆరుగురికి పాజిటివ్‌గా తేలింది. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పాజిటివ్ వచ్చిన వారిలో పరం సి నిహార్, ఆశి, యోగేశ్వర్, అబ్దుల్ సర్వర్, జాసన్ అనే వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈపార్టీని చంద్ర అనే వ్యక్తి నిర్వహించినట్లు సమాచారం. ఈ పార్టీలో సినిమా జూనియర్ ఆర్టిస్టులు కూడా ఉన్నట్లు తెలుస్తున్నది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




